కలల ఫోను కోసం కదలిరండి

 నేడు అనేక రకాల ఫోన్లు వివిధ రకాల విశిష్టతలతో మన ముందుకు వస్తున్నాయి. ఎన్ని ఫోన్లు వచ్చినపటికి డెస్క్ టాప్ కి ప్రత్యామ్నాయం కాలేకపోతున్నాయి. ఫోన్ తో చెయ్యగల పనులు మునపటి కన్నా గణణీయంగా పెరిగినప్పటికి ఫోన్లకి గల పరిమితుల వలన డెస్క్ టాప్ ఆధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. డెస్క్ టాప్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి మరో అడుగు ముందుకు పడబోతుంది. దానికి మన చేయుత కావాలి. దానికి ప్రతిఫలంగా పరిమితంగా తయారు చేయబడుతున్న కలల ఫోన్లని సొతం చేసుకోవచ్చు.
 గత వారం రోజులుగా నెట్టింట్లో ఎక్కువగా చర్చించబడుతున్న ఈ ప్రాజెక్టు విజయవంతమైతే కచ్చితంగా మనం భవిష్యత్తరం ఫోన్ని తొందరలోనే చూడగలం. వ్యక్తిగత కంప్యూటింగ్ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోయే ఈ కలల ఫోన్లో మొబైల్ ఫోన్ మరియు డెస్క్ టాప్ కలిసి ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న ఉచిత డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం(ఉబుంటు) మరియు మొబైల్ ఆపరేటింగ్ సిస్టం(ఆండ్రాయిడ్) కలయికతో రాబోతున్న ఈ ఫోన్ ప్రజల విరాళాలతో తయారుకాబోతుంది. జన విరాళాల చరిత్ర రికార్డులని చెరిపి మొదటి ఏడురోజులలో ఏడు మిలియన్ డాలర్లను పోగుచేసి లక్ష్యం(32 మిలియన్ డాలర్లు) దిశగా దూసుకుపోతున్నది. అదే ఉబుంటు ఎడ్జ్ ఫోన్. 

ఉబుంటు ఎడ్జ్ ఫోన్ యొక్క విశిష్టతలు: 
  • ఆండ్రాయిడ్ మరియు ఉబుంటు మొబైల్ ఆపరేటింగ్ సిస్టం డ్యూయల్ బూట్
  • మానీటర్ కి తగిలించగానే డెస్క్ టాప్ కంప్యూటర్ గా మారిపోతుంది
  • మల్టికోర్ ప్రాససర్
  • 4జిబి రాం 
  • 128 జిబి స్టోరేజ్
  • మైక్రో సిమ్
  • 4.5 అంగుళాల హెచ్ డి తెర
  • వజ్రం లాంటి గట్టిదనం గల సఫైర్ క్రిస్టల్ గ్లాస్ తెర
  • ముందు 2,వెనుక 8 మెగాపిక్సల్ కెమేరా
  • 4G,వైఫి,NFC
  • స్టీరియో స్పీకర్లు
  • సిలికాన్ ఆనోడ్ లిధియం బేటరి


 






మరింకెందుకు ఆలస్యం కలల ఫోన్ ని విరాళాల ద్వారా సాదించుకుందాం. పూర్తి వివరాలకు ఇక్కడ చూడండి. విరాళాలను ఇక్కడ అందజేయవచ్చు. ఒకవేళ 32 మిలియన్ డాలర్లు లక్ష్యాన్ని చేరుకోలేకపోతే ఎవరి డబ్బు వారికి తిరిగి ఇవ్వబడుతుంది. కలల ఫోన్ కలగానే మిగిలి పోతుంది.