డివిడిలు రిప్ చేయడానికి, విడియోలు కన్వర్ట్ చేయడానికి హేండ్ బ్రేక్ అనే ఉచిత స్వేచ్చా సాప్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఇది విండోస్,మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టముల పై పనిచేస్తుంది.దీనిని ఉపయోగించి సీడీ, డివిడి మరియు బ్లూరే డిస్కులు రిప్ చేసుకోవచ్చు.అంతేకాకుండా ఐఫోన్, ఆపిల్ టీవి, ఐపాడ్, ఆండ్రాయిడ్ మరియు నోకియా ఫోన్లకు సరిపడు విధంగా వీడియోలను కన్వర్ట్ చేసుకోవచ్చు.
ఉబుంటు వాడువారు క్రింద ఇవ్వబడిన రెండు కమాండ్లను టెర్మినల్ నందు రన్ చెయ్యడం ద్వారా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
sudo add-apt-repository ppa:stebbins/handbrake-releases
sudo apt-get update && sudo apt-get install handbrake-gtk
లేదా ఇక్కడ నుండి మన ఉబుంటు వెర్షనుకి తగిన .deb ఫైల్‌ని డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. విండోస్, మాక్ మరియు ఇతర లినక్స్ ఆపరేటింగ్ సిస్టములు వాడుతున్నవారు ఇక్కడ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.