ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ యొక్క కిట్‌కాట్ (4.4) తరువాతి వెర్షను లాలిపప్ (5.0) విడుదలైనట్లు గూగుల్ ఇప్పుడే ప్రకటించింది. ఈ విడుదలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పుడు మనం తెలుగులో కూడా వాడుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 5.0 లాలిపప్ విశిష్టతలు:
- మెటీరియల్ డిజైన్ అను సరికొత్త యూజర్ ఇంటర్‌పేజ్‌తో మరింత ఆకర్షణీయంగా, సులభంగా మరియు వేగంగా.
- సరికొత్త నోటిఫికేషన్ సిస్టంతో తెర తాళం వేసి ఉన్నపుడు కూడా సందేశాలను చూసుకోవచ్చు సమాధానమివ్వవచ్చు.
- యాప్ నోటిఫికేషన్లకి మనం ప్రాధాన్యతని ఇచ్చుకోవచ్చు లేదా పూర్తిగా ఆపివేయవచ్చు.
- వేరే ఆప్లికేషనులో మనం పనిచేసుకుంటున్నపుడు ఫోన్ వస్తే మనం ఆ యాప్ కొనసాగించాలా లేదా ఫోన్‌కి సమాధానంఇవ్వాలా అన్నదాన్ని ఎంచుకునే వెసులుబాటు.
- మెరుగుపరచబడిన బ్యాటరీ సేవింగ్ మోడ్.
- ఎంతసేపట్లో చార్జింగ్ పూర్తి అవుతుందో, ఎంతసేపు బార్జింగ్ వస్తుందో అంచనా సమయాన్ని తెలియజేయడం.
- అప్రమేయంగా వాడుకరి సమాచారం ఎన్‌క్రిప్ట్ చేయబడడం, మాల్వేర్ వంటి ఆపదలనుండి మెరుగైన రక్షణ.
- సులభంగా సెట్టింగులను మార్చుకోవడానికి వీలుగా క్విక్ సెట్టింగ్ పానల్.
- తక్కువ బ్యాటరి శక్తిని వాడుకోనె బ్లూటూత్
- మెరుగైన నెట్వర్క్ అనుసంధానం.
- 64 బిట్ ప్రాససర్లకు, అప్లికేషన్లకు మద్దతు.
- మృధువైన, వేగవంతమైన పనితీరు.
- మెరుగైన వీడియో, ఆడియో మరియు కేమేరాల పనితీరు.
- మెరుగైన ఒకే గూగుల్ పనితీరు, తెర ఆపి ఉన్నపుడు కూడా ఒకే గూగుల్ పనిచేయడం.
- తెలుగుతో పాటు 68 భాషలలో ఆండ్రాయిడ్‌ని వాడుకోగలగడం.