మనం అంతర్జాల విహరణం(ఇంటర్ నెట్ బ్రౌజింగ్) చేసినపుడు వెబ్ పేజిలో మనకి కావలసిన విషయం తో పాటు అనేక వ్యాపార ప్రకటనలు(యాడ్స్), పాప్ అప్ లు తెరవబడి మనల్ని విసిగిస్తుంటాయి. అంతేకాకుండా అవి కూడా మన ఇంటర్ నెట్ ని వాడుకోవడం వలన మనకి కావలసిన వెబ్ పేజి నెమ్మదిగా తెరవబడును. ఇంటర్ నెట్ బ్రౌజింగ్ లో ఈ అవాంచిత వ్యాపార ప్రకటనలు(యాడ్స్), పాప్ అప్ లు తొలగించి నట్లయితే మనం మన ఇంటర్ నెట్ బాండ్ విడ్త్ ని మనం పూర్తిగా వాడుకోవచ్చు. ఈ అవాంచిత వ్యాపార ప్రకటనలు(యాడ్స్), పాప్ అప్ లు తొలగించే యాడ్ బ్లాక్ ప్లస్ అను ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ ఉచితంగా పొందవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ మనం వాడే వెబ్ విహారిణి(వెబ్ బ్రౌసర్) కి పొడిగింత(యాడ్ ఆన్) లా ఇన్ స్టాల్ చేసుకొని అవాంచిత వ్యాపార ప్రకటనలు లేకుండా చేసుకోవచ్చు. ఈ యాడ్ ఆన్ ఎలా ఉపయోగించాలో ఈ టపాలో వివరించబడింది. ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న బ్రౌసర్ యాడ్ ఆన్లలో మెట్టమొదటి స్థానం దీనిదే. ఈ సాఫ్ట్ వేర్ ఫైర్ ఫాక్స్, క్రోం, ఒపెరా, ie వంటి వెబ్ బ్రౌసర్లు మరియు ఆండ్రాయిడ్ లోను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇది పనిచేయు విధానాన్ని క్రింది విడియో లో చూడవచ్చు.