ప్రియమైన సాఫ్ట్‌వేర్ క్రాకర్లకు (హ్యాకర్లకు),
సగటు పైరేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడుకరి వ్రాయునది ఏమనగా...

మీరు ఇప్పటివరకూ ఎన్నో విలువైన వాణిజ్య సాఫ్ట్‌వేర్లను ఉచితంగా మాతో పంచుకున్నారు. మీ అద్భుతమైన ప్రతిభా పాటవాలనూ, విలువైన సమయాన్నీ వెచ్చించి మా కొరకు చాలా కృషి చేసారు. మీ వల్ల లాభం పొందిన మేము మీకు
తప్పకుండా కృతజ్ఞతలను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా సొంత లాభాన్ని ఆశించకుండా మా కొరకు ఇంత చేసిన మీరు అజ్ఞాతంగానే ఉండటం మాకు బాధ కలిగిస్తుంది. మీరే ఎందుకు సాఫ్టువేర్లను అభివృద్ధి చేయకూడదు? వాటిని మాబోటి వారికి ఉచితంగా లేదా నామమాత్రపు వెలకు అందిచవచ్చు కదా. ఎవరో తయారుచేసిన సాఫ్టువేరుకి క్రాక్ లేదా కీజెన్ తయారుచేసి చట్టవిరుద్ధంగా ఆ సంస్ధకు నష్టం కల్గించడం ఎందుకు? దీర్ఘకాలికంగా మనమే ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించుకోవడం సబబు కదా? దయచేసి మీరు తాత్కాలిక ప్రయోజనాన్నిచ్చే ఇటువంటి పనులు మానుకొని జనులందరికీ చట్టబద్ధంగా అందుబాటులో ఉండే స్వేచ్ఛా మరియు ఓపెన్ సోర్సు సాఫ్టువేర్ల అభివృద్ధిలో భాగస్వాములవుతారని భావిస్తున్నాను.

ఉబుంటు, టైజన్, ఆండ్రాయిడ్, ఫైరుఫాక్స్, వీయెల్సీ, గింప్, లిబ్రేఆఫీసు, డెబియన్ లాంటి మిగిలిన స్వేచ్ఛా మరియు ఓపెన్ సోర్సు సాఫ్టువేర్ల అభివృద్ధిలో మీ అమూల్యమైన తోడ్పాటుని అందించి మరెన్నో ఓపెన్ సోర్సు అద్భుతాలను ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నాను.
ఇట్లు,
మీ సగటు పైరేటెడ్ సాఫ్టువేర్ వాడుకరి.