50 జిబి క్లౌడ్ స్టోరేజి ఉచితంగా

టాబ్లెట్లు, ఫోన్లు నుండి ఇంటర్ నెట్ వాడకం వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో వాటిలో ఉన్న స్టోరేజ్ పరిమితుల వలన  క్లౌడ్ స్టోరేజ్ సేవలు కూడా బాగా ప్రాచూర్యం పొందుతున్నాయి. మనకి ఇప్పుడు వివిధ క్లౌడ్ స్టోరేజ్ సేవలు ఉచితంగా మరియు డబ్బులకి సేవలందిస్తున్నాయి. క్లౌడ్ స్టోరేజ్ లో భద్రపరచిన సమాచారం మనం ఎక్కడ నుండయినా ఏ పరికరం
నుండయినా పొందే వెసులుబాటు సౌలభ్యం ఉండడం వలన క్లౌడ్ స్టోరేజ్ ని చాలా మంది ఉపయోగిస్తున్నారు. చాలా సంస్థలు వినియోగధారులను ఆకట్టుకోవడానికి ఉచితంగా కొంత క్లౌడ్ స్టోరేజ్ ని అందిస్తున్నాయి.

ఇప్పుడు ప్రముఖ ఫైల్ హోస్టింగ్ సంస్థ అయిన మెగా నుండి 50 జిబి ఉచిత క్లౌడ్ స్టోరేజి లభిస్తుంది. ఇక్కడ మనం దాచుకున్న ఫైళ్ళు సురక్షితంగా ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. ఈ 50 జిబి ఉచిత సర్వీసును పొందడానికి ఇక్కడ నమోదు చేసుకోవాలి. ఇక్కడ మనం దాచుకున్న ఫైళ్ళను వివిధ పరికరాలనుండి సులువుగా పొందడానికి మెగా క్లయింట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవలిసి ఉంటుంది. ఈ మెగా ఫైల్ సింక్రోనైజెషన్ క్లయింటు విండోస్, మాక్ మరియు లినక్స్ వంటి డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టములకు, ఆండ్రాయిడ్, ఐఒయస్ మరియు బ్లాక్‌బెర్రి మొబైల్ ఆపరేటింగ్ సిస్టములకు మరియు క్రోమ్‌ మరియు ఫైర్‌ఫాక్స్ విహారిణులకు పొండిగింతగాను అందుబాటులో ఉంది.