మహానగరాల్లో మంచి వైద్యులను గుర్తించడం కత్తిమీద సామే. మంచి వైద్యులను గుర్తించి మనకు వీలున్న సమయంలో అపాయింట్‌మెంట్ పొందడం కూడా ప్రయాసతో కూడిన పనే. అదే మన నగరంలో ఉన్న ఆసుపత్రుల మరియు వైద్యుల సమాచారం మనకి ఒకేచోట ఉంచి వారి అపాయింట్‌మెంట్ కూడా సులభంగా లభించేటట్లు ఉచిత సేవ అందుబాటులో ఉంటే బాగుంటుంది కదూ. హైదరాబాదు, డిల్లీ, ముంబాయి మరియు బెంగళూరు వంటి మహానగారాల్లో ప్రముఖులైన వైద్యులను, ఆసుపత్రులను గురించిన సమాచారం ఒక చోట ఉంచి, సులభంగా వారి అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి మనకి డాక్‌సజెస్ట్ అను వెబ్ సైటు ఉపయోగపడుతుంది. ఇక్కడ 13686 డాక్టర్ల మరియు 4627 ఆసుపత్రుల సమాచారం మనకి అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనం సమస్య లేదా డాక్టర్ ఆధారంగా మరియు మనం ఉన్న ప్రదేశానికి దగ్గరగా ఉన్న వారిగురించి వెతకవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యమైనది డాక్టర్ల గురించి మనలాంటి వారి రివ్యూలు అందుబాటులో ఉంచడం. వాటిని ఆధారంగాచేసుకొని మనం సరైన వైద్యుడిని ఎంచుకోవడం సులభమవుతుంది. మనం డాక్టరు అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి గూగుల్ లేదా ఫేస్‌బుక్ అకౌంట్ ఉపయోగించుకోవచ్చు లేదా రిజిస్టరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి మనం డాక్టరు అపాయింట్‌మెంట్ తీసుకోగానే మనకి ఒక మెసేజ్ వస్తుంది. ఆ తరువాత మనకి ఫోన్ చేసి మనకి, డాక్టరుకి అందుబాటులో ఉన్న సమయంలో అపాయింట్‌మెంట్ కుదురుస్తారు. అలాగే ఈ సైటులో వివిధ ఆసుపత్రులలో ఉన్న హెల్థ్ ప్యాకేజిలు, వాటివివరాలు, ధరలు వాటిగురించి ప్రజల అభిప్రాయాలు అందుబాటులో ఉండడం వలన మనకి ఎంపిక కూడా సులభమవుతుంది.