సాధారణ వాడుకర్లు కూడా చాలా సులభంగా కంప్యూటర్ / లాప్ టాప్ నందు ఉబుంటును
ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పూర్తిగా ఉబుంటు గాని లేదా ప్రస్థుతం ఉన్న
ఆపరేటింగ్ సిస్టం పక్కన డ్యుయల్ బూట్ గా కాని ఇన్ స్టాల్
చేసుకోవచ్చును. మొదట ముందు పోస్ట్ లో వివరించిన విధంగా ఉబుంటు ఇన్ స్టాలేషన్ డిస్క్
తయారుచేసుకోవాలి.
డ్యుయల్ బూట్ గా విండోస్ తో పాటు ఇన్ స్టాల్ చేసుకోవాలనుకున్నవారు మొదట డ్రైవ్స్ ని సిద్ధం చేసుకోవాలి. ఉబుంటు కోరకు కనీసం 5జిబి కి తక్కువ కాకుండా హర్డ్ డిస్క్ నందు కాళి స్థలాన్ని ఏర్పరుచుకోవాలి. దీన్ని విండోస్ లో My Computer-Manage-Disk management ద్వారా చేయవచ్చు. డాటా కోల్పోయే అవకాశం ఉంది కనుక ఈ పక్రియ చాలా జాగ్రత్తగా చేయాలి. లేదా డాటా పూర్తిగా బేక్ అప్ తీసుకోవాలి. తరువాత డ్రైవ్స్ ని రినేం చేసుకోవాలి. ఉధా: సిడ్రైవ్ ని విండోస్ అని మిగిలిన డ్రైవ్స్ ని మనకి నచ్చిన పేరుతో గాని రినేం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉబుంటు సీడి / పెన్ డ్రైవ్ ని సీడిడ్రైవ్ / USB Port నందు ఉంచి కంప్యూటర్ని రిస్టార్ట్ చేయాలి. కంప్యూటర్ ఆన్ కాగానె F12 ని నొక్కడం ద్వారా బూట్ డిస్క్ ని ఎంచుకోవచ్చు. లేదా బయోస్ లో కి (కంప్యూటర్ ఆన్ కాగానె F2, Delete, Esc లను నొక్కి) వెళ్ళి బూట్ ప్రాధాన్యతలను మొదట సిడిని / USB ని ఉంచి సేవ్ చేసుకోవాలి. అపుడు కంప్యూటర్ ఉబుంటు ఇన్ స్టాలేషన్ డిస్క్ నుండి బూట్ అవుతుంది.
ఇవిధంగా లోడ్ అయి రెండు నుండి నాలుగు నిమిషాలలో క్రింది చిత్రంలో వలే కనిపించును.డ్యుయల్ బూట్ గా విండోస్ తో పాటు ఇన్ స్టాల్ చేసుకోవాలనుకున్నవారు మొదట డ్రైవ్స్ ని సిద్ధం చేసుకోవాలి. ఉబుంటు కోరకు కనీసం 5జిబి కి తక్కువ కాకుండా హర్డ్ డిస్క్ నందు కాళి స్థలాన్ని ఏర్పరుచుకోవాలి. దీన్ని విండోస్ లో My Computer-Manage-Disk management ద్వారా చేయవచ్చు. డాటా కోల్పోయే అవకాశం ఉంది కనుక ఈ పక్రియ చాలా జాగ్రత్తగా చేయాలి. లేదా డాటా పూర్తిగా బేక్ అప్ తీసుకోవాలి. తరువాత డ్రైవ్స్ ని రినేం చేసుకోవాలి. ఉధా: సిడ్రైవ్ ని విండోస్ అని మిగిలిన డ్రైవ్స్ ని మనకి నచ్చిన పేరుతో గాని రినేం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉబుంటు సీడి / పెన్ డ్రైవ్ ని సీడిడ్రైవ్ / USB Port నందు ఉంచి కంప్యూటర్ని రిస్టార్ట్ చేయాలి. కంప్యూటర్ ఆన్ కాగానె F12 ని నొక్కడం ద్వారా బూట్ డిస్క్ ని ఎంచుకోవచ్చు. లేదా బయోస్ లో కి (కంప్యూటర్ ఆన్ కాగానె F2, Delete, Esc లను నొక్కి) వెళ్ళి బూట్ ప్రాధాన్యతలను మొదట సిడిని / USB ని ఉంచి సేవ్ చేసుకోవాలి. అపుడు కంప్యూటర్ ఉబుంటు ఇన్ స్టాలేషన్ డిస్క్ నుండి బూట్ అవుతుంది.
సాదారణంగా
1GB అంతకన్నా తక్కువ RAM ఉన్నపుడు RAM పరిమాణానికి రెట్టింపు, 2GB అంతకన్నా
ఎక్కువ ఉన్నపుడు 2GB గాను Swap aria పరిమాణాన్ని పెట్టుకోవాలి.
విండోస్
తోపాటు డ్యుయల్ బూట్ గా ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నవారు విండోస్ లో తయారు
చేసుకున్న హార్డ్ డిస్క్ కాళి స్థలాన్ని క్రింధి విధంగా రెండు పార్టిషన్
లను తయారుచేసుకోవాలి.
రీస్టార్ట్
చేసి ఉబుంటు సీడి / పెన్ డ్రైవ్ ని తొలగించినపుడు కంప్యూటర్ హర్డ్ డిస్క్
నుండి బూట్ అయి ఈవిధంగా ఉబుంటు డెస్క్ టాప్ వస్తుంది. ఇన్ స్టాలేషన్
పూర్తయినట్లే.