స్క్రీన్ షాట్లు తీయడానికి అత్యుత్తమ మార్గం

సాధారణంగా స్క్రీన్ షాట్లు తీయడానికి కీబోర్డ్ లో ప్రింట్ స్క్రీన్ ని ఉపయోగిస్తాము. దాని ద్వారా పూర్తి తెరను మనం ఫొటో తీయవచ్చు. ఇంకా సాధికారతతో అత్యుత్తమమంగా స్క్రీన్ షాట్లు తీయడానికి షట్టర్ అనే ఉచిత అనువర్తనమును ఉపయోగించవచ్చు. ఇది దాదాపు అన్ని లినక్స్ పంపకాలలో అందుబాటులో ఉంది. ఉబుంటులో దీనిని ఉబుంటు సాఫ్ట్వేర్
సెంటర్ నుండి స్థాపించవచ్చు.

షట్టర్ యొక్క విశిష్టతలు:

  •  పూర్తి డెస్క్ టాప్ ని ఫొటో తీయవచ్చు.
  • ఎంచుకున్న విండోని ఫొటో తీయవచ్చు.
  • డెస్క్ టాప్ లో ఎంచుకున్న ప్రదేశాన్ని ఫొటో తీయవచ్చు.
  •  ఎంచుకున్న మెనూని లేదా టూల్ టిప్ ని ఫొటో తీయవచ్చు.
  • వెబ్ సైట్ ని ఫొటో తీయవచ్చు.
  • తీసిన స్క్రీన్ షాట్లని సవరించవచ్చు.
  • అక్షరాలు, బాణం గుర్తు, వృత్తాలు, చతురస్రాకార మరియు దీర్ఘచతురస్రాకారాలను చేర్చవచ్చు.
  • వ్యక్తిగత సమాచారాన్ని దాచవచ్చు, చెరపవచ్చు.
  • స్క్రీన్ షాట్లని తగిన పరిమాణానికి కత్తిరించవచ్చు.
  • తీసిన, సవరించిన స్క్రీన్ షాట్లని నేరుగా ఆన్ లైన్ లోకి ఎగుమతి చేయవచ్చు.
 షట్టర్ యొక్క విశిష్టతలు