ఆఫీస్ అవసరాలకు వాడే సాఫ్ట్వేర్ని ఆఫీస్ సూట్ అంటారు. ఒక సాదారణ
ఆఫిస్ సూట్లొ వ్యాసాలు రాయవచ్చు, ప్రసెంటేషన్లు ఇవ్వవచ్చు, కంపెనీ ఖతాలు
దాచటం వంటి పనులతొ పాటూ మరెన్నో పనులు కూడా చెయ్యవచ్చు. అన్ని ఆఫీస్
సూట్లలోనూ ఎక్కువగా వాడే ఆఫీస్ సూట్ "మైక్రొసాఫ్ట్ ఆఫీస్". మైక్రొసాఫ్ట్
ఆఫీస్‌లొ వ్యాసాలు రాయటానికి వాడే
సాఫ్ట్వేర్ని మైక్రొసాఫ్ట్ వర్డ్ అంటారు. మైక్రొసాఫ్ట్ వర్డ్ వాడి మీరు ఒక వ్యాసాన్ని రాసి ఫైలులొ భద్రపరిస్తె ఆ ఫైల్ ను వర్డ్ డాక్యుమెన్ట్ అంటారు. వీటి పేరులొ సాదారణంగా చివరలొ .doc వుంటుంది. ఈ వ్యాసంలొ వర్డ్ డాక్యుమెన్ట్‌ల వల్ల మీకు వచ్చే నష్టాలు వటిని ఎదుర్కోవడానికి కొన్ని మార్గాలు చర్చించ బడ్డాయి. మైక్రొసాఫ్ట్ ఆఫీస్‌తొ తయారు చేసిన ఇతర ఫైళ్ళు ప్రెసెన్టెషన్లు (.ppt), స్ప్రెడ్‌షీట్లు (.xls) కూడా ఇదే విధంగా చూడవచ్చు.
సాఫ్ట్వేర్ని మైక్రొసాఫ్ట్ వర్డ్ అంటారు. మైక్రొసాఫ్ట్ వర్డ్ వాడి మీరు ఒక వ్యాసాన్ని రాసి ఫైలులొ భద్రపరిస్తె ఆ ఫైల్ ను వర్డ్ డాక్యుమెన్ట్ అంటారు. వీటి పేరులొ సాదారణంగా చివరలొ .doc వుంటుంది. ఈ వ్యాసంలొ వర్డ్ డాక్యుమెన్ట్‌ల వల్ల మీకు వచ్చే నష్టాలు వటిని ఎదుర్కోవడానికి కొన్ని మార్గాలు చర్చించ బడ్డాయి. మైక్రొసాఫ్ట్ ఆఫీస్‌తొ తయారు చేసిన ఇతర ఫైళ్ళు ప్రెసెన్టెషన్లు (.ppt), స్ప్రెడ్‌షీట్లు (.xls) కూడా ఇదే విధంగా చూడవచ్చు.
వర్డ్ డాక్యుమెన్ట్‌ల వాల్ల వచ్చే నష్ఠాలు:
వర్డ్ డాక్యుమెన్ట్‌లు మీకు హానికరమవ్వటనికి ముఖ్యమైన కారణం అవి
రహస్యమైన పద్దతిలో భద్రపరచి వుండటం. మీరు మైక్రొసాఫ్ట్ వర్డ్ వాడి దాచిన
వ్యాసం ఏ పద్దతిలో దాచి వుందో మైక్రొసాఫ్ట్ వారికి తప్ప ఎవరికీ తెలియదు.
మైక్రోసాఫ్ట్ వారు ఈ పద్దతిని వివరించటానికి నిరాకరించారు. దీనివల్ల
మైక్రొసాఫ్ట్ వారు తయారు చేసిన సాఫ్ట్వేర్ తప్ప మరే సాఫ్ట్వేర్ ఈ వాసాన్ని
చదవలేవు. కనుక మీ సమాచారం యొక్క భవిష్యత్తు అమెరికాలొ ఒక కంపెనీ ఐన
మైక్రొసాఫ్ట్ వారిపై ఆధార పడివునట్టె.
మైక్రొసాఫ్ట్ వారు వర్డ్ డాక్యుమెంట్ల దాచే విధానాన్ని తరచూ అవసరం
లేకపోయినా మరుస్తుంటారు. మైక్రొసాఫ్ట్ ఆఫీస్ ఇప్పటికి చాలా వర్షన్లలొ
విడుదల అయ్యింది (4.0, 95, 98, 2000, XP మరియు ఇప్పుడు 2003).
వీటన్నింటిలోనూ వర్డ్ డాక్యుమెన్ట్‌లు దాచె విధానం మారిపోయింది. దీనివల్ల
ఒక వర్షన్లొ రాసిన వ్యాసం వేరే వర్షన్లొ చుడటం కుదరక పోవచ్చు. ఉదాహరణకు
2003 సంవత్సరంలొ కొన్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌తొ రాసిన వ్యాసం మీ స్నేహితుడు
మీకు పంపితె మీరు మీ వద్ద వున్న 2000 సంవత్సరం నాటి మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌తొ
దాన్ని చూడలేరు. ఈ విధంగా మైక్రొసాఫ్ట్ వారు కొత్త వర్షన్ విడుదల
చేసినప్పుడల్లా చాలా డబ్బులు వెచ్చించి ఆ కొత్త వర్షన్ కొనేలా మిపై ఒత్తిడి
వుంటింది. ఇది మైక్రొసాఫ్ట్ వారు వారి వ్యాపారానికి నిలకడగా ఆదాయం
వస్తుండటం కోసం వేసిన పదకం. అంతే కాకుండా కొన్ని సార్లు కొత్త వర్షన్లలో
పాత వ్యాసాలు చుడలేక పోవటం కూడా జరుగుతుంది. ఇది తరచుగా వ్యాసాలు దాచె
పద్దతిని మార్చడం వాల్ల వచ్చిన సమస్య.
వర్డ్ డాక్యుమెంట్లలో వైరెస్లు వుండే ప్రమాదం వుంది. మీకు ఎవరైనా
వైరస్‌తొ కూడుకున్న వర్డ్ డాక్యుమెన్ట్‌లు పంపినప్పుడు, మీరు దానిని
చూడటానికి ప్రయత్నిస్తే చాలు ఆ వైరస్ మీ కంప్యూటర్కి సోకుతుంది. నిజానికి
చాలా వైరస్లు ఈ విధంగానే వ్యాప్తి చెందుతాయి. ఒక సారి వైరెస్ కంప్యుటర్ని
సోకినిన తరువాత వైరెస్నిబట్టి అది ఏమైనా చేయవచ్చు. కొన్ని వైరస్లు మీ
కంప్యూటర్ని వైరెస్‌తొ కూడిన ఈ-మైళ్ళను పంపటంతొ ఊరుకుంటాయి. కాని కొన్ని మీ
కంప్యూటర్లొ ఉన్న సమాచారానంతా తుడిచివేసి, మీరు మీ కంప్యూటర్ని వాడలేకుండా
చేస్తాయి.అంతే కాదు మీకు తెలియ కుండా వర్డ్ డాకుమెంట్లలో మీరు ఇతరులకు
ఇవ్వకూడదనుకునే చాలా సమాచారం వుండే అవకాశం వుంది. మీరు వ్యాసాన్ని ఎలా
మార్పులు చేశారు, దాని చరిత్ర, ఎవరెవరు ఎప్పుడెప్పుడు దానికి ఏవేమార్పులు
చెసారు, ఈ సమాచారమంతా వర్డ్ డాక్యుమెంట్లలో మీకు కనిపించ కుండా వుండవచ్చు. ఈ
విషయం తెలియని వారు సిగ్గు పోయే సామాచరం దగ్గరనుండి దేశ భద్రతకు
సంభందించిన సమాచారం వరకు పోకొట్టుకునారు (http://news.bbc.co.uk/2/hi/technology/3154479.stm).
మీరు వ్యాసాన్ని కనుక వర్డ్ డాక్యుమెంట్‌లా మీ స్నేహితునికి పంపితె,
అతను పది వేల రుపాయలకు పైగా వెచ్చించి మైక్రొసాఫ్ట్ విండోస్, ఆపై
మైక్రొసాఫ్ట్ ఆఫీస్ కొనవలసిన అవసరం వస్తుంది. లెదా అతను చట్ట విరుద్దంగా ఈ
సాఫ్ట్వేర్‌ను కాపీ చేసి తెచ్చుకోవలసిన అవసరం వుంటుంది. వర్డ్
డాక్యుమెన్ట్‌లు రహస్యమైన పద్దతిలో వుండటం వాల్ల ఇతర ఆఫీస్ సూట్లు వీటిని
చదవలేవు. అందువల్ల మీరు వర్డ్ డాక్యుమెన్ట్‌లు మీ ఇతరులకు పంపించినప్పుడు,
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాడాలన్న వత్తిడి మీరు వారిపై కలుగచేస్తారు. చాలా మంది
మైక్రొసాఫ్ట్ వారి సాఫ్ట్వేర్‌పై ఆదారపడకుండా ఫ్రీ సాఫ్ట్వేర్లను
వాడుతుంటారు. ఇక్కడ ఫ్రీ అంటె "ఉచిత" అని కాకుండా "స్వేచ్ఛ" అని అర్ధం
వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ను మైక్రొసాఫ్ట్ ఆఫీస్ లా కాకుండా మన అవసరాలకు
అనుగుణంగా మార్చుకోవచ్చు, స్నేహితులకు చట్టబద్దంగా కాపీలు కూడా పంచవచ్చు.
అంతే కాదు, ఉచితంగా లభించి మైక్రొసాఫ్ట్ ఆఫీస్కి దీటుగా సదుపాయాలను అందచేసే
ఫ్రీ సాఫ్ట్వేర్ ఆఫీస్ సూట్లు వున్నాయి. వీటిలో ఓపెన్‌ఆఫీస్.ఆర్గ్ (Openoffice.org) అనే ఆఫీస్ సూట్ ముఖ్యమైనది.
ఓపెన్‌ఆఫీస్.ఆర్గ్ తయారుచేసిన వారు చాలా శ్రమపడి మైక్రోసాఫ్ట్ వర్డ్
రహస్యాన్ని కనిపెట్టారు. ఈ విధంగా వర్డ్ డాక్యుమెన్ట్‌లు చాలా వరకు
చదవగలిగినా, అంతా సరిగ్గా చేయటం అసాద్యం. పైగా వర్డ్ డాక్యుమెన్ట్‌లు
భద్రపరిచె పద్దతి ప్రతీ వర్షన్‌తో మరిపోతుంది. పైగా మైక్రొసాఫ్ట్ వారు ఇకపై
వచ్చే వర్షన్‌లలో కొత్త పద్దతితో వర్డ్ డాక్యుమెన్ట్‌లు వేరే వారు
చదవలేకుండా చేస్తున్నారు. అమెరికాలో మరియు ఇతర దేశాలలో వున్న సాఫ్ట్వేర్
పేటెంట్ చట్టాలను వాడి, వేరేవారు వర్డ్ డాక్యుమెన్ట్‌లు చదవటాన్నే
చట్టవిరుద్దం చేయబోతున్నారు. పైగా పెలాడియం మరియు ట్రెచరస్ కంప్యూటింగ్
(క్రింత నెల వ్యాసంలో దీనిపై చర్చ జరిగింది) అనే ప్రయత్నంతో వేరే
సాఫ్ట్వేర్లు మీ సమాచారాన్ని చదవటం అసంభవం చేయగలరు.
వర్డ్ డాక్యుమెన్ట్‌లు వాడటం మైక్రొసాఫ్ట్ వారి ఆదిపత్యానికి దోహద
పడినట్లు అవుతుంది. మైక్రోసాఫ్ట్ వారు అక్రమంగా, చట్ట విరుద్దంగా వారి
వ్యాపార ప్రత్యర్ధులను అనిచివేస్తుంటారు. ఈ విధంగా చాలా కంపెనీలను
అణిచివేసారు. దీని వల్ల టెక్నాలజీ అభివృద్దికి ఎంతో నష్టం
జరిగింది.అమెరికాలోనూ, ఐరోపాలొనూ కోర్ట్లు మైక్రొసాఫ్ట్ వారికి ఎన్నో వేల
కొట్ల జరిమానా విధించారు. ఐనా మైక్రొసాఫ్ట్ వారు ఇలా చేయటం మానలేదు. వారికి
తప్పుడు పనులు చేస్తే కోర్టు వారు వేసే జరిమానా కంటే వారికి వాటిపై వచ్చే
లాభమే ఎక్కువ.
ఇతర మార్గాలు:
మీరు రాసిన వ్యాసాలు వర్డ్ డాక్యుమెన్ట్‌లులా కాకుండా వేరే
డాక్యుంమెంట్లలా పంపించటానికి చాలా మార్గాలున్నాయి. మాలుగా టెక్ష్ట్ (వట్టి
అక్షరాలు)పద్దతిలో కనుక మీరు వ్యాసాన్ని పంపితె, అది వర్డ్ డాక్యుమెంట్
కంటె పందింతలు చిన్నదిగా ఉంటుంది. ఇటువంటి పద్దతిలొ దాచిన వ్యాసాలని ఎక్కడి
నుండైనా ఎటువంటి కంప్యూటర్ నుండైనా , మైక్రొసాఫ్ట్ ఆఫీస్ లేకుండానే
చుడవచ్చు. సెల్ ఫొన్లొ ఈ-మైల్ వాడేవారికి, ఇంటర్నెట్ కనక్షన్
సరిగాలేనివారికి ఇది సదుపాయంగా వుంటింది. సాద్యమైనంతగా టెక్ష్ట్ పద్దతిలో
మీ వ్యాసాలను పంపించండి. అలా కుదరనప్పుడు మీరు ఎచ్.టీ.ఎం.ఎల్.లా కానీ
పీ.డీ.ఎఫ్.లా కానీ ఓపెన్ డాక్యుమెంట్‌లా కాని పంపవచ్చు. మీరు మైక్రోసాఫ్ట్
వర్డ్‌లొ రాసిన వ్యాసాన్ని టెక్ష్ట్ లేదా ఎచ్.టీ.ఎం.ఎల్.గా మార్చటానికి
"File" మెనూలొ "Save as"ను వాడవచ్చు. మీ కంప్యూటర్‌పై పీ.డీ.ఎఫ్.
సాఫ్ట్వేర్ కనుక వుంటే "File" మెనూలొ "Print" వాడి, అక్కడ పీ.డీ.ఎఫ్.
ఫైల్‌ను ఎంచుంకోవచ్చు. ఉచితంగా లభించే ఒపెన్‌ఆఫీస్.ఆర్గ్‌లొ కనుక మీరు
వర్డ్ డాక్యుమెంట్ను చూడాగలిగితే అక్కడ దానికి ఓపెన్ డాక్యుమెంట్గా
మార్చవచ్చు.
వర్డ్ డాక్యుమెంట్లను ఆపండి:
వర్డ్ డాక్యుమెంట్ల ఎందుకు వాడాకూడదని చూశాము. ఇతరులు కూడా మనకి వర్డ్
డాక్యుమెంట్ల పంపకుండా వుండేలా చేయవచ్చు. మీకు ఎవరైనా వర్డ్
డాక్యుమెన్ట్‌లు పంపించినప్పుడు మీరు వారికి మర్యాదపూర్వకంగా ఆ
డాక్యుమెంట్ను తిరిగిపంపించండి. మీరు ఆ డాక్యుమెంట్ను చవలేరని, ఆ
డాక్యుమెంట్లోని వ్యాసాన్ని మీరు మైక్రొసాఫ్ట్ వర్డ్ లేకుండా చదవగలిగే
పద్దతిలో పంపించమని అడగండి. మీరు కనుక ఫ్రీ సాఫ్ట్వేర్లొ చదవగలను కదా అని ఏ
డక్యుమెంటైనా ఒప్పుకుంటే అది సమస్యని తీవ్రం చేస్తుంది. ఒక రోగాన్ని నయం
చేయకుండా దానివల్ల వచ్చే సూచనలను నయం చేసినట్లవుతుంది. ఒకరు చెప్తే విని
పట్టించుకోనివారు మరి కొంత మంది చెప్తె తప్పక పట్టించుకుంటారు.
మరింత సమాచారం కోసం ఈ వెబ్ పేజీని చూడండి http://www.gnu.org/philosophy/no-word-attachments.html.
Copyright © 2005-2012 Swecha.org