స్క్రీన్ షాట్లు తీయడానికి అత్యుత్తమ మార్గం

సాధారణంగా స్క్రీన్ షాట్లు తీయడానికి కీబోర్డ్ లో ప్రింట్ స్క్రీన్ ని ఉపయోగిస్తాము. దాని ద్వారా పూర్తి తెరను మనం ఫొటో తీయవచ్చు. ఇంకా సాధికారతతో అత్యుత్తమమంగా స్క్రీన్ షాట్లు తీయడానికి షట్టర్ అనే ఉచిత అనువర్తనమును ఉపయోగించవచ్చు. ఇది దాదాపు అన్ని లినక్స్ పంపకాలలో అందుబాటులో ఉంది. ఉబుంటులో దీనిని ఉబుంటు సాఫ్ట్వేర్

డెస్క్ టాప్ ని మనకు నచ్చినట్లు మార్చుకోవడానికి

ఉబుంటులో యునిటీ డెస్క్ టాప్ అప్రమేయంగా వాడబడుతుంది. యునిటీ వచ్చిన తరువాత డెస్క్ టాప్ ని మనకు నచ్చినట్లు మార్చుకోవడానికి అవకాశం తగ్గింది. ఉబుంటు12.04 లో యునిటీ అదనపు విశిష్టతలతో పాటు మరింతమెరుగ్గా, వాడుటకు సరళంగా మరియు మరింత స్థిరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా వాడుకరి మార్చుకోవడానికి కొంత వెసులుబాటు కూడా కల్పించారు.

పైరేటెడ్ సాఫ్ట్వేర్ నుండి విముక్తి కావడానికి గొప్ప అవకాశం!

మీరు తెలిసో తెలియకో  పైరేటెడ్ సాఫ్ట్వేర్ బారిన పడి ఉండవచ్చు. జాగ్రత్త! క్రింది లక్షణాలను ఆధారంగా ఒకసారి తనిఖీ చేసుకోండి.

లక్షణాలు:

  1. నా కంప్యూటరు ఆపరేటింగ్ సిస్టం కొరకు 5000 నుండి 10000ల రూపాయలు వెచ్చించలేదు. 

అన్ని రకాల ఆడియో, వీడియో ఫైళ్ళు ప్లే చేయడానికి

సాధారణంగా విండోస్లో మాత్రమే అన్ని రకాల ఆడియో, వీడియో ఫైళ్ళు ప్లే అవుతాయి ఉబుంటు మరియు మిగిలిన లినక్సు పంపకాలలో ప్లే కావు అని అనుకోవడం వలన ఉబుంటు లాంటి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలు వాడడానికి వెనకాడతారు. కానీ అది అపోహ మాత్రమే. చక్కగా మనం అన్నిరకాల ఆడియో మరియు వీడియోలు వినవచ్చు, చూడవచ్చు.

మీ డీవీడీ ప్లేయర్ కి తగిన వీడియో డిస్కులు మీకు నచ్చిన విధంగా సులభంగా తయారుచేసుకోవడానికి

మనదగ్గర ఉన్న వీడియోలు ఏ ఫార్మాట్ లో ఉన్నా కూడా మన డీవీడీ ప్లేయర్ లో ప్లే అయ్యే విధంగా, మనకు నచ్చిన విధంగా వీడియో డిస్కులు తయారుచేయడానికి DeVeDe అను ఓపెన్ సోర్స్ అప్లికేషన్ ని వాడవచ్చు. దీనిని ఉబుంటు సాప్ట్వేర్ సెంటర్ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. విండోస్ వాడేవారు ఇక్కడ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.