ప్రముఖ ఒపెన్ సోర్స్ వెబ్ బ్రౌసర్ అయిన ఫైర్ ఫాక్స్ యొక్క కొత్త వెర్షను ఫైర్ ఫాక్స్ 15 ఈరోజు విడుదల కాబోతుంది. PDF ఫైళ్ళను తెరవడానికి కావలసిన సామర్ధ్యం, మెరుగు పరచబడిన యాడ్ ఆన్ల మెమొరీ వాడకం, అభివృధ్ది పరచబడిన విశిష్టతలతో మరియు సవరించిన దోషాలతో విడుదల కాబోతుంది. దీనిని ఉచితంగా ఫైర్ ఫాక్స్ వెబ్ సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఫైర్ ఫాక్స్ వాడుతున్నవారు అప్ డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఉబుంటు వాడుతున్న వారు తొందరలో ఉబుంటు అప్ డేట్స్ ద్వారా ఫైర్ ఫాక్స్ 15 ని పొందుతారు.
గమనిక: ఫైర్ ఫాక్స్ 15 లో PDF ఫైళ్ళను తెరవడానికి కావలసిన సామర్ధ్యం కల్పించలేదు. పూర్తి సిద్దం కాకపోవడం వలన చివరి వరకు ఫైర్ ఫాక్స్ 15 బీటాలో ఉన్న ఈ సదుపాయాన్ని ఫైర్ ఫాక్స్ 15 లో అందించలేదు. వచ్చే విడుదలలో PDF ఫైళ్ళను తెరవడానికి కావలసిన సామర్ధ్యం అప్రమేయంగా అందుబాటులోకి రావచ్చు.