ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న వెబ్ బ్రౌసర్ గూగుల్ క్రోం.లినక్స్ ఆపరేటింగ్ సిస్టం వాడేవారికోసం కూడా గూగుల్ వారు గూగుల్ క్రోం వెబ్ బ్రౌసర్ ని అందుబాటులో ఉంచారు.దీనిని గూగుల్ క్రోం డౌన్లోడ్ పేజి నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
క్రోమియం క్రోం |
అయితే మరి ఈ క్రోమియం ఏమిటి?
క్రోమియం వెబ్ బ్రౌసర్ అనేది గూగుల్ క్రోం ఆదారిత ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌసర్.దీనిని మనం ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.ఇది గూగుల్ క్రోం కి ప్రతిబింబం లా ఉంటుంది.క్రోం యాడ్ ఆన్లు అన్ని క్రోమియం వెబ్ బ్రౌసర్లో కూడా పనిచేస్తాయి.