గూగుల్ నెక్సస్ కుటుంబంలో చేరిన మోటో పెద్దోడు నెక్సస్ 6 విశేషాలు

గూగుల్ మరియు మోటోరోలా ప్రతిష్టాత్మకంగా నెక్సస్ 6 ని నిన్న ఆండ్రాయిడ్ లాలిపప్ తో పాటు విడుదల చేసారు. దీనితో పాటు మరో రెండు నెక్సస్ పరికరాలు కూడా విడుదల కావడం విశేషం. మొదటిసారిగా మొటోరోలా గూగుల్ నెక్సస్ కుటుంబంలో చేరింది. భారతదేశంలో అధిక ప్రజధరణ పొందిన మోటో ఇ మరియు మోటో జి లతో ఫామ్‌లోకి
వచ్చిన మోటోరోలా ఇప్పుడు నెక్సస్ ఫోన్ తయారీలో పాలుపంచుకోవడం మోటోరోలాకి మరింత సానుకూల పరిణామం. నెక్సస్ 6 చూడడానికి సరిగ్గా మోటో జికి అన్న అయిన మోటో ఎక్స్‌ కి కవల సోదరుడిలా ఉండడం విశేషం. మోటోరోలా నెక్సస్ 6 మొట్టమొదటి ఆండ్రాయిడ్ 5.0చే పనిచేసే పరికరం మాత్రమే కాకుండా దీనిలో ఇంకా పలు కొత్త విశిష్టతలు కూడా ఉన్నాయి.
        

నెక్సస్ 6 విశిష్టతలు:

  • గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో 1440 x 2560 రిజొల్యూషన్ మరియు అంగుళానికి 493 పిక్సెళ్ళతో 5.9 అంగుళాల క్యూహెచ్‌డి తాకేతెర.
  •  2.7 గిగాహెర్ట్‌జ్ క్వాల్‌కం క్వాడ్రకోర్ ప్రాససర్ మరియు ఆడ్రినొ 420 జిపియు.
  • 3220mAh టర్బో చార్జింగ్ బ్యాటరీ(పావుగంటచార్జింగ్ పెడితే ఆరుగంటలు వాడుకోవచ్చు).
  • హెచ్‌డి వీడియో తీయగల 13 మెగాపిక్సెళ్ళ వెనుక మరియు 2 మెగాపిక్సెళ్ల ముందు కెమేరా.
  • 32జిబి మరియు 64 జిబి వెర్షన్‌లు.
  • ముందువైపు రెండు స్పీకర్లు.
  • 4జి నెట్వర్క్, వైఫి, ఎన్‌ఎఫ్‌సి, బ్లూటూత్ తాజా వెర్షను.
  • ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్.
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.