ఉచితం! మరి మనమేం చేయాలి?

ఉబుంటు, డెబియన్, లినక్స్, లినక్స్ మింట్, వియల్సి, ఫైర్ ఫాక్స్, లిబ్రే ఆఫీస్, ఆండ్రాయిడ్ వంటి మరెన్నో స్వేచ్చా సాఫ్ట్వేర్లు మన నిత్య జీవితంలో ప్రత్యక్షంగానో,పరోక్షంగానో వాడుతుంటాంము. స్వేచ్చా సాఫ్ట్వేర్లు ఉచితంగా వాడుకోవచ్చు, మనకి నచ్చినట్లు మార్చుకోవచ్చు, ఇతరులతో పంచుకోవచ్చు. ఓపెన్ సోర్స్ సమాజం నుండి ఇంత వాడుకుంటున్న
మనమేం చేయాలి? ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లను విరివిగా వాడుకోవడమే మనం మొదట చేయవలసిన పని. తరువాత చేయవలసినవి ఏమిటంటే

ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లను వృధ్ది చేయడానికి మనం చేయవలసిన పనులు :

సాధారణ కంప్యుటరు వాడుకరి - ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లను విరివిగా వాడుకోవడం,తెలియనివారికి తెలియజెప్పడం
ఉత్సాహవంతుడైన కంప్యుటరు వాడుకరి - పైన చెప్పిన వాటితోపాటు దోషాలను నివేదించడం (బగ్ రిపోర్టింగ్)
ప్రోగ్రామింగ్ నైపుణ్యం గల వాడుకరి - పైన చెప్పినవి మరియు దోషాలను సరిచేయడం అభివృధ్దిలో పాలుపంచుకోవడం
బ్లాగులు రాసేవారు - తాము స్వయంగా వాడి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లను గురించి రాయడం
బ్లాగులు చదివేవారు - తాము చదివినవాడిని టపా చివరన ఉన్న మార్గాలను(షేరింగ్) వాడి మిగిలిన వారికీ తెలియజెప్పడం 
డబ్బున్నవారు - తమకు నచ్చిన స్వేచ్చా సాఫ్ట్వేర్లకి తోచినంత విరాళాలు అందించడం
విధ్యాలయాలు -  స్వేచ్చా సాఫ్ట్వేర్లని గూర్చి కూడా విద్యార్ధులకి బోదించడం
విద్యార్ధులు - సమాజానికి ఉపయోగపడే  స్వేచ్చా సాఫ్ట్వేర్లను గూర్చి తెలుసుకొని అభివృధ్దిలో పాలుపంచుకోవడం
ప్రభుత్వాలు -  స్వేచ్చా సాఫ్ట్వేర్లను వాడడం,వాటిని ప్రజలను వాడేటట్లు చేయడం వలన ప్రజాధనాన్ని అదా చేయడం