ఉబుంటు ఇన్ స్టాలేషన్ డిస్క్ తయారుచేయు విధానము

 మొదట మీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కి సరిపడే ఉబుంటు ఇన్ స్టాలేషన్ ఇమేజ్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి.తరువాత ఏదైనా డిస్క్ రైటింగ్ సాఫ్ట్ వేర్ (ఉబుంటు లో బ్రసిరో లేదా కే3బి విండోస్ లో నీరో)ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకోన్న ఇమేజ్  ఫైల్ ని సాధ్యమైనంత తక్కువ వేగం లో(4X)సీడి బర్న్ చేసుకోవాలి.అంతే ఉబుంటు సీడి  సిద్ధం.
 సీడి వృధా అనుకొంటే పెన్ డ్రైవ్ ఉపయోగించి కూడా ఇన్ స్టాలేషన్ డ్రైవ్ తయారుచేసుకోవచ్చు.ఉబుంటు వాడేవారు స్టార్టప్ డిస్క్ క్రియేటర్ ని ,విండోస్,మాక్ మరియు మిగతా లినక్స్ పంపకాలు వాడేవారు unetbootin ని ఉపయోగించి ఇన్ స్టాలేషన్ డ్రైవ్ తయారుచేసుకోవచ్చు.మొదట మీ పెన్ డ్రైవ్ ని FAT32 లో ఫార్మాట్ చేసుకోవలెను.ఆ తరువాత క్రింది చిత్రాలలో చూపిన విధంగా చేయాలి.
unetbootin  ని ఉపయోగించి ఇన్ స్టాలేషన్ డ్రైవ్ తయారుచేసుకోవడం
ఉబుంటు స్టార్టప్ డిస్క్ క్రియేటర్ ని ఉపయోగించి ఇన్ స్టాలేషన్ డ్రైవ్ తయారుచేసుకోవడం
 పై రెండు విధానాల ద్వారా చాలా సులభంగా,పది నుండి పదిహేను నిమిషాల లో ఉబుంటు మరియు వివిధ లినక్స్ పంపకాల ఇన్ స్టాలేషన్ పెన్ డ్రైవ్ ని తయారుచెసుకోవచ్చు.
 ఈవిధంగా తయారు చేసుకున్న ఉబుంటు సీడి/పెన్ డ్రైవ్ ని ఉపయేగించి ఉబుంటు ని మన కంప్యూటర్లలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చును. అంతేకాకుండా ఉబుంటు సీడి/పెన్ డ్రైవ్  ని ఉపయేగించి  పాడయిన,వైరస్ సోకిన కంప్యూటర్ల డాటా రికవరి చేయవచ్చు,ఉబుంటుని సీడి/పెన్ డ్రైవ్ నుండి నేరుగా వాడుకోవచ్చు.అందువలన సాధారణ కంప్యూటర్ వాడుకర్లు  తమ వద్ద తప్పక  ఉబుంటు సీడి/పెన్ డ్రైవ్  ని ఉంచుకోవలెను.

ఉబుంటు ఇన్స్టాల్ చేయు విధానము

సాధారణ వాడుకర్లు కూడా చాలా సులభంగా కంప్యూటర్ / లాప్ టాప్ నందు ఉబుంటును ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పూర్తిగా ఉబుంటు గాని లేదా ప్రస్థుతం ఉన్న ఆపరేటింగ్ సిస్టం పక్కన డ్యుయల్ బూట్ గా కాని ఇన్ స్టాల్ చేసుకోవచ్చును. మొదట ముందు పోస్ట్ లో వివరించిన విధంగా ఉబుంటు ఇన్ స్టాలేషన్ డిస్క్ తయారుచేసుకోవాలి.

ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ వాడే ఆపరేటింగ్ సిస్టము ఏది?

గూగుల్ తెలియని ఇంటర్ నెట్ మరియు కంప్యూటర్ వాడుకరులు ఉండరన్నది జగమెరిగిన సత్యము.గూగుల్ వారి ఉత్పత్తులు అంతగా ప్రజాదరణ పొందాయి.అయితే గూగుల్ వారు తమ సంస్థలో వాడే ఆపరేటింగ్ సిస్టము గూర్చి తెలుసు కోవాలని ఉందా.మరెందుకు ఆలస్యం గూగులోడి మాటల్లోనే వినండి.

డయాగ్రాములు, ఫ్లోచార్టులు గీయడానికి

డయాగ్రాములు, ఫ్లోచార్టులు గీయడానికి ఉచిత స్వేచ్చా అనువర్తనము డయా. దీనిని మైక్రోసాఫ్ట్ విసియోకి చక్కని ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. విండోస్, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో పనిచేస్తుంది. ఉబుంటు వాడేవారు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి నేరుగా స్థాపించుకోవచ్చు. మిగిలిన ఆపరేటింగ్ సిస్టములు వాడువారు క్రింద

మనం సైతం

ఏ దేశమేగినా, ఎందు కాలిడినా మన తెలుగువారు లేని ప్రధేశము లేదంటే అతిశయోక్తి కాదేమో. జీవన అవకాశాల కోసం వివిధ దేశాలకు వెళ్ళి, వెళ్ళిన చోట తమ కష్టించే తత్వం మరియు ప్రతిభా పాటవాలతో అనతి కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో తెలుగు వారికి సాటి లేదు. ఈరోజుల్లో ప్రపంచంలో ప్రసిధ్ధి చెందిన ఏ ప్రాజెక్టును తీసుకున్నా వాటిలో