టివీల్లో,పత్రికలలో ఎక్కడా ప్రకటనలు ఇవ్వకుండానే ఎందుకు మోటో జి/ఇ అలా అమ్ముడవుతుంది?

మోటో జి ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపించే ఫోన్‌. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న ఆన్‌లైన్ షాపింగ్ మరియు ఫ్లిప్‌కార్ట్‌కి జీవం, మోటోరోలాకి భారతదేశంలో పునర్జీవం అందించిన ఫోన్‌. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది మోటో జి/ఇ తో తమ మొదటి ఆన్‌లైన్ కొనుగోలు మొదలుపెట్టారు. మామూలు ఫోన్‌లలా అన్ని దుకాణాలలో కాదు బయట ఎక్కడా దొరకదు,

మీ ఫోన్‌కి ఆండ్రాయిడ్ అప్‌డేట్ రావడం లేదా?

       ఎక్కడ చూసినా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న పరికరాలు మనకి కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టంగా పేరు పొందినది ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టం. దీనిని సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తయారుచేసి విడుదలచేస్తుంది. దానిని మొబైల్ తయారీదారులు వాళ్ళకి తగినట్టుగా మార్చుకొని వాళ్ల పరికరాలలో ఉంచి మనకు అమ్ముతారు. ఆవిధంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంకి సంబందించిన పరికరాలు ఒక్క గూగుల్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలువురు వారి పరికరాలతో పాటు అమ్ముతున్నారు. మరి గూగుల్ విడుదలచేసిన వెంటనే మనకి అప్‌డేట్‌లు రావడానికి మధ్యలో తయారీదారు ఉన్నాడు. వాళ్ళు గూగుల్ విడుదలచేసిన అప్‌డేట్‌ని తమ పరికరానికి తగినట్లు మార్చి దానిని పరిక్షించి విడుదలచేయడానికి సమయం తీసుకుంటుంది కనుక మనకు అప్‌డేట్స్ రావడం ఆలస్యం అవుతుంది. అయితే కొన్ని పెద్ద సంస్థలు వాటికున్న వనరుల వలన కొంత వరకు అప్‌డేట్స్‌ ఇచ్చినప్పటికి భవిష్యత్తు వ్యాపారం దృష్ట్యా కొన్ని రోజుల వరకే అప్‌డేట్స్ అందిస్తువస్తున్నాయి. ఇది కూడా ఆకంపెనీలకు ఖర్చుతో కూడుకున్న విషయం కనుక చాలా దిగువ శ్రేణి మొబైల్ తయారీదారులు అసలు అప్‌డేట్లు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా ఫోన్‌తో వచ్చిన దానికంటే పనితీరు బాగాలేకపోవడం వంటి సమస్యలు ఎదురవడం మనం గమనించవచ్చు. అందువలన మనం ఫోన్‌ లేదా టాబ్లేట్ కొన్నపుడు కొంచెం ధర ఎక్కువైనా మంచి కంపెనీది కొనుక్కోవడం ఉత్తమం. 

నెక్సస్ 5 కి ఆండ్రాయిడ్ 4.4.4 అప్‌డేట్

          గూగుల్ తమ నెక్సస్ పరికరాలకు వెంటనే అప్‌డేట్లు విడుదలచేస్తుంది. అదే విధంగా ప్లే స్టోర్‌లో అమ్ముతున్న వివిధ కంపెనీల పరికరాలకు కూడా ఆయా కంపెనీలు త్వరగా అప్‌డేట్లు విడుదలచేసేటట్లు చూస్తుంది. ఇకపోతే గూగుల్ కాకుండా తమ పరికరాలకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ త్వరగా ఇచ్చే సంస్థలు మొటోరోలా, సోనీ, హెచ్‌టిసి, యల్‌జి తరువాత సాంసంగ్. ఆపిల్ గాని యమ్‌యస్ కానీ ఏ సంస్థ అయినా జీవితకాలం అప్‌డేట్స్ ఇవ్వలేదు. అదే విధంగా వెర్షన్ అప్‌గ్రేడ్ కూడా ఒకటి లేదా రెండు వెర్షన్‌లకు మాత్రమే ఇస్తారు. ఫోన్‌ విడుదలచేసిన సుమారు రెండు సంవత్సరాలు వరకు మాత్రమే అప్‌డేట్స్ విడుదలచేస్తారు. ఒకవేళ అంతకుమించి అప్‌డేట్స్ ఇవ్వడానికి సిద్దపడితే చాలా అధనపు భారం పడుతుంది తద్వారా భవిష్యత్తు ఆవిష్కరణలు లేక కంపెనీ మూత పడినా పడుతుంది. అందువలన కంపెనీలు పాత పరికరాలకు అప్‌డేట్స్ ఇవ్వడానికి ముందుకురావు.
            ఆపిల్ గాని యమ్‌యస్ కానీ లేని అవకాశం ఆండ్రాయిడ్‌కి ఉంది. అదే ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ కావడం. ప్రతి ఆండ్రాయిడ్ వెర్షన్ విడుదలచేసిన వెంటనే గూగుల్ దానికి సంబందించిన సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉండేటట్లు పెడుతుంది. దానిని వాడుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒత్సాహిక డెవలపర్లు లాభాపేక్ష లేకుండా వివిధ పాత పరికరాలకి కూడా కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ని అందుబాటులోకి తెస్తారు. దానిని అందరికి ఉచితంగా అందజెస్తారు. అందువలన మనం ఫోన్‌ కొనే ముందు దాని ధర మాత్రమే కాకుండా దాని నాణ్యత, ఫీచర్లు, తయారీదారు ఎవరు మరియు ఆ పరికరం ఎంత వరకు ప్రాచూర్యం పొందినదో చూసుకొని కొనడం ఉత్తమం. జనాధరణ పొందిన ఫోన్‌లకి కొత్త ఆండ్రాయిడ్ తీసుకొని రావడానికి డెవలపర్లు కూడా సానుకూలంగా ఉంటారు. అప్‌డేట్స్ నిలిచిపోయిన పరికరాలకు సరికొత్త ఆండ్రాయిడ్ ని రుచిచూపించే పలు ఆండ్రాయిడ్ రామ్‌లు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మనం చెప్పుకోవలసింది సైనోజెన్‌మోడ్ గురించి. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ ఆధారంగా తయారు చేసినప్పటికి , అంతా ఆండ్రాయిడ్ లా ఉన్నప్పటికి ఈ సైనోజెన్‌మోడ్ని ఒకసారి వాడితే మన ఫోన్ కొన్నప్పుడు వచ్చే ఆండ్రాయిడ్ వాడాలనిపించదు.

రాబోయే ఆండ్రాయిడ్ వెర్షన్ విశేషాలు, చిత్రాలు

      ఇప్పుడు నడుస్తున్న ఆండ్రాయిడ్ వెర్షన్ 4.4 కిట్‌కాట్. ఈ కిట్‌కాట్ శ్రేణిలో 4.4.4 వరకు గూగుల్ విడుదలచేసింది. కాని ఇప్పటికి చాలామంది తయారిదారులు అసలు కిట్‌కాట్‌ ఆపరేటింగ్ సిస్టం తోటి మొబైళ్ళు విడుదలచేయడం లేదు. మోటోరోలా, సోనీ, హెచ్‌టీసి మరియు గూగుల్ నెక్సాస్ వంటి కొందరు కిట్‌కాట్ ఆపరేటింగ్ సిస్టం తో మొబైళ్ళు విడుదలచేయడంతో పాటు వాటికి 4.4.4 అప్‌డేట్ ని అందించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలాఉండగా గూగుల్ మాత్రం తరువాతి వెర్షన్ తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. రాబోయే ఆండ్రాయిడ్ వెర్షన్ యొక్క డెవలపర్ ప్రివ్యూని (ఆండ్రాయిడ్ యల్ గా వ్యవహరిస్తున్నారు) విడుదలచేసింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్ కిట్ మరియు నెక్సస్ 5 నెక్సస్ 7 పరికరాలలో ఇన్‌స్టాల్ చేసుకొనే విధంగా సిస్టం ఇమేజిలను దాని సోర్స్ కోడ్‌ని విడుదలచేసింది. వాటికి సంబందించిన మరింత సమాచారం కొరకు ఇక్కడ చూడాండి. ఈ ఆండ్రాయిడ్ యల్ కి ఏ తినుబండారం పేరు పెడతాడో తెలియాలంటే విడుదల వరకు వేచిచూడాలి. పై రెండు పరికరాలు కలిగి ఉన్నవారు రాబోయే ఆండ్రాయిడ్‌ని ఇప్పుడే రుచిచూడవచ్చు.
ఆండ్రాయిడ్ యల్ ఇన్‌స్టాల్ చేయబడిన

     అసలు విశేషం ఏమిటంటే ఈ రాబోయే ఆండ్రాయిడ్‌లో చాలా ప్రత్యేకతలు మరెన్నో కంటికి కనిపించని, కనిపించే మార్పులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది సాధారణ వినియోగదారుడికి ఉపయోగపడేది మెరుగైన బ్యాటరీ సామర్ధ్యం. అభివృద్ది దశలో ఉన్న ఈ ఆపరేటింగ్ సిస్టంని 4.4.4 తో పోలిస్తే బ్యాటరీ సామర్ధ్యం 36% మెరుగైనట్లు చెపుతున్నారు. ఇది ఇంకా ప్రాధమిక దశలో ఉంది కనుక పూర్తి స్థాయిలో విడుదలయి సగటు వినియోగదారుని వరకు వచ్చేసరికి మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

నెక్సాస్ 5 ఫోన్‌లో కిట్‌కాట్ మరియు యల్ ఇన్‌స్టాల్ చేసినపుడు బ్యాటరీ సామర్ధ్యాన్ని చూపే గ్ర్రాఫ్
          నెక్సస్ 5 లో ఇన్‌స్టాల్ చేయబడిన ఆండ్రాయిడ్ యల్ ఆపరేటింగ్ సిస్టం చిత్రాలు (ఇంటర్ నెట్ నుండి సేకరించబడ్డాయి) మరిన్ని క్రింద చూడవచ్చు.

సరికొత్త హోం స్క్రీన్ మరియు బటన్‌లు


మార్చబడిన నోటిఫికేషన్ విధానము

మరింత సులభతరమైన క్విక్ సెట్టింగ్ ప్యానల్

అక్షరాల మధ్య ఎక్కువ కాళీ స్థలం కలిగిన కీబోర్డ్

సిస్టం సెట్టింగ్స్

మన కంప్యూటర్లో కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఇలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు

      సాధారణంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఫోన్‌లు మరియు టాబ్లెట్లలో వస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కి అందుబాటులో ఉన్న అప్లికేషన్‌ల వలన ఆండీ, బ్లూస్టాక్ వంటి సాఫ్ట్వేర్లు ఉపయోగించి మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం లోనే మనకు కావలసిన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు నడుపుకోవచ్చు. మరొక విధానం ద్వారా వర్చువల్ బాక్స్ అను సాఫ్ట్వేర్‌ని ఉపయోగించి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ని వర్చువల్ ఆపరేటింగ్ సిస్టంగా మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం లోనే వాడుకోవచ్చు. ఈ పద్దతులన్ని మరొక ఆపరేటింగ్ సిస్టంపై ఆధారపడి పని చేస్తుంటాయి. అంటే ఇవి పని చేయడానికి మన కంప్యూటరులో అప్పటికే మరొక ఆపరేటింగ్ సిస్టం పని చేస్తుండాలి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న పద్దతి ద్వారా మనం విండోస్ లేదా లినక్స్ ఆపరేటింగ్ సిస్టం మనం ఎలా అయితే మన కంప్యూటరులో ఇన్‌స్టాల్ చేసుకుంటామో అదేవిధంగా (మరొక ఆపరేటింగ్ సిస్టం పై ఆధారపడకుండా) ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 
       మొబైళ్ళు మరియు టాబ్లెట్లలో వాడబడుతున్న ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంని లాప్‌టాప్ మరియు డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వీలుగా తయారుచేసారు. ఇది ఒపెన్ సోర్స్ఆపరేటింగ్ సిస్టం. దీనిని ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ ప్రాజెక్ట్ నుండి కోడ్‌ని తీసుకొని ఆండ్రాయిడ్ -x86గా పోర్ట్ చేసారు. ఇది కూడా ఒపెన్ సోర్స్ఆపరేటింగ్ సిస్టం.

లాప్‌టాప్‌లో నేరుగా ఇన్‌స్టాల్ చెయ్యబడిన ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం
  

           ఈ ఆండ్రాయిడ్ -x86 ఆపరేటింగ్ సిస్టంని క్రింది లంకె నుండి ఉచితంగా దింపుకోవచ్చు. 
       దింపుకున్న ఇమేజి ఫైల్ ని యూనెట్‌బూటిన్ మరియు లినక్స్ లైవ్ యూయస్‌బి క్రియేటర్ వంటి సాఫ్ట్‌వేర్లని ఉపయోగించి ఇన్‌స్టాలేషన్‌ డిస్క్‌ని తయారుచేసుకోవచ్చు లేదా సీడీలోకి వ్రాసుకొని ఆపరేటింగ్ సిస్టంను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనిని వేరొక ఆపరేటింగ్ సిస్టం తొ డ్యూయల్ బూట్ గా కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

మీ కంప్యూటరులో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టంలు వాడుతున్నారా?

  
  • విండోస్ యొక్క రిఈన్‌స్టాల్ డిస్క్ మరియు ఆపరేటింగ్ సిస్టం అలాగే మన ఫైళ్ళు బ్యాకప్ తీసుకున్న తరువాత మాత్రమే ప్రయత్నించవలసి ఉంటుంది. 
  • విండోస్ లో ఉండగా ఉబుంటు, ఉబుంటులో ఉండగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్ లను మనం తొలగించడం లేదా మార్చడంచేయకుడదు. దానివలన రెండు ఆపరేటింగ్ సిస్టంలు పనిచేయకుండా పోతాయి.  
  • విండోస్‌లో కనిపించని రికవరీ మరియు తయారీదారుకి సంభందించిన పార్టీషియన్‌లు ఉబుంటులో కనిపించినప్పటికి మనం వాటిలోని పైళ్ళను మార్చడం కాని డ్రైవ్ ని తొలగించడం కాని చేయరాదు. 
  • ఉచిత ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ముందే విండోస్ అప్‌డేట్లు అన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.
  • ఒకొకసారి విండోస్ అప్‌డేట్ అయిన తరువాత ఉబుంటు అసలు కనిపించకుండా పోతుంది. అటువంటప్పుడు మనం ఉబుంటు లైవ్ డిస్క్ ని ఉపయోగించి మనం మునుపటిలా ఉబుంటు మరియు విండోస్ 8 డ్యూయల్ బూట్ అయ్యేవిధంగా చేసుకోవచ్చు.
  • పొరపాటు జరిగి రెండుఆపరేటింగ్ సిస్టంలు బూట్ కానప్పటికి కంగారుపడి తిరిగి ఇన్‌స్టాల్ చెయ్యకండి. రెండిటిని కూడా యధాస్థితిలో రికవరీ చేయ్యడానికి మనకి నెట్‌లో పలు ఉపాయాలు దొరుకుతాయి. 

మీ కొత్త లినొవొ లాప్‌టాప్‌లో ఇతర ఆపరేటింగ్ సిస్టంలు ఇన్‌స్టాల్ కావట్లేదా?

                    ఇప్పుడు కొత్తగా వస్తున్న లినొవొ లాప్‌టాప్‌లో మరొక ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేయడం వీలుకాకుండా ఉండడమే కాకుండా లైవ్‌ సిడి కూడా పనిచేయట్లేదు. అంతేకాకుండా సిస్టం ఆన్ చేయగానే నేరుగా విండోస్‌ లోకి వెళ్ళిపోతుంది. కనీసం బయోస్ సెట్టింగ్స్ లోకి వెళ్లడానికి మరియు బూట్ డివైజ్ ని ఎంచుకోవడానికి కూడా మనకి ఆప్షన్లు కనిపించవు. మరి అటువంటప్పుడు మనం ఏవిధంగా మనకు కావలసిన ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవాలి అదేవిధంగా విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలు కలిపి డ్యుయల్ బూట్‌గా ఎలా ఇంస్టాల్ చేసుకోవాలి. 
                
ఉబుంటు ఇన్‌స్టాల్ చేయబడిన లినొవొ లాప్‌టాప్
                   
                      మొదట మనం మన లాప్‌టాప్ బయోస్ సెటప్ లోకి వెళ్ళాలి. అది ఎలాగంటే లాప్‌టాప్ ని షట్‌డౌన్ చేసి తరువాత పవర్ బటన్ ప్రక్కన ఉన్న వన్ టచ్ రికవరీకీని పది సెకన్లు వత్తి పట్టుకొని వదిలివేయాలి.
                        
                     అప్పుడు మనకి తెరమీద క్రింది చిత్రంలో వలే బయోస్ సెటప్‌కి వెళ్ళడానికి మరియు బూట్‌ డివైజ్ ఎంచుకోవడానికి ఆప్షన్‌లు కనిపిస్తాయి.
                    
                                 ఇప్పుడు మనం బూట్ మెనూలోకి వెళ్ళి ఏదైనా లినక్స్ లైవ్ ఆపరేటింగ్ సిస్టం ప్రయత్నించడానికి ముందు బయోస్ సెటప్ లోనికి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ టాబ్‌లో ఉన్న సెక్యూర్‌బూట్ అన్న ఆప్షన్‌ని డిసేబుల్ చెయ్యలి. 

     
                 సెక్యూర్ బూట్ డిసేబుల్ చేసిన తరువాత మన కంప్యూటరులో వివిధ ఉచిత ఆపరేటింగ్ సిస్టముల లైవ్ డిస్కులు మామూలుగా ఎప్పటిలాగే పనిచేస్తాయి. కాని అన్ని ఆపరేటింగ్ సిస్టములు ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కుదరదు, కేవలం యుఇఐయఫ్ బూట్‌ని సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టంలు మాత్రమే ఇన్‌స్టాల్ అవుతాయి. ఉబుంటు 64 బిట్ వంటి కొన్ని ఆపరేటింగ్ సిస్టములు మాత్రం సెక్యూర్ బూట్ అనేబుల్ చేసి ఉన్నప్పటికి లైవ్ డిస్క్ పనిచేయడమే కాకుండా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. మనం ఉబుంటు 32 బిట్ మరియు మిగిలిన ఏదైనా ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే మనం తప్పనిసరిగా బయోస్ సెటప్ లో బూట్ టాబ్ లో ఉన్న యుఇఐయఫ్ బూట్‌ని లెగసిగా మార్చవలసి ఉంటుంది.
 
                            కానీ లెగసీ సపోర్ట్ అనేబుల్ చేసిఉన్నపుడు మిగిలిన అన్ని ఆపరేటింగ్ సిస్టంలు బాగానే పనిచేస్తున్నప్పటికి లినొవొ లాప్‌టాప్‌లో విండోస్ 8 బూటింగ్ సమస్య వస్తుంది కనుక ఉచిత ఆపరేటింగ్ సిస్టంతో పాటు విండోస్ 8 కూడా వాడుకోవాలనుకునేవారు తప్పని సరిగా యుఇఐయఫ్ బూట్‌ని సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టం అయిన ఉబుంటు64 బిట్ ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. మనం ఉబుంటు ఇన్‌స్టాల్ చేసిన తరువాత మనకి ఈవిధంగా కంప్యూటరు ఆన్ చేయగానే బూట్ మెను కనిపిస్తుంది. మనకు కావలసిన ఆపరేటింగ్ సిస్టంని ఎంచుకోవడం ద్యారా మనం ఉబుంటు లేదా విండోస్ లోకి బూట్ కావచ్చు. మన ఫైళ్ళని రెండు ఆపరేటింగ్ సిస్టంలలో నుండి వాడుకోవచ్చు.

మీరు కూడా సులభంగా కంప్యూటర్ ట్యుటోరియళ్ళు తయారుచేయవచ్చు

                 మనం సాధారణంగా కంప్యూటరు లేదా వివిధ సాఫ్ట్‌వేర్ల గురించి నెట్ లో అందుబాటులో ఉన్న ట్యుటోరియళ్ళను చూసి తెలుసుకుంటాము. మొదట్లో వివరణాత్మక వ్యాసాల రూపంలోను తరువాత చిత్రాలతొ కూడిన వ్యాసాల రూపంలోను ఈ ట్యుటోరియళ్ళు ఉండేవి. కొంతకాలంగా మనకి నెట్లో ఎక్కువగా వీడియో ట్యుటోరియళ్ళు అందుబాటులోకి వచ్చాయి. అవి వ్యాసరూపంలో ఉన్న వాటికన్నా ఎక్కువగా ఆదరణ పొందాయి దానికి కారణం అవి ఎటువంటి పరిజ్ఞానం లేనివారికి కూడా సులభంగా అర్ధం కావడమే. 
                     వీడియో ట్యుటోరియళ్ళు పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే ఎవరైనా సులభంగా తయారు చేయవచ్చు. మనం కంప్యూటర్లో చేస్తున్న పనిని రికార్డ్ చేస్తూ దానికి తగిన వాఖ్యానాన్ని జోడిస్తే చాలు వీడియో ట్యుటోరియల్ పూర్తి అయినట్లే. మన కంప్యూటరు తెరని చిత్రీకరిస్తూ మన మాటలను రికార్డు చేయడానికి మనకి అందుబాటులో ఉన్న ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ కామ్‌ స్టూడియో. ఉచితంగా లభించే ఈ సాఫ్ట్‌వేరు కంప్యూటరు నిపూణులకి, ఒత్సాహిక బ్లాగర్లకి, ఉపాధ్యాయులకి మరియు విద్యార్ధులకి ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. 


                        తక్కువ పరిమాణం కలిగి తక్కువ కంప్యూటరు వనరులని వాడుకుంటూ పనిచేసే కామ్‌ స్టూడియోని ఉపయోగించి విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఉన్న కంప్యూటర్లలో మనం వివిధ సాఫ్ట్‌వేర్, ఇంటర్ నెట్ మరియు కంప్యూటరు చిట్కాలను రికార్డ్ చేయవచ్చు. రికార్డ్ చేయబడిన వీడియోలు మంచి నాణ్యతతో కూడి ఉండడమే కాకుండా వీడియో షేరింగ్ సైట్లలో  అప్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా తక్కువ పరిమాణం తో ఉండడం కూడా దీని ప్రత్యేకత. అంతేకాకుండా తక్కువ పరిజ్ఞానం కలవారు వాడుకోవడానికి వీలుగా సరళంగా ఉంటూనే నిపూణులకి కోసం వివిధ ఆప్షన్‌లు దీని సొంతం.
 

కామ్‌స్టూడియోని క్రింది నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
                            http://camstudio.org/                                                                     

మొట్టమొదటి తెలుగు మొబైల్ వెబ్ బ్రౌజర్

      ఇప్పుడు వస్తున్న కొత్త ఫోన్‌లలో అన్ని మొబైల్ వెబ్ బ్రౌజర్‌లలో తెలుగు సరిగానే కనిపిస్తుంది. దీనికి కారణం ఆండ్రాయిడ్ 4.2.2 వెర్షనులో తెలుగు ఫాంట్‌ ఉండడం. 4.2.2 తరువాత వస్తున్న వెర్షన్‌లలో కూడా తెలుగు బాగానే కనిపిస్తుంది. తక్కువ ధరలో లభిస్తున్న ఫోన్‌లలో కూడా ఇప్పుడు 4.2.2 లేదా తరువాతి వెర్షన్‌లు ఉండడం మనం గమనించవచ్చు. పాత ఫోన్‌లలో ఇప్పటికి తెలుగు చూడాలంటే తయారీదారు ఫాంటు ఇవ్వడంకాని మనం రూట్ చేసుకొని ఫాంట్ ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. 
         ఇప్పుడు తెలుగులో మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ రాబోతుంది. మనం ఫైర్‌ఫాక్స్ డెస్క్‌టాప్ బ్రౌజర్‌ని గమనిస్తే మనకు వివిధ భాషలలో అందుబాటులో ఉంది. అలాగే ఆండ్రాయిడ్ ఫైర్‌ఫాక్స్ కూడా ఇప్పుడు తెలుగుతో సహా పలుభాషలలో రాబోతుంది. అయితే విడుదలకు ముందే మనం ఇప్పుడే వాడుకోవచ్చు. అభివృద్ది దశలో ఉన్న ఈ వెర్షనును అరోరా అంటారు. దీనిని ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ apk ఫైల్‌ని మనం ఆండ్రాయిడ్ ఫోన్‌లు మొబైళ్ళలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలుంటే మొజిల్లా వారికి ఇక్కడ చెప్పినట్లు నివేదించడం ద్వారా మంచి విడుదలకు మనం కూడా సహాయపడవచ్చు. మరింకెందుకు ఆలస్యం తెలుగు భాషాభిమానులారా మీ వంతు సహాయం చెయ్యండి. మొదటి తెలుగుమొబైల్ వెబ్ బ్రౌజర్ స్క్రీన్‌షాట్లు క్రింద చూడండి.






కరప్ట్ అయిన కంప్యూటరు నుండి డాటా బ్యాకప్ తీసుకోవడం,ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్ పరిమాణాన్ని తగ్గించడం ఎలా?

   ఇప్పుడు వస్తున్న కంప్యూటర్లలో హార్డ్‌డిస్క్ మొత్తం ఒకే డ్రైవ్‌గా ఉండి దానిలోనే ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. మనం మన డాటాని కూడా అందులోనే దాచుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఆపరేటింగ్ సిస్టం పనిచేయనపుడు తిరిగి ఇన్‌స్టాల్ చేయించుకోవడానికి వెళ్ళినపుడు డాటా తిరిగి రాదు లేదా డాటా బ్యాకప్ తీయడానికి మరికొంత డబ్బులవుతాయని షాపువాడు అడుగుతుంటాడు. ఇటువంటప్పుడు మనం సులభంగా షాపుకి తీసుకువెళ్ళకుండానే డాటా ఎలా బ్యాకప్ తీసుకోవాలో, అసలు ఈ సమస్య రాకుండా ముందుగానే ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్‌ని కుదించుకొని డాటా కోసం మరొక డ్రైవ్‌ని ఏర్పాటుచేసుకొని మనకు కావలసినపుడు మన డాటాకి హానికలగకుండా ఆపరేటింగ్ సిస్టం ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకొనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

  సాధారణంగా విండోస్‌తో వచ్చే కంప్యూటర్లలో మరొక ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చెయ్యడానికి చూసినపుడు డాటా మరియు విండోస్ ఆపరేటింగ్ సిస్టం కోల్పోతున్నాము అని ఫిర్యాదు చేస్తూ ఉచిత ఆపరేటింగ్ సిస్టంలను నిందిస్తూ ఉంటారు. మనం ఇన్‌స్టాల్ చేసుకొనే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డాటా మరియు డబ్బులు పెట్టీ కొన్న ఆపరేటింగ్ సిస్టంని కోల్పోకుండా కాపాడుకోవచ్చు. తద్వారా ఇన్‌స్టాలేషన్ సమయంలో మనకి తెలియక ఏదైనా తప్పుగా చేసినప్పటికి మన డాటాని మరియు ఆపరేటింగ్ సిస్టంని ఎలా తిరిగి పొందాలో ఈ వీడియోలో చూడవచ్చు. 

మీ కొత్త కంప్యూటర్లో మీకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ అవ్వట్లేదా?

 కొత్తగా కొన్నటువంటి కంప్యూటరులో మనం మునుపటిలా మనకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చెయ్యడానికి ప్రయత్నించినపుడు ఇన్‌స్టాల్ కాకపోవడం ఈమధ్య సాధారణంగా జరుగుతుంది. అదేవిధంగా సీడీ, డీవీడీ మరియు పెన్‌డ్రైవ్‌ల నుండి నేరుగా లైవ్ ఆపరేటింగ్ సిస్టం వాడుకోవడం కూడా సాధ్యం కావడం లేదు. దీనికి కారణం కొత్తగా వస్తున్నటువంటి కంప్యూటర్లలో మనకు బయోస్ సెటప్ లోకి ప్రవేశించడానికి మరియు బూట్ డివైజ్ ని ఎంచుకోవడానికి ఎటువంటి ఆప్షనులు చూపించకుండా నేరుగా విండోస్ లోకి వెళ్ళిపోతు ఉండడం కారణం. మనం వేరే ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసుకోవడానికి లేదా లైవ్ ఆపరేటింగ్ సిస్టం వాడుకోవడానికి అడ్డుగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

వేగవంతమైన వెబ్‌ బ్రౌజర్ సరికొత్త రూపంతో విడుదలైంది

 వేగవంతమైన మరియు ఉచిత ఒపెన్ సోర్స్ వెబ్‌ బ్రౌజర్ ఇప్పుడు కొత్త ఫీచర్లతో కొత్త వెర్షనుగా విడుదలైంది. అదే ఫైర్‌ఫాక్స్ 29. ఈ వెర్షనులో ఫైర్‌ఫాక్స్ ఆస్ట్రలిస్ అను సరికొత్త రూపంతో విడుదలైంది. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ మనకి అన్ని రకములైన ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. అదేవిధంగా తెలుగుతో సహా 80 కి పైగా భాషలలో మనకి అందుబాటులో ఉంది. మనకు కావలసిన ఆపరేటింగ్ సిస్టంకి మనకి కావలసిన భాషలో ఇక్కడ నుండి దిగుమతి చేసుకోవచ్చు.
 
ఫైర్‌ఫాక్స్ కొత్త రూపం ఆస్ట్రలిస్

ఫ్లాష్‌ప్లేయర్ లేకుండానే యుట్యూబ్ వీడియోలు చూడడం ఎలా?

 సాధారణంగా మనం యుట్యూబ్ వీడియోలు చూడడానికి ఫ్లాష్‌ప్లేయర్లను ఇన్‌స్టాల్ చేసుకుంటాము. ఇప్పుడు ప్లాష్‌ప్లేయర్ లేదా ఎటువంటి బ్రౌజర్ ప్లగిన్‌లు ఇన్‌స్టాల్ చేయనక్కరలేకుండానే యుట్యూబ్ వీడియోలను చూసెయ్యవచ్చు. అదెలాగో ఈ వీడియోలో చూడవచ్చు.

సపోర్ట్ నిలిపి వేయబడిన పాత కంప్యూటర్లకు జీవం పొయ్యండిలా

   మనం ఇప్పుడు వాడుతున్న పాత కంప్యూటర్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ నిలిపివేయడం వలన ఇక పై ఆ ఆపరేటింగ్ సిస్టంకు సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు కనుక ప్రత్యామ్నాయాల కోసం చూడవలసిన అవసరం ఏర్పడింది. మనం డబ్బులు పెట్టి కొత్త ఆపరేటింగ్ సిస్టం కొన్నప్పటికి అది మన పాత కంప్యూటర్ యొక్క సామర్ధ్యం తక్కువగా ఉండడం వలన దానిలో పని చేయకపోవచ్చు. అందువలన మనం తప్పనిసరిగా మన కంప్యూటరు యొక్క సామర్ధ్యాన్ని విడిబాగాలను మార్చుకోవడం లేదా రామ్‌ వంటి విడిబాగాలను అధనంగా చేర్చడం ద్వారా పెంచుకోవలసి రావచ్చు. వీలుకాని పరిస్థితులలో పూర్తిగా కంప్యూటరుని మార్చవలసి రావడం కూడా జరుగుతుంది. దీనికి కారణం ఆపరేటింగ్ సిస్టం తయారీదారు మరియు కంప్యూటర్ల తయారీదారులు కలిసి టెక్నాలజీ మెరుగుదల పేరుతో కొంతకాలానికి కంప్యూటర్లు మార్చడాన్ని తప్పనిసరి అవసరంగా తయారుచేయడం. దానివలన మనకి ఏవో కొన్ని ప్రయోజనాలున్నప్పటికిని ఆర్ధికంగా (కంప్యూటర్లను మరియు ఆపరేటింగ్ సిస్టం మార్చడానికి పెట్టుబడి) మరియు పర్యావరణపరంగా చాలా (కంప్యూటర్ వ్యర్ధాలు పర్యావరణానికి అతి పెద్ద ముప్పుగా పరిణమించ బోవడం) నష్టదాయకం.
   మన పాత కంప్యూటరును మార్చకుండానే సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించబడే ఆపరేటింగ్ సిస్టం మనకు అందుబాటులో ఉంటే దానికి పరిష్కారం దొరికినట్లే. అదీ ఉచితంగా దొరికితే ఇంకా బాగుంటుంది కదా. అవే ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు. ఇవి లాభాపేక్షలేని కొన్ని సంస్థలచే మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లచే స్వచ్చందంగా అభివృద్ది చేయబడుతున్నాయి. పాత కంప్యూటర్లలో పనిచేయడానికి మనకు చాలా ఆపరేటింగ్ సిస్టంలు ఇప్పుడు మనకు ఇంటర్‌నెట్‌ లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది నిరంతరం కొత్త పీచర్లతో అప్‌డేట్ అవుతూ, మనం చూడడానికి ఇప్పుడు వాడే ఆపరేటింగ్ సిస్టం లానే ఉండే లుబుంటు.
    ఇది తక్కువ సామర్ధ్యం గల పాత డెస్క్‌టాప్, లాప్‌టాప్ మరియు మాక్ కంప్యూటర్లలో పనిచేయడానికి అనుగుణంగా వేగంగా, తేలికగా ఉండేటట్లు తయారుచేయబడింది. పెన్‌టియం 2, సెల్‌రాన్ వంటి పాత ప్రాససర్లతో ఉన్నటు వంటి కంప్యూటర్లలో కూడా పనిచేస్తుంది. తక్కువ వనరులని వాడుకొని వేగంగా పనిచేయడం దీని ప్రత్యేకత. అదే విధంగా కొత్త కంప్యూటర్ల కోసం 64బిట్ వెర్షను కూడా అందుబాటులో ఉంది. లుబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇక్కడ నుండి దింపుకోవచ్చు. దీనిని పెద్దగా పరిజ్ఞానం లేనివారు కూడా సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బాగా పాత సిస్టంలలో సీడీ ద్వారా లాప్‌టాప్‌లు కొత్త కంప్యూటర్లలో పెన్‌డ్రైవ్ ద్వారాను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
లుబుంటు 14.04 డెస్క్‌టాప్

ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాలేషన్ డిస్క్ తయారుచేయడం ఎలా?

 ఇంటర్‌నెట్ లో ఉచితంగా లభించే ఆపరేటింగ్ సిస్టం యొక్క ఇమేజి ఫైల్ ని డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత దాన్ని సిడీ లేదా డివిడీ మరియు పెన్ డ్రైవ్ ఉపయోగించి ఇన్‌స్టాలేషన్ డిస్క్ తయారుచేయడం ఎలాగో ఈ వీడియోలో చూడవచ్చు.

ఉచితంగా ఆపరేటింగ్ సిస్టం డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

 ఉచిత ఆపరేటింగ్ సిస్టంలను(ఎక్కువ పరిమాణం గల ఫైళ్ళను) సులభంగా, వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూడవచ్చు. 

మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ నిలిచిపోయిందా? ఇదిగో మంచి అవకాశం ఉచితంగా!

మనం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ నిలిపివేయబడితే మన ఆపరేటింగ్ సిస్టం కి సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు కనుక మనం కొత్త ఆపరేటింగ్ సిస్టం కొనుక్కోవలసి ఉంటుంది. అదేవిధంగా పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టం వాడుతూ ఉంటే అప్‌డేట్ చేస్తే మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం నఖిలి అని చూపించబడడం వలన మీరు అప్‌డేట్ చేసుకోలేక పోతుండవచ్చు. ఈ సమస్యలకి పరిష్కారంగా ఇప్పుడు మనకి చక్కని, ఖర్చు లేని అవకాశం అందుబాటులో ఉంది.
 ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ల మంది వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం సరికొత్త వెర్షను విడుదల అయినది. విశేషం ఏమిటంటే వీటిని ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. చట్టపరంగానే డబ్బులు కట్టకుండా ఎన్ని కంప్యూటర్లలో అయిన ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఎటువంటి లైసెన్స్ కీలు అవసరం లేదు. మీ ఆపరేటింగ్ సిస్టం నకిలీదని పదేపదే విసిగించదు. పైరేటెడ్ఆపరేటింగ్ సిస్టంలు వాడుతూ బధ్రతా పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మంచి అవకాశం. అప్‌డేట్ల విషయానికి వచ్చినపుడు దీనిలో కూడా మనం కొనుక్కొన్న ఆపరేటింగ్ సిస్టం వలే నిరంతరం సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తుంటాయి. అదేవిధంగా తరువాతి వెర్షను విడుదలైనపుడు ఉచితంగానే మనకు అందించబడుతుంది.


 అన్ని రకాల కంప్యూటర్లలో పని చేసే ఈ ఆపరేటింగ్ సిస్టం పేరు ఉబుంటు. మనందరికి సుపరిచితమైన ఆండ్రాయిడ్ తయారుచేయబడిన లినక్స్ ని ఉపయోగించి దీనిని కూడా తయారుచేసారు. ఇప్పుడు విడుదలైన వెర్షను 14.04. మన అభిరుచికి తగిన విధంగా ఈ ఉబుంటు పలురూపాల్లో అందుబాటులో ఉంది. వాటిని కూడా మనం ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు(క్రింద ఇవ్వబడిన లంకెల ద్వారా).







రాష్ట్ర విభజన - యక్స్‌పి సపోర్ట్ నిలిపివేత

 యక్స్‌పి సపోర్ట్ నిలిపివేయబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ సుమారు రెండు సంవత్సరాల క్రితమే ప్రకటించింది. దానికి అనుగుణంగా అప్పటి నుండి ప్రజలను ప్రత్యామ్నాయాల వైపు మళ్ళించడానికి ఎన్నో ప్రయత్నాలను చేస్తూనే ఉంది. ఇప్పటికే చాలా సంస్థలు, ప్రజలు ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు. అయినప్పటికి ఇప్పటికి చాలా మంది యక్స్‌పిని వాడుతున్నారు. వారిలో సాధారణ ప్రజలే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. వారు ఆదిశగా చర్యలను తీసుకుంటున్నట్లు ఏ పత్రికలోను రాలేదు. బహుషా వారు ఇప్పటికే యక్స్‌పి తరువాతి వెర్షన్‌లతో వచ్చే కంప్యూటర్లను కొనడానికి గుత్తేదారులను సిద్దం చేసుకొనే ఉండవచ్చు. టెండర్ల రూపం లో ప్రజాధనాన్ని అయినవారికి దోచిపెట్టే పందేరం మొదలైపోయి ఉండొచ్చు. మన ప్రక్క రాష్ట్రం తమిళనాడు విషయానికొస్తే ఆ ప్రభుత్వం యక్స్‌పి సపోర్ట్ నిలిచిపోతున్న సందర్భంగా వివిధ శాఖలను ఉచితంగా లభించే ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ సిస్టం లను వాడమని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.
 ఇక మన రాష్ట్రాని కొస్తే రాష్ట్ర విభజన నేపధ్యంలో యక్స్‌పి సపోర్ట్ నిలిచిపోవడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లే ముఖ్యంగా నిర్మాణం కావలసిన సీమాంధ్ర ప్రాంతం. మనం ఇక్కడ సరిగా ఆలోచిస్తే విభజన నేపధ్యంలో అన్ని శాఖలు పునర్‌వ్యవస్థికరణ జరగనుండడం, యక్స్‌పి సపోర్ట్ నిలిపివేయడం ఒకేసారి రావడం వలన మన రాష్ట్రాలకి మంచి అవకాశం వచ్చినట్లే. ఇప్పుడు ఉన్న కంప్యూటర్లలో యక్స్‌పికి బదులుగా మరో ఆపరేటింగ్ సిస్టంను కొనుగోలు చేయడం, తక్కువ సామర్ధ్యం గల కంప్యూటర్లని తొలగించి వాటి స్థానంలో ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న కొత్త కంప్యూటర్లను కొనుగోలు చేయడం వంటి ఖరీదైన ప్రయామ్నాయాలతో పాటు ఉన్న కంప్యూటర్లలోనే ఉచితంగా లభించే ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు మరియు సాఫ్ట్‌వేర్లను వాడుకోవడం వంటి ఉచిత ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉంది. విభజన నేపధ్యంలో నిధుల కొరత రెండు ప్రాంతాలలోను తప్పదు. మన ప్రభుత్వం ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్లను వాడుకలోకి తీసుకువచ్చి విలువైన ప్రజాధనాన్ని ఆధా చేసినచో ఆ నిధులను నిర్మాణ,పునర్‌నిర్మాణ పనులకి కేటాయించుకోవచ్చు. 
 ప్రభుత్వానికి మంచి అవకాశం ఉన్నట్లే ఇప్పుడు ప్రజలకి కూడా ఎన్నికల రూపంలో మంచి అవకాశం వచ్చింది. ప్రజాధనాన్ని స్వాహా చేసే నాయకులను కాకుండా ప్రజాధనాన్ని కాపు కాసే నేతలను ఎన్నుకోవలసిన అవసరం ఉంది. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కనుక ఆలోచించి మానసిక, భౌతిక ప్రలోభాలకు గురి కాకుండా సరైన నిర్ణయం తీసుకోవాలి.

యక్స్‌పిని ఎందుకు సమాధి కట్టి సంతాపం?

 ఏ వార్తా పత్రిక చూసినా యక్స్‌పి ఇక లేదు, యక్స్‌పికి సెలవు, సపోర్ట్ నిలిపివేత అని సంచలనాత్మక వార్తలు. సామాజిక అనుసంధాన వేదికలలో (పేస్‌బుక్,గూగుల్+,ట్విట్టర్ మొదలైన వాటిలో) అయితే మరి విపరీతంగా సమాధి కట్టి సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ ప్రచారం వెనుక అసలు కారణాలు, వచ్చే సమస్యలు, తాత్కాలిక మరియు శాశ్వత పరిష్కారాలు మనం ఈ రోజు తెలుసుకోవలసిందే.

యక్స్‌పికి మైక్రోసాఫ్ట్ సపోర్ట్ నిలిపివేయడంతో పేస్‌బుక్‌లో ప్రచారంలో ఉన్న ఒక చిత్రం

 యక్స్‌పి ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం. దాని తయారీదారు అయిన మైక్రోసాఫ్ట్ వాడు అధికారికంగా సపోర్ట్ నిలిపివేయడం వలన దానికి ఉన్న ప్రాచుర్యం మరియు ఆదరణ కారణంగా ఈ విధంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ఇక నుండి మైక్రోసాఫ్ట్ నుండి దానికి సెక్యూరిటీ అప్‌డేట్స్ రావన్నమాట. దానివలన సగటు కంప్యూటరు వాడుకరికి వచ్చే ఇబ్బంది ఏమిటి? మనకు కనిపించే కధనాలలో అయితే బధ్రత మరియు కొత్త ఫీచర్లు దానికి కారణంగా చెపుతున్నారు. మన శ్రేయస్సుకోరి ఈవిధంగా ప్రచారం జరుగుతుందా? లేక మనల్ని బయభ్రాంతులకి గురిచేసి మరో ఆపరేటింగ్ సిస్టం లేదా మరో ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న లాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కొనుక్కోనే  దిశగా మనల్ని తయారుచేయడానికా?
 చిన్నారి పొన్నారి యక్స్‌పి నిన్నెవరు చంపారమ్మా అని యక్స్‌పిని అడిగితే అది కచ్చితంగా మైక్రో సాఫ్ట్ వాడు నన్ను చంపాడు, కంప్యూటరు తయారీదారులు నా పీక నొక్కారని అంటుందేమో. ఎందుకంటే సాంకేతికంగా యక్స్‌పి కి ఇప్పుడు సపోర్ట్ నిలిపివేసి ఉండవచ్చు, కాని మనం కొన్ని విషయాలు గమనిస్తే మనకి ఎప్పుడో నిలిపివేసినట్లు అర్ధమవుతుంది. మైక్రోసాఫ్ట్ వాడి ఆస్థాన వెబ్ బ్రౌసర్, ఆఫీస్, మీడియా ప్లేయర్, ఇ మెయిల్ క్లయింట్ మరియు వివిధ సాఫ్ట్వేర్లకి వాటి కొత్త వెర్షన్‌లను యక్స్‌పికి విడుదలచేయడం ఎప్పుడో నిలిపివేసింది. అదేవిధంగా మనం కంప్యూటరు తయారీదారు వేబ్ సైటులో యక్స్‌పికి డ్రైవర్ల గురించి వెతికితే యక్స్‌పి తరువాతి ఆపరేటింగ్ సిస్టంలకు దొరుకుతాయి, కాని యక్స్‌పికి దొరకవు. అదేవిధంగా ఎప్పటి నుండో యక్స్‌పితో కంప్యూటర్లు అమ్మడంలేదు. యక్స్‌పికి మైక్రోసాఫ్ట్ సేవలు ఇప్పటికే క్రమక్రమంగా ఎప్పుడో నిలిపివేసింది. కొత్తగా నిలిపివేయడానికి ఏమిలేదు. ఇప్పటి యక్స్‌పి వాడుకర్లు ఎక్కువ మంది ఉండడం వలన మిగిలిన సాఫ్ట్వేర్ తయారీదారులు వారివారి సాఫ్ట్వేర్లను విడుదలచేస్తూనే ఉన్నారు. కేవలం మైక్రోసాఫ్ట్ మరియు కంప్యూటరు తయారీదారులు ఇరువురు పరస్పర సహకారంతో మనల్ని మరో కంప్యూటరు లేదా మరో ఆపరేటింగ్ సిస్టం కొనుగోలు చేయించడానికి సిద్దం చేస్తున్నారు. ఇక్కడ మనం వాళ్ళను తప్పుపట్టనవసరం లేదు ఎందుకంటే వాళ్ళు వ్యాపారులే కాని స్వచ్చంధ సంస్థలేమీ కాదుకదా.

సపోర్ట్ నిలిపివేయడం వలన మరి ఎవరికి నష్టం?

ఎవరైతే డబ్బులు పెట్టి యక్స్‌పిని కొనుక్కొని ఇప్పటికి దాని మీద ఆధారపడ్డారో వాళ్ళకి మాత్రమే. 

మరి ఈ ప్రచారం వలన ఎవరికి లాభం?

మైక్రోసాఫ్ట్ మరియు కంప్యూటరు తయారీదారులకి

   పెద్దపెద్ద కంపెనీలు యక్స్‌పి నుండి మరొక ఆపరేటింగ్ సిస్టం కు వెళ్ళడానికి పూర్తిగా కంప్యూటర్లని మార్చవలసి రావడంతో ఖర్చుకి వెనకాడి మైక్రోసాఫ్ట్ నుండి యక్స్‌పికి డబ్బులిచ్చి సపోర్ట్ని కొనుక్కోవడానికి సిద్దపడ్డాయి. ముందుచూపు గల కొన్ని సంస్థలయితే ఇప్పటికే ఉచిత సాఫ్ట్‌వేర్లను వాడడం ఉద్యోగులకి అలవాటు చేసాయి.  డబ్బున్న సంస్థలయితే ఇప్పటికే వేరే ఆపరేటింగ్ సిస్టంతో కొత్త కంప్యూటర్లను కొనుక్కున్నాయి. గూగులోడయితే తెలివిగా ముందునుండే ఉచిత ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నాడు. అయితే మరి సగటు యక్స్‌పి వాడుకరి పరిస్థితి ఏమిటి? తప్పని సరిగా వేరే ఆపరేటింగ్ సిస్టం లేదా కొత్త ఆపరేటింగ్ సిస్టం పనిచేసే కంప్యూటరు కొనుక్కోవలసిందేనా?
 అవసరం లేదు. యక్స్‌పి మునుపటిలాగే పనిచేస్తుంది. కొంపలేం అంటుకోవు, మనం బేషుగ్గా వాడుకోవచ్చు. బద్రతా కారణాలరీత్యా యక్స్‌పి ఎప్పుడో బలహీనమయిపోయింది. కొత్తగా అప్‌డేట్స్ రాకపోవడం వలన మనం కోల్పోవడానికి ఏమిలేదు. మనం చేయ్యాల్సిందల్లా మనం ఇప్పటిలాగే మన కంప్యూటరును మంచి యాంటీవైరస్ తో తరచు స్కాన్ చేసుకోవడం,ఆ యాంటివైరస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, నమ్మకం కలిగిన సైట్లనుండి మాత్రమే సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేసుకోవడం, పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు ముందు తప్పక స్కాన్ చేసి తెరవడం వంటి ప్రాధమిక విషయాలు పాటించడం ద్వారా మనం ఎప్పుడూ వాడుక్కున్నట్లే వాడుకోవచ్చు. ఈ ప్రచారం అంతా మన జేబు చిల్లు పెట్టదానికే. ఒకవేళ మనం వేరే ఆపరేటింగ్ సిస్టం కొన్నామనుకోండి రాబోవు రోజుల్లో దానికి కూడా సపోర్ట్ నిలిపివేస్తాడు కదా? మరి దానికి శాశ్వత పరిషారం లేదా?
 లేకేం మనం మారడానికి సిద్దంగా ఉంటే మనకి ఉచితంగా ఎన్నో మార్గాలున్నాయి. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటరులోనే వాడుకోవడానికి ఎటువంటి ఖర్చు పెట్టనవసరం లేకుండానే దొరికే ఉచిత ఆపరేటింగ్ సిస్టం లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. మొదట కంప్యూటరు అంటే యక్స్‌పి లేదా విండోస్ అన్న బావన నుండి మనం బయటపడితే చాలు.
 ఇప్పటికే ఉచిత సాఫ్ట్వేర్ల దెబ్బకి పలు సాఫ్ట్వేర్ల ధరలు తగ్గడం మనం చూసాం. ఈ విధంగా మనం ఉచిత సాఫ్ట్వేర్లను వాడితే తొదరలోనే మైక్రోసాఫ్ట్ నుండి కూడా ఉచిత ఆపరేటింగ్ సిస్టం మనం చూడగలం.

పాత కంప్యూటరు హార్డ్‌డిస్కును ఇలా సద్వినియోగించుకోండి

 మన వద్దనున్న పాత డెస్క్‌టాప్ కంప్యూటర్ లేదా లాప్‌టాప్ యొక్క హార్డ్‌డిస్క్‌ను ఎలా ఎటువంటి నైపుణ్యం లేకుండానే సులువుగా తక్కువ ఖర్చుతో పెన్‌డ్రైవ్ మరియు ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్ లా వాడుకోవడానికి అనువుగా మార్చుకొని ఎలా సద్వినియోగపరుచు కోవచ్చునో ఈ వీడియోలో చూడవచ్చును. ఈ పద్దతి ద్వారా పాక్షికంగా పాడయిపోయిన అంటే మన కంప్యూటరు గుర్తించని, ఒకవేళ గుర్తించినప్పటికి ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సమస్యలు వచ్చేటువంటి కొన్ని హార్డ్‌డిస్కులు కూడా ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్కుగా బ్రహ్మాండంగా పనిచేయడం విశేషం. ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర పనిచేయని హార్డ్‌డిస్కులని ఈ వీడియోలో చూపించినట్లు పరిక్షించుకోండి.

మంచి డాక్టర్‌ని వెతికి సులభంగా అపాయింట్‌మెంట్ పొందండిలా!

 మహానగరాల్లో మంచి వైద్యులను గుర్తించడం కత్తిమీద సామే. మంచి వైద్యులను గుర్తించి మనకు వీలున్న సమయంలో అపాయింట్‌మెంట్ పొందడం కూడా ప్రయాసతో కూడిన పనే. అదే మన నగరంలో ఉన్న ఆసుపత్రుల మరియు వైద్యుల సమాచారం మనకి ఒకేచోట ఉంచి వారి అపాయింట్‌మెంట్ కూడా సులభంగా లభించేటట్లు ఉచిత సేవ అందుబాటులో ఉంటే బాగుంటుంది కదూ. హైదరాబాదు, డిల్లీ, ముంబాయి మరియు బెంగళూరు వంటి మహానగారాల్లో ప్రముఖులైన వైద్యులను, ఆసుపత్రులను గురించిన సమాచారం ఒక చోట ఉంచి, సులభంగా వారి అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి మనకి డాక్‌సజెస్ట్ అను వెబ్ సైటు ఉపయోగపడుతుంది. ఇక్కడ 13686 డాక్టర్ల మరియు 4627 ఆసుపత్రుల సమాచారం మనకి అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనం సమస్య లేదా డాక్టర్ ఆధారంగా మరియు మనం ఉన్న ప్రదేశానికి దగ్గరగా ఉన్న వారిగురించి వెతకవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యమైనది డాక్టర్ల గురించి మనలాంటి వారి రివ్యూలు అందుబాటులో ఉంచడం. వాటిని ఆధారంగాచేసుకొని మనం సరైన వైద్యుడిని ఎంచుకోవడం సులభమవుతుంది. మనం డాక్టరు అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి గూగుల్ లేదా ఫేస్‌బుక్ అకౌంట్ ఉపయోగించుకోవచ్చు లేదా రిజిస్టరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి మనం డాక్టరు అపాయింట్‌మెంట్ తీసుకోగానే మనకి ఒక మెసేజ్ వస్తుంది. ఆ తరువాత మనకి ఫోన్‌ చేసి మనకి, డాక్టరుకి  అందుబాటులో ఉన్న సమయంలో అపాయింట్‌మెంట్ కుదురుస్తారు. అలాగే ఈ సైటులో వివిధ ఆసుపత్రులలో ఉన్న హెల్థ్ ప్యాకేజిలు, వాటివివరాలు, ధరలు వాటిగురించి ప్రజల అభిప్రాయాలు అందుబాటులో ఉండడం వలన మనకి ఎంపిక కూడా సులభమవుతుంది.


మీ కంప్యూటర్‌కి సౌండ్ డ్రైవర్లు దొరక్కపోతే

  ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆపరేటింగ్ సిస్టములకి మీ కంప్యూటరు యొక్క సౌండ్ డివైజ్ పనిచేయకపోతే లేదా వాటికి సంబందించిన ఆడియో డ్రైవర్లు దొరక్కపోతే మొదట క్రింది లంకెలో చెప్పిన విధంగా డ్రైవర్ ప్యాక్ సొల్యూషన్ పయత్నించండి.

http://spveerapaneni.blogspot.in/2013/09/blog-post_7.html

అయినప్పటికి  సౌండ్ డ్రైవర్లు దొరక్కపోతే అందుబాటులో ఉన్న మిగతా ప్రత్యామ్నాయాలను ఈవీడియోలో చూడవచ్చు.

బ్రాడ్‌బ్యాండ్ కేబుల్‌ని ఉపయోగించి ఇంటర్ నెట్ ని టాబ్లెట్లలో వాడుకోవడానికి

 మనం టాబ్లెట్లలో ఇంటర్ నెట్ వాడుకోవడానికి సాధారణంగా వైఫి సదుపాయాన్ని ఉపయోగిస్తుంటాము. సిమ్‌కార్డ్ సదుపాయం ఉన్న టాబ్లెట్లలో అయితే 2జి లేదా 3జి సేవలని ఉపయోగించి ఇంటర్‌నెట్ కి అనుసంధానమవుతుంటాము. సాధారణ ఇంటర్‌నెట్ తో పోల్చితే సెల్యులార్ డాటా పధకాలు ఖరీదు ఎక్కువ కావడం మరియు మన దగ్గర వైఫి రూటర్ అందుబాటులో లేనపుడు మనం ప్రత్యామ్నాయంగా మన కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్ ని మన టాబ్లెట్లలో ఎలా పొందాలో ఈవీడియోలో చూడవచ్చు.

కంప్యూటర్ నెట్ పోర్ట్ పనిచేయడంలేదా?

 మన కంప్యూటర్ ని ఇంటర్ నెట్ ప్రపంచంతో అనుసంధానించే నెట్ పోర్ట్ పని చేయకపోతే మనం పిసిఐ నెట్ కార్డులను వాడుతుంటాము. మన ఆపరేటింగ్ సిస్టలో పనిచేసే నెట్ కార్డు మనకి దొరకనపుడు, లాప్‌టాప్ నెట్ పోర్ట్ చెడిపోయినపుడు లేదా మన కంప్యూటర్‌ యొక్క మధర్‌బోర్డ్ లో పిసిఐ స్లాట్‌లు అందుబాటులో లేనపుడు ఈ పిసిఐ కార్డులు మనకి ఉపయోగపడవు. ఈ పిసిఐ నెట్ కార్డులకి చవకైన,సులభమైన ప్రత్యామ్నాయాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఎటువంటి కంప్యూటరు పరిజ్ఞానం లేనివారుకూడా వాడుకోవచ్చు.
   

మొబైళ్ళు,టాబ్లెట్లలో పెన్ డ్రైవ్ వాడుకోడానికి

 మొబైళ్ళు మరియు టాబ్లెట్లలో డాటా స్టోరేజ్ పరిమితులను అధికమించడానికి చవకైన(కేవలం 20 రూపాయలు) ప్రత్యామ్నాయాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

ఉచిత తెలుగు ఆన్‌లైన్ రేడియో

 ఉచితంగా తెలుగు ఆన్‌లైన్ రేడియో స్టేషన్‌లను మన డెస్క్‌టాప్ మ్యూజిక్ ప్లేయర్లలో జతచేసుకొని మనకు కావలసినప్పుడు వినడం ఎలాగో ఈ వీడియోలో చూడవచ్చు.

వెబ్ సైట్లలో లో ఉండే అవాంచిత వ్యాపార ప్రకటనలను నివారించండిలా

 మనం ఒక వెబ్ సైట్ ని సందర్శించినపుడు మనకి కావలసిన విషయాలతో పాటుగా చాలారకాల ప్రకటనలు(flash adds,text adds,popup) కనిపిస్తుంటాయి. వీటివలన వాడుకరికి విసుగు తో పాటు ఆ వెబ్ పేజి నెమ్మదిగా లోడ్ కావడం,విలువైన సమయం మరియు బాండ్ విడ్త్ వృధా అవుతాయి. ఈ సమస్యకు చక్కని పరిష్కారం ఈ వీడియోలో చూడవచ్చు.

వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని పిడియఫ్ ఫైల్‌గా మార్చడం

 అంతులేని సమాచారాన్ని మనకు ఉచితంగా అందించే వికీపీడియాలోని వ్యాసాలను నెట్ లేనపుడు చదువుకోవడానికి మరియు వివిధ పరికరాలలో చదువుకోవడానికి అనుగుణంగా పిడియఫ్ లేధా ఇ బుక్ గా మార్చుకునే విధానమును ఈ వీడియోలో చూడవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లలో తెలుగు టైప్ చేయడం

 ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తయారుచేసిన తెలుగుమాట అను ఉచిత తెలుగు టైపింగ్ కీబోర్డ్ అప్లికేషన్‌ని ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్లు మరియు టాబ్లెట్లలో తెలుగు టైప్ చేయు విధానమును గురించి తెలుసుకోవచ్చు.


కంప్యూటర్లో తెలుగు వ్రాయడం ఎలా?

కంప్యూటర్లో తెలుగు వ్రాయడానికి


1.లేఖిని 
http://lekhini.org/

2.గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ 
http://google.com/transliterate/indic/telugu

3.క్విల్ పాడ్ 
http://quillpad.com/telugu/

4.స్వేచ్ఛ  
http://www.yanthram.com/te/

6.లిపిక్.ఇన్ 
http://lipik.in/telugu.html

7.ఇన్ స్కిప్ట్ 
http://www.baraha.com/download.htm

9.అను మాడ్యూలర్ 

13.లినక్స్ లో

16.Microsoft -Indian language input tool

 

ఫైర్‌ఫాక్స్ విహారిణిలో


1.ఇండిక్ ఇన్‌పుట్ పొడగింత
2.పద్మ పొడగింత
3.తెలుగు టూల్‌బార్
http://telugutoolbar.mozdev.org/

4. ప్రముఖ్ టైప్
http://www.vishalon.net/Download/tabid/246/Default.aspx

సిస్టంలో తెలుగు ఎనేబుల్ చేసినా కూడా వార్తాపత్రికలు చదవాలంటే కష్టమే. దీనికి కారణం యూనికోడ్ లో మనమందరం వాడేది గౌతమి ఫాంట్. పేపర్ల ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ని కాపీ చేసుకుని My computer> C > Windows > Fonts లో పేస్ట్ చేయండి. 

భారతీయ భాషలలోని వార్తా పత్రికలను చదవడానికి:
 

ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు:


ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి.

1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్
 http://www.google.com/transliterate/indic/telugu

2. క్విల్‌ప్యాడ్

3. లేఖిని
http://lekhini.org/

లేఖిని ఉపకరణాన్ని offline కూడా వాడుకోవచ్చు. లేఖిని ని తిరగేస్తే నిఖిలే. తెలుగు చదవడం రానివారికి తెలుగు సందేశాన్ని నిఖిలే ఇంగ్లీష్ ఉఛ్ఛారణలోకి మార్చి పెడుతుంది.

http://lekhini.org/nikhile.html

4.ఐట్రాన్స్
http://www.aczoom.com/itrans/html/tlgutx/tlgutx.html

ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని బ్రౌజరు లు యూనికోడ్ ను అర్ధం చేసుకుంటున్నాయి.కాపీ పేస్టు బాధ లేకుండా, డైరెక్ట్ గా మెయిల్ విండో లోనే, తెలుగు లో టైపు చెయ్యవచ్చు.

 

వర్డ్ డాక్యుమెంట్ లో తెలుగు ని దాచుకోవడం:


మీరు విండోస్ విస్టా,7,8 వాడుతున్నట్లయితే, తెలుగు కి సపోర్ట్ దానితోనే వస్తుంది. విండోస్ ఎక్స్ పీ లో ఐతే మాత్రం కాంప్లెక్స్ స్క్రిప్ట్ లని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలో ఇక్కడ వివరంగా ఉంది:.

 

లిపులు –లిప్యంతరీకరణ:


1.పద్మ ఉపకరణం 
వెన్ననాగార్జున గారు (vnagarjuna@gmail.com) ఫాంట్లన్నిటినీ యూనీకోడ్ కి మార్చేలాగా పద్మ ఉపకరణం తయారుచేశారు. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్ కి మార్చగల సామర్థ్యానికి ఎదిగింది.  
http://padma.mozdev.org/

2.హరివిల్లు ప్లగిన్‌
యూనీకోడ్ వెబ్‌పేజీని RTS లోకి మారుస్తుంది.
http://plugins.harivillu.org/

3.అను2యూనికోడ్
అను 6లో గానీ 7లో గానీ టైప్ చేయబడి, టెక్స్ట్ ఫార్మాటులో ఉన్న ఫైళ్ళను ఇది యూనీకోడులోకి మారుస్తుంది. http://anu2uni.harivillu.org/

4.ఈమాట
Non-Unicode Font to Unicode Converter.
http://eemaata.com/font2unicode/index.php5

e-తెలుగు సౌజన్యంతో

మొబైళ్ళలో తెలుగు టైపు చెయ్యడం

 ఈ క్రింది ఆప్స్‌ను ఉపయోగించి మీ చేతిఫోన్లలో మరియు టాబ్లెట్లలో సులువుగా తెలుగు టైపు చెయ్యవచ్చు. ఇక్కడ ఇవ్వబడిన లంకెల నుండి ఉచితంగా దింపుకోవచ్చు.


ఆండ్రాయిడ్ ఫోన్‌లు మరియు టాబ్లెట్లలో


1. తెలుగు మాట:
https://play.google.com/store/apps/details?id=com.telugu.telugumata

2. మల్టిలింగ్ కీబోర్టు:
https://market.android.com/details?id=com.klye.ime.latin&hl=te

3. పాణిని కీప్యాడ్:
https://play.google.com/store/apps/details?id=com.paninikeypad.telugu

4. సి-డాక్ జిస్ట్ వారి తెలుగు ఆప్:
http://apps.mgov.gov.in/searchapp.do?action=9&criteria=telugu

ఐఫోన్, ఐప్యాడ్ లో

విండోస్ ఫోన్లలో