మీ డెస్క్ టాప్ ని వీడియో తీయడానికి

మనం ఏదైనా సాఫ్ట్వేర్ వాడే విధానం గురించి ఇతరులకి తెలియచేయడానికి పాఠ్యరూపంలో వివరించడం లేదా దాని యొక్క చిత్రాన్ని (స్క్రీన్ షాట్) లను చూపించడం ద్వారా వారికి అర్ధమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తుంటాము. ఇంకాసులభంగా అర్ధమవడానికి వీడియో రూపంలో కూడా వివరించవచ్చు. ఈమధ్య ఈవిధానం బాగా ప్రాచుర్యం
పొందినది. ఎటువంటి అనుభవం లేనివారయినా సులభంగా డెస్క్ టాప్ వీడియోలను తీయవచ్చు. recordMyDesktop అను ఉచిత అనువర్తనం (అప్లికేషన్) ఉపయేగించి లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలలో సులభంగా డెస్క్ టాప్ ని రికార్డు చేయవచ్చు. ఉబుంటు వాడేవారు నేరుగా ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
రికార్డ్ మై డెస్క్ టాప్ యొక్క విశిష్టతలు:
  • పూర్తి డెస్క్ టాప్ ని లేదా డెస్క్ టాప్ లో ఎంచుకున్న ప్రదేశాన్ని వీడియోగా రికార్డ్ చేయవచ్చు.
  • ఆడియోతో కలిపి రికార్డ్ చేయవచ్చు.
  • కావలసిన విధంగా ఆడియో, విడియోల నాణ్యతని అమర్చుకోవచ్చు.
రికార్డ్ మై డెస్క్ టాప్