ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టం కొత్త వెర్షను విడుదలైంది

 ఏ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఉచితంగా లభించే ఆపరేటింగ్ సిస్టములు మనకి చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం యొక్క సరికొత్త వెర్షను ఇపుడు మనకు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.

మన ఫోన్‌ యొక్క రేడియేషన్ ఎంత అన్నది తెలుసుకోవడం ఎలా?

 ఈ మధ్యకాలంలో ఎక్కువ స్పెసిఫికేషన్ గల దేశీయ, చైనా తయారీ ఫోన్లు తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అయితే వీటిలో ఎన్ని ఫోన్లు భారత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కొరకు జారీచేసిన రేడియోషన్ పరిమితులను గౌరవిస్తున్నాయి. దీనిని తెలుసుకోవడం ఎలా?  మనిషి ఆరోగ్యంపై ధుష్ప్రభావాలు లేకుండా ఉండడానికి మన ప్రభుత్వం మొబైల్ ఫోను యొక్క రేడియేషన్ పరిమితిని

మొబైళ్ళలో చేత్తో రాయడానికి

ఈ మధ్యన గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టములో వివిధ స్థానికభాషలకు మధ్దతును కల్పించడంతో పాటు ఇన్‌పుట్ టూల్స్ లో కూడా స్థానికభాషలను పరిగణలోకి తీసుకుని తగిన మధ్దతును అందిస్తుంది. మొబైళ్లలో సాధారణంగా మనం టైప్ చేయడానికి వాడే కీబోర్డ్ అప్లికేషన్‌తో పాటు అధనంగా నోటిమాటను కూడా అక్షరాలుగా మార్చగలిగే సదుపాయాన్ని ఇప్పటికే కల్పించిన గూగుల్ తాజాగా నేరుగా చేతివ్రాతను అక్షరాలుగా మార్చే

ఇంటర్నెట్‌ స్వేచ్చని కాపాడుకుందాం రండి

స్వేచ్ఛగా మనం వాడుకుంటున్న ఇంటర్నెట్‌ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు మొబైల్ కంపెనీలు ట్రాయ్‌ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మన మొబైల్ ఇంటర్ వాడకంపై కీలకమైన నిర్ణయం తీసుకోబోయే ముందు ట్రాయ్  ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. మనం గనుక ఈ సమయంలో నిరసన వ్యక్తం చెయ్యకపోతే, ట్రాయ్ మొబైల్ కంపెనీల నిర్ణయాన్ని తన నిర్ణయంగా వెలువరించి మనపై భారాన్ని రుద్దక తప్పేట్టులేదు. దానివలన మనం భవిష్యత్తులో

వాహనాల కోసం ఆండ్రాయిడ్

ఫోన్లు, టాబ్లెట్లతో మొదలుపెట్టి టీవి, చేతిగడియరాలు, గేమింగ్ బాక్సులు మరియు కళ్ళజోళ్ళు వంటి పరికరాలను స్మార్ట్‌గా మార్చిన లినక్స్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ ఇప్పుడు వాహనాలను కూడా స్మార్ట్ గా మార్చబోతుంది. వాహనాల డాష్‌బోర్డులో ఉండే ఆడియో ప్లేయర్లు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టముతో శక్తివంతమై పాటలు వినడానికి మాత్రమే కాకుండా దారిచూపడానికి, చిరునామా చెప్పడానికి, దగ్గరలో ఉన్న ప్రదేశాల