మన కంప్యుటరుని ప్లానిటోరియంగా మార్చుకోవడానికి స్టేల్లారియం అను ఉచిత ఓపెన్ సోర్స్ అనువర్తనం ఉపయోగపడుతుంది. ప్లానిటోరియంలో వలే మన కంప్యుటరునందే స్టేల్లారియంని ఉపయోగించి ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలను చూడవచ్చు. పిల్లలకి విజ్ఞానాన్ని పెంపొందించడానికి తోడ్పడును. అన్నిరకాల ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. ఇక ఉబుంటు వాడేవారు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి నేరుగా స్తాపించుకోవచ్చు. పూర్తి విశిష్టతలకోసం మరియు డౌన్లోడ్ చేసుకోవడంకోసం స్టేల్లారియం సైటుని దర్శించండి.