అపారమైన అవకాశాలుగల భారత దిగువ శ్రేణి స్మార్ట్‌ఫోన్ విపణిలోకి గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల తో ప్రవేశించింది. దేశియ ఫోన్ తయారీదారులయిన స్పైస్, మైక్రోమాక్స్ మరియు కార్బన్ లతో జట్టు కట్టి చవక (6500రూపాయలు) స్మార్ట్‌ఫోన్‌లను ఈ రోజు విడుదలచేసింది. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా భారత్‌లోనే ఈ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌లను
విడుదలచేయడం విశేషం. తాజా ఆండ్రాయిడ్ వెర్షనుతో (కిట్‌కాట్) వచ్చే ఈ ఫోన్‌లకు కొత్త ఆండ్రాయిడ్ వెర్షను విడుదలైన వెంటనే తొందరగా అప్‌డేట్లు రావడం, తయారీదారు అప్లికేషన్‌లు మరియు మార్పులు తక్కువగా ఉండి శుద్దమైన ఆండ్రాయిడ్ అనుభవం ఈ ఫోన్‌ల సొంతం.

ఇంచుమించు ఒకే స్పెసిఫికేషన్‌లతో విడుదలైన ఈ మూడు ఫోన్‌లు 4.5 తాకేతెర, 1.3 GHz క్వాడ్రకోర్ ప్రాససర్, 1జిబి రామ్, 4జిబి స్టోరేజి, రెండు సిమ్‌లు, యస్‌డికార్డ్‌స్లాట్, ముందు 2 యంపి వెనుక 5 యంపి కెమేరాలు మరియు ఆండ్రాయిడ్ కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం కలిగిఉన్నాయి. ఈ ఫోన్‌లు కొన్న ఎయిర్ టెల్ వినియోగదారులకు ఆండ్రాయిడ్ అప్‌డేట్ ఉచితంగాను మరియు ప్లేస్టోర్ లో నెలకి 200 యంబి ఉచిత డౌన్‌లోడ్ సదుపాయాన్ని కల్పించారు. ఈ ఫోన్ల కొనుగోలుతో 8జిబి యస్‌డి కార్డ్ మరియు 200 రూపాయల టాక్‌టైం ఉచితంగా అందిస్తున్నారు.అన్‌లైన్‌లో అమ్మకాలకి ఉంచిన ఈ ఫోన్‌ల గురించి మరింత సమాచారం కోసం మరియు కొనుగోలుచేయడానికి ఇక్కడ చూడండి.