ఆండ్రాయిడ్ కొత్త వెర్షను 5.0 లాలిపప్ నిన్న విడుదలైంది. కొత్త వెర్షను విశేషాలు ఇక్కడ చూడవచ్చు. దానితోపాటు గూగుల్ మూడు కొత్త నెక్సస్ పరికరాలను కూడా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా జనాధరణ పొందిన ఈ గూగుల్ నెక్సస్ పరికరాలు మిగతా తయారీదారులకు ప్రమాణాలను నిర్ధేశించడానికా అన్నట్లు ఉంటాయి. అటువంటి నెక్సస్
కుటుంబంలోకి మరో మూడు పరికరాలు చేరాయి. అవి మోటోరోలాచే తయారుచేయబడిన నెక్సస్ 6 ఫోను, హెచ్‌టిసి వారి నెక్సస్ 9 టాబ్లెట్ మరియు ఆసుస్‌చే తయారుచేయబడిన నెక్సస్ ప్లేయర్ గేమింగ్ బాక్స్. ఈ మూడు నెక్సస్ పరికరాలు ఆండ్రాయిడ్ లాలిపప్ ఆధారంగా పనిచేస్తాయి. తొందరలోనే గూగుల్ ప్లేస్టోర్ ద్వారా అమ్మకాలకి అందుబాటులో రాబోతున్న ఈ పరికరాలు ముందస్తు బుకింగ్ ఈ నెలలో ప్రారంభం కాబోతుంది. ఈ పరికరాల గురించి మరిన్ని విశేషాలు మరియు ముందస్తు బుకింగ్ కొరకు ఇక్కడ చూడండి.