మనం కంప్యూటరులో పనిచేసుకుంటున్నపుడు ఏదైనా ఫోన్ లేదా మెసేజి మన ఫోన్ కి వచ్చిందంటే మనం చేస్తున్న పనిని ఆపి ఫోన్ చూడవలసివస్తుంది. ఆలా అవసరం లేకుండానే మన కంప్యూటరులోనే మనకు వచ్చిన ఫోన్ లేదా మెసేజి వివరాలు నోటిఫికేషన్‌గా చూపించబడాలంటే మన ఆండ్రాయిడ్ ఫోనులో ఈ చిన్న యాప్ ఉండవలసిందే. అదే పుష్‌బుల్లెట్.
దీనిని ఉచితంగా ప్లేస్టోర్ నుండి దింపుకోవచ్చు. ఇది ఐఫోనులో కూడా పనిచేస్తుంది. మొదట పుష్‌బుల్లెట్ యాప్‌ని మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని ఖాతా నమోదు చేసుకోవాలి. ఆ తరువాత ఇక్కడ నుండి డెస్క్‌టాప్ క్లయింట్ లేదా వెబ్ బ్రౌజర్ యాడ్‌ఆన్ ని (క్రోం మరియు ఫైర్‌ఫాక్స్) ఇన్‌స్టాల్ చేసుకొని మన పుష్‌బుల్లెట్ ఖాతా వివరాలు ఇచ్చి లాగిన్ కావాలి. ఉబుంటు మరియు లినక్స్ మింట్ ఆప్రేటింగ్ సిస్టంలు వాడేవారు ఇక్కడ చెప్పినట్లు పుష్‌బుల్లెట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అంతే అప్పటినుండి మన ఫోన్ నోటిఫికేషన్‌లన్ని మన డెస్క్‌టాప్ లేదా వెబ్‌బ్రౌజర్ లో చూపించబడతాయి.

ఈ పుష్‌బుల్లెట్ యాప్ ని ఉపయోగించి మన ఫోను నోటిఫికేషన్లను డెస్క్‌టాప్‌లో పొందడమే కాకుండా వివిధ పరికరాలకు ఫైళ్లను, చిత్రాలను, వెబ్ లంకెలను మరియు సందేశాలను పంపుకోవచ్చు. అలాగే మనం ఒకపరికరంలో కాపీ చేసుకున్న అక్షరాలను మరొక పరికరంలో అతికించు (పేస్ట్) కోవచ్చు.