కంప్యూటర్, లాప్ టాప్, టాబ్లెట్ మరియు మొబైల్ ఫోన్ వంటి వివిధ గాడ్జెట్ల వినియోగం పెరగడం, తక్కువ ఖరీధులో గాడ్జెట్లు మరియు నెట్ అందుబాటులో ఉండడం, గాడ్జెట్లు కూడా వివిధరకాల ఫైళ్ళను తెరవగలిగే సామర్ధ్యం కలిగి ఉండడం వలన, ఆన్ లైన్ స్టోరేజ్ ద్వారా మన ఫైళ్ళను ఎక్కడ నుండైనా ఏ పరికరంలోనైనా(కంప్యూటర్, లాప్ టాప్, టాబ్లెట్, మొబైల్ ఫోన్, MP3 ప్లేయర్) వాడుకొనే వెసులుబాటు కలిగింది. ఆధరణ పెరుగుతున్నందువలన ఈ మద్య చాలా ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ లు అందుబాటులోకి వచ్చాయి.
ఉబుంటు వాడుకరుల సహాయార్ధం 5GB ఆన్ లైన్ స్టోరేజ్ అందిస్తుంది. ఎవరైనా ఇక్కడ రిజిస్టరు చేసుకోవడం ద్వారా ఆ 5GB ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ ని పొందవచ్చు. ఉబుంటు నుండే కాకుండా విండోస్, మాక్, ios మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టములు గల అన్నిరకాల కంప్యూటర్లు మరియు గాడ్జెట్ల నుండి మన ఫైళ్ళను వాడుకోవచ్చు. అవసరానికి మరింత ఆన్ లైన్ స్టోరేజ్ ని కొనుగోలు చేసుకోవచ్చు.
ఉచిత 5GB కాకుండా మరో 20GB ఆన్ లైన్ స్టోరేజ్ ని ఉచితంగా పొందే అవకాశాన్ని ఇప్పుడు కల్పించారు. మనం చేయవలసిందల్లా మొదట రిజిస్టరు చేసుకొని లాగిన్ అయివ తరువాత అక్కడ ఇవ్వబడిన రిఫరల్ లింకుని మితృలతో పంచుకోవాలి.మన రిఫరల్ నుండి నమోదు కాబడిన ప్రతి ఖాతాకి 500MB చొప్పున మనకి జత చేస్తారు.ఈవిధంగా మనకి 20GB వరకు పొందే అవకాశాం కలదు. ఈవిధంగా పొందిన ఆన్ లైన్ స్టోరేజ్ మరియు ఉచిత స్టోరేజ్ మన జీవితకాలం మనకి అందుబాటులో ఉంటాయి. మరెందుకు ఆలస్యం రిజిస్టరు చేసుకొని 25GB ఉచితంగా పొందండి.