తక్కువ ధరలో నాణ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు అందించే ఉద్దేశంతో భారత్‌లో విడుదలచేసిన గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల తో ఎయిర్ టెల్ తో కలిసి అప్‌డేట్లకి మరియు ప్లేస్టోర్ నుండి యాప్ డౌన్‌లోడ్లకి కూడా ఉచితంగా డాటాని ప్రారంభ పథకంగా ప్రకటించింది. దానితోపాటుగా సాధారణంగా మొబైళ్ళలో ఎక్కువ డాటా వీడియోలు చూడడంలో ఖర్చు అవుతుంది కనుక
గూగుల్ తన వీడియో హోస్టింగ్ సర్వీస్ అయిన యూట్యూబ్ ని అఫ్‌లైన్‌లో వాడుకోవడానికి అనువుగా తయారుచేస్తున్నట్లు ఆండ్రాయిడ్ వన్ ప్రకటన పేజి ద్వారా తెలిపింది. అంటే మనం ఒకసారి చూసిన వీడియో మరలా తిరిగి చూడాలనుకున్నపుడు ప్రతిసారి డౌన్‌లోడ్ కాకుండా ఫోన్‌లో సేవ్ చేయబడిఉండి నెట్‌వర్క్ అందుబాటులో లేనపుడు కూడా చూడవచ్చు. అలాగే మనకి వైఫి అందుబాటులో ఉన్నపుడు వీడియోని డౌన్‌లోడ్ చేసుకుని తరువాత అనగా మొబైల్ నెట్‌వర్క్ ఉన్నపుడు కాని అసలు నెట్‌వర్క్ లేనపుడు డాటా అవసరం లేకుండా వీడియోలను చూడవచ్చు. తద్వారా అనవసరపు డాటా ఖర్చును తగ్గించుకోవచ్చు. గూగుల్ తొందరలోనే వచ్చే యూట్యూబ్ యాప్ అప్‌డేట్ తో ఈ విశిష్టతను మొట్టమొదటి సారిగా మన దేశంలో ప్రవేశపెడుతుంది.