ఉబుంటు ఇన్ స్టాలేషన్ డిస్క్ తయారుచేయు విధానము

 మొదట మీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కి సరిపడే ఉబుంటు ఇన్ స్టాలేషన్ ఇమేజ్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి.తరువాత ఏదైనా డిస్క్ రైటింగ్ సాఫ్ట్ వేర్ (ఉబుంటు లో బ్రసిరో లేదా కే3బి విండోస్ లో నీరో)ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకోన్న ఇమేజ్  ఫైల్ ని సాధ్యమైనంత తక్కువ వేగం లో(4X)సీడి బర్న్ చేసుకోవాలి.అంతే ఉబుంటు సీడి  సిద్ధం.
 సీడి వృధా అనుకొంటే పెన్ డ్రైవ్ ఉపయోగించి కూడా ఇన్ స్టాలేషన్ డ్రైవ్ తయారుచేసుకోవచ్చు.ఉబుంటు వాడేవారు స్టార్టప్ డిస్క్ క్రియేటర్ ని ,విండోస్,మాక్ మరియు మిగతా లినక్స్ పంపకాలు వాడేవారు unetbootin ని ఉపయోగించి ఇన్ స్టాలేషన్ డ్రైవ్ తయారుచేసుకోవచ్చు.మొదట మీ పెన్ డ్రైవ్ ని FAT32 లో ఫార్మాట్ చేసుకోవలెను.ఆ తరువాత క్రింది చిత్రాలలో చూపిన విధంగా చేయాలి.
unetbootin  ని ఉపయోగించి ఇన్ స్టాలేషన్ డ్రైవ్ తయారుచేసుకోవడం
ఉబుంటు స్టార్టప్ డిస్క్ క్రియేటర్ ని ఉపయోగించి ఇన్ స్టాలేషన్ డ్రైవ్ తయారుచేసుకోవడం
 పై రెండు విధానాల ద్వారా చాలా సులభంగా,పది నుండి పదిహేను నిమిషాల లో ఉబుంటు మరియు వివిధ లినక్స్ పంపకాల ఇన్ స్టాలేషన్ పెన్ డ్రైవ్ ని తయారుచెసుకోవచ్చు.
 ఈవిధంగా తయారు చేసుకున్న ఉబుంటు సీడి/పెన్ డ్రైవ్ ని ఉపయేగించి ఉబుంటు ని మన కంప్యూటర్లలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చును. అంతేకాకుండా ఉబుంటు సీడి/పెన్ డ్రైవ్  ని ఉపయేగించి  పాడయిన,వైరస్ సోకిన కంప్యూటర్ల డాటా రికవరి చేయవచ్చు,ఉబుంటుని సీడి/పెన్ డ్రైవ్ నుండి నేరుగా వాడుకోవచ్చు.అందువలన సాధారణ కంప్యూటర్ వాడుకర్లు  తమ వద్ద తప్పక  ఉబుంటు సీడి/పెన్ డ్రైవ్  ని ఉంచుకోవలెను.