మీ మోటోజి లో ఆండ్రాయిడ్ 5.0.2 (లాలిపప్) ఇన్‌స్టాల్ చేసుకోండిలా.

 మోటోజి గత సంవత్సరం అత్యధిక ప్రజాధరణ పొందిన ఫోన్. అందుబాటు ధరలో మంచి ఫీచర్లతో లభిస్తుండడమే కాకుండా కొత్త ఆండ్రాయిడ్ వెర్షనుకి తొందరగా అప్‌డేట్స్ పొందడం దీని ప్రత్యేకత. మోటోజికి ఇప్పటికే ఆండ్రాయిడ్ 5 (లాలిపప్) అప్‌డేట్ రావల్సిఉంది. లాలిపప్‌లో ఉన్న మెమోరీ లీకేజి సమస్య కారణంగా జాప్యం జరిగింది. గూగుల్ సమస్యలను సరిచేసి 5.0.2 విడుదల చేసిన తరుణంలో
మోటోజి లాలిపప్ అప్‌గ్రేడ్ తొందరలోనే రాబోతుంది. మోటోరోలా అధికారికంగా ఒటిఎ అప్‌డేట్ విడుదల చేయకముందే ఇప్పుడే మనం మన మోటోజిని లాలిపప్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ పద్దతి ద్వారా వారెంటీ పోగుట్టుకోనక్కర లేకుండానే (మనం ఫోను రూట్‌ చేసి, బూట్‌లోడర్ అన్‌లాక్ చేసి, కస్టమ్ రామ్‌ ఇన్‌స్టాల్ చేసి) మనం మన మోటోజిని లాలిపప్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.


 మోటోరోలా తన పరికరాలకు కొత్త ఆండ్రాయిడ్ వెర్షను విడుదలచేసే ముందు ఆపరేటింగ్ సిస్టమును పరిక్షించడానికి రిజిస్టరు చేసుకున్న వాడుకర్లకు మాత్రం రాబోయే ఆపరేటింగ్ సిస్టము యొక్క ఒటిఎ అప్‌డేట్‌ని అందిస్తుంది. ఈ పక్రియను సోక్‌ టెస్ట్ అంటారు. ఈ సోక్‌టెస్ట్‌లో భాగంగా వచ్చిన ఒటిఎ అప్‌డేట్‌ ఫైల్‌ని ఉపయోగించి మనం కూడా మోటోజిని లాలిపప్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ పద్దతి 4.4.4 కిట్‌కాట్ ఇన్‌స్టాల్ చెయ్యబడి, భారతదేశంలో కొన్న ఫోన్‌లకు పనిచేస్తుంది. మనం చేయవలసిందల్లా క్రింది లింకు ఇవ్వబడిన ఒటిఎ అప్‌డేట్‌ ఫైల్‌ని మన కంప్యూటరు ద్వారా దింపుకొని ఫోను స్టోరేజి లోకి (ఈ జిప్ ఫైల్‌ని ఫోల్డర్లలో కాకుండా అంటే మ్యూజిక్, డౌన్‌లోడ్స్ వంటి ఫోల్డర్లలో కాకుండా నేరుగా స్టోరేజి లోకి) కాపీ చేసుకోవాలి. తరువాత సెట్టింగ్స్- అబవుట్ ఫోన్‌- సిస్టం అప్‌డేట్ లోకి వెళ్ళినపుడు మన ఫోనుకి ఆండ్రాయిడ్ 5.0.2 అప్‌డేట్ అందుబాటులో ఉందని చూపిస్తుంది. ఆ తరువాత తెరపై చూపించిన సూచనలను పాటిస్తే సరి. ఫోను తిరిగి ప్రారంబించబడి లాలిపప్ 5.0.2 మన ముందుంటుంది. ఈ పద్దతిలో మన డాటా కూడా అలానే ఉండడమే కాకుండా రాబోయో రోజుల్లో మన ఫోనుకు అధికారికంగా విడుదల చేసిన అప్‌డేట్స్ కూడా పొందవచ్చు.