ఉబుంటు ప్రతి ఆరు నెలలకి ఒక కొత్త వెర్షన్ విడుదల అగును.కొత్త విడుదలలో పాత దానిలో ఉన్న దోషాలను సరిచేసి, కొత్త ఫీచర్స్ తో అందిస్తారు.కనుక కొత్త వెర్షన్ ని వాడడం మంచిది.విడుదల అయిన ప్రతి సారి మనం ఇన్ స్టాల్ చెయ్యడం కష్టం కాబట్టి ఉబుంటు నెట్ వర్క్ అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.కొత్త వెర్షన్ అందుబాటు లో ఉన్నపుడు అప్ డేట్ మేనేజర్ మనకి చూపిస్తుంది.మొదట పాత వెర్షన్ కి సంబందించిన అప్ డేట్ లన్ని ఇన్ స్టాల్ చేసుకొని ఆ తరువాత వెర్షన్ అప్ గ్రేడ్ ని చేసుకోవాలి.క్రింది చిత్రాల్లో అప్ గ్రేడ్ చేసే విధానము,అప్ గ్రేడ్ అయిన తరువాత మార్పులని గమనించవచ్చు. అప్ గ్రేడ్ అవడానికి 600MB నుండి మనం ఇన్ స్టాల్ చేసుకొన్న అప్లికేషన్ లని బట్టి 1GB వరకు డౌన్ లోడ్ చేసుకోవలసి వచ్చును.కనుక ఇంటర్ నెట్ నెమ్మది గా ఉంటే నెట్ వర్క్ అప్ గ్రేడ్ ప్రయత్నించకపోవడం మంచిది.కొత్త వాటినిడౌన్ లోడ్ చేసుకొంటున్నపుడు కంప్యూటర్ ఆగిపోయిన పర్వాలేదు మరలా అప్ గ్రేడ్ ని ప్రయత్నించవచ్చు.కాని ఇన్ స్టాల్ అయ్యేటపుడు కంప్యూటర్ ఆగిపోతే ఆపరేటింగ్ సిస్టం పాడయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి కరెంటు పోని సమయాల్లో లేదా ప్రత్యామ్నాయం(UPS,Inverter) ఉన్నపుడే ప్రయత్నించండి.