వ్యాపార ప్రకటనలు(యాడ్స్)లేని, వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్ కోసం

 మనం ఒక వెబ్ సైట్ ని సందర్శించినపుడు మనకి కావలసిన విషయాలతో పాటుగా చాలారకాల ప్రకటనలు(flash adds,text adds) కనిపిస్తుంటాయి. వీటివలన వాడుకరికి విసుగు తో పాటు ఆ వెబ్ పేజి నెమ్మదిగా లోడ్ కావడం,విలువైన సమయం మరియు బాండ్ విడ్త్ వృధా అవుతాయి. ఈ సమస్యకు చక్కని పరిష్కారం ABP(యాడ్ బ్లాక్ ప్లస్)యాడ్ ఆన్. దీన్ని ఫైర్ ఫాక్స్ మరియు గూగుల్ క్రోం లో ఇక్కడ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇన్ స్టాల్ అయిన తరువాత కావలసిన ఫిల్టర్ ను సబ్ స్రైబ్ చెసుకోవడంద్వారా అవాంచిత  ప్రకటనలు అరికట్టవచ్చును.
ఫిల్టర్ ను సబ్ స్రైబ్ చెసుకోవడం
నేరుగా ప్రకటనలని బ్లాక్ చెయ్యడం
ABP కి ముందు

ABP తరువాత
చూసారుగా యాడ్ బ్లాక్ ప్లస్ వాడిన తరువాత వెబ్ పేజి ఎంత పొందికగా ఉందో,మరి ఆలస్యం ఎందుకు విలువైన మీకాలాన్ని,బాండ్ విడ్త్ ని ఆదాచేసుకోండి.

25GB ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ పొందే అవకాశం!



  కంప్యూటర్, లాప్ టాప్, టాబ్లెట్ మరియు మొబైల్ ఫోన్ వంటి వివిధ గాడ్జెట్ల వినియోగం పెరగడం, తక్కువ ఖరీధులో గాడ్జెట్లు మరియు నెట్ అందుబాటులో ఉండడం, గాడ్జెట్లు కూడా వివిధరకాల ఫైళ్ళను తెరవగలిగే సామర్ధ్యం కలిగి ఉండడం వలన, ఆన్ లైన్ స్టోరేజ్ ద్వారా మన ఫైళ్ళను ఎక్కడ నుండైనా ఏ పరికరంలోనైనా(కంప్యూటర్, లాప్ టాప్, టాబ్లెట్, మొబైల్ ఫోన్, MP3 ప్లేయర్) వాడుకొనే వెసులుబాటు కలిగింది. ఆధరణ పెరుగుతున్నందువలన ఈ మద్య చాలా ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ లు అందుబాటులోకి వచ్చాయి. 
 ఉబుంటు వాడుకరుల సహాయార్ధం 5GB ఆన్ లైన్ స్టోరేజ్ అందిస్తుంది. ఎవరైనా ఇక్కడ రిజిస్టరు చేసుకోవడం ద్వారా  ఆ 5GB ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ ని పొందవచ్చు. ఉబుంటు నుండే కాకుండా విండోస్, మాక్, ios మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టములు గల అన్నిరకాల కంప్యూటర్లు మరియు గాడ్జెట్ల నుండి మన ఫైళ్ళను వాడుకోవచ్చు. అవసరానికి మరింత ఆన్ లైన్ స్టోరేజ్ ని కొనుగోలు చేసుకోవచ్చు.
 ఉచిత 5GB కాకుండా మరో 20GB ఆన్ లైన్ స్టోరేజ్ ని ఉచితంగా పొందే అవకాశాన్ని ఇప్పుడు కల్పించారు. మనం చేయవలసిందల్లా మొదట రిజిస్టరు చేసుకొని లాగిన్ అయివ తరువాత అక్కడ ఇవ్వబడిన రిఫరల్ లింకుని మితృలతో పంచుకోవాలి.మన రిఫరల్ నుండి నమోదు కాబడిన ప్రతి ఖాతాకి 500MB చొప్పున మనకి జత చేస్తారు.ఈవిధంగా మనకి 20GB వరకు పొందే అవకాశాం కలదు. ఈవిధంగా పొందిన ఆన్ లైన్ స్టోరేజ్ మరియు ఉచిత  స్టోరేజ్ మన జీవితకాలం మనకి అందుబాటులో ఉంటాయి. మరెందుకు ఆలస్యం రిజిస్టరు చేసుకొని 25GB ఉచితంగా పొందండి.

నెమ్మదిగా ఉన్న కంప్యూటర్లలో కూడా వేగంగా PDF ఫైళ్ళను తెరవడానికి

 ఎక్కువ పరిమాణం గల PDF ఫైళ్ళను నెమ్మదిగా ఉన్న కంప్యూటర్లలో కూడా వేగంగా తెరవడానికి MuPDF అను చిన్న, వేగవంతమైన, స్వేచ్ఛా సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. దీనిలో అదనపు హంగులు లేకుండా అతి తక్కువ పరిమాణంలో ఉండడం వలన ఇది చాలా వేగంగా పనిచేస్తుంది.దీనిని వాడడానికి తప్పనిసరిగా కీబోర్డ్ షార్ట్ కట్స్ ని ఉపయోగించాలి. ఇది లినక్స్ , విండోస్ , ఆండ్రాయిడ్ మరియు ఐ ఒయస్ లందు పనిచేస్తుంది. 

ఉబుంటు వాడువారు సరికొత్త వెర్షనుని ఇన్ స్టాల్ చేయడానికి క్రింద ఇవ్వబడిన కమాండ్లను రన్ చేయాలి.
sudo add-apt-repository ppa:guilhem-fr/mupdf
sudo apt-get update
sudo apt-get install mupdf
MUPDF

ఫైర్ ఫాక్స్ 15

 ప్రముఖ ఒపెన్ సోర్స్ వెబ్ బ్రౌసర్ అయిన ఫైర్ ఫాక్స్ యొక్క కొత్త వెర్షను ఫైర్ ఫాక్స్ 15 ఈరోజు విడుదల కాబోతుంది. PDF ఫైళ్ళను తెరవడానికి కావలసిన సామర్ధ్యం, మెరుగు పరచబడిన యాడ్ ఆన్ల మెమొరీ వాడకం, అభివృధ్ది పరచబడిన విశిష్టతలతో మరియు సవరించిన దోషాలతో విడుదల కాబోతుంది. దీనిని ఉచితంగా ఫైర్ ఫాక్స్ వెబ్ సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఫైర్ ఫాక్స్ వాడుతున్నవారు అప్ డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఉబుంటు వాడుతున్న వారు తొందరలో ఉబుంటు అప్ డేట్స్ ద్వారా ఫైర్ ఫాక్స్ 15 ని పొందుతారు.

గమనిక: ఫైర్ ఫాక్స్ 15 లో PDF ఫైళ్ళను తెరవడానికి కావలసిన సామర్ధ్యం కల్పించలేదు. పూర్తి సిద్దం కాకపోవడం వలన  చివరి వరకు ఫైర్ ఫాక్స్ 15 బీటాలో ఉన్న ఈ సదుపాయాన్ని ఫైర్ ఫాక్స్ 15 లో అందించలేదు. వచ్చే విడుదలలో PDF ఫైళ్ళను తెరవడానికి కావలసిన సామర్ధ్యం అప్రమేయంగా అందుబాటులోకి రావచ్చు.

ఉచిత తెలుగు సాఫ్ట్వేర్ సీడీ

  సమాచార,సాంకేతిక సంచార మంత్రిత్వ శాఖ భారతప్రభుత్వం వారు భారతీయ భాషలలో సమాచార మార్పిడికి ఉపకరణాలను, మెలకువలను రూపొందించేందుకు భారతీయ భాషల కోసం సాంకేతిక విజ్ఞానాభివృద్ధి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.భాషాపరమైన అడ్డంకులు లేకుండా మనిషి, యంత్రం (కంప్యూటర్) మధ్య పరస్పర సమన్వయాన్ని రూపొందించడం, బహుభాషల విజ్ఞాన వనరులను ఏర్పాటు చేయడం, సృజనాత్మక సమాచార ఉత్పాదనలను, సేవలను రూపొందించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమం ప్రారంభించారు.దీనిలో భాగంగా కార్పోరా, నిఘంటువులు, ఫాంట్లు, టెక్‌స్ట్ ఎడిటర్, పదబంధాల పరిశీలనావ్యవస్థ, ఓసిఆర్, టెక్ట్స్ టూ స్పీచ్ వంటి సమాచార ప్రకియ ఉపకరణాలను రూపొందించేందుకు పథకాలను చేపట్టారు.అంతేకాకుండా భారతీయ భాషలలో బ్రౌజర్లు, సమాచారం కోసం అన్వేషణ జరిపే సెర్చ్ ఇంజన్లు, ఇ.మెయిల్ వంటి ఇంటర్ నెట్ ఉపకరణాలను అందుబాటులో ఉంచారు.అభివృద్ధి చేయబడిన ఈ సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను, సేవలను అందరికీ అందచేయడానికి www.ildc.gov.in మరియుwww.ildc.in అను రెండు వెబ్ సైట్లను ఏర్పాటు చేసింది. వీటిని ఎవరైనా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు కోరితే దీనికి సంబంధిచిన సీ.డీ. కూడా ఉచితంగా పంపుతారు.

తెలుగు సాఫ్ట్వేర్ ఉపకరణాలు సీడీ