ఉబుంటు లో అన్ని సాఫ్ట్ వేర్లు పనిచెస్తాయా?ఎక్కడ దొరుకుతాయి? ఎలా ఇన్ స్టాల్ చెయ్యాలి?

సాధారణంగా విండోస్ లో మనకి కావలసిన  సాఫ్ట్ వేర్లు నెట్ నుండి కాని మిత్రుల వద్దనుండి కాని తెచ్చుకొని setup.exe రన్ చేయడం ద్వారా ఇన్ స్టాల్ చేస్తాము. కాని ఆ setup.exe లు ఉబుంటులో రన్ కావు.

మరి ఎలా ?

క్రింద సూచించినట్లు సులభంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
సులభమైన ,శిఫారసు చేయబడిన పద్ధతి
ఉబుంటు సాఫ్ట్ వేర్ సెంటర్.

ఉబుంటు డెస్క్ టాప్ నందు గల లాంచర్ లొ ఉబుంటు సాఫ్ట్ వేర్ సెంటర్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా ఉబుంటు సాఫ్ట్ వేర్ సెంటర్ తెరవబడుతుంది.
ఉబుంటు సాఫ్ట్ వేర్ సెంటర్ లో ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాప్ట్వేర్లు సులువుగా వెతికి,ఇన్ స్టాల్ చేయడానికి వీలుగా 14 విభాగాలుగా అమర్చబడ్డాయి.మనకి కావలసిన సాఫ్ట్ వేర్ పేరు తెలిస్తే నేరుగా వెతకవచ్చు.
ఉదాహరణ
అంతే కాకుండా ఆ సాఫ్ట్ వేర్ గూర్చిన ముఖ్యసమాచారం మరియు ముందేవాడినవారి అభిప్రాయాలు వారి రేటింగ్ పొందుపరచబడి ఉండును.దాని ద్వార ఆ సాఫ్ట్ వేర్ గురించి ఒక అవగాహన కలిగి అందుబాటులో ఉన్న సాప్ట్వేర్ల నుండి మనకు సరిపడె సాఫ్ట్ వేర్ ని సులభంగా ఎంచుకోవచ్చు.అదేవిధంగా మీరువాడిన సాఫ్ట్ వేర్ గూర్చి మీ అభిప్రాయాలు కూడా ప్రచురించవచ్చు.
సాఫ్ట్ వేర్ గురించి వివరణ

వాడినవారి అభిప్రాయాలు,రేటింగ్