డివిడిలు రిప్, విడియోలు కన్వర్ట్ చేయడానికి

 డివిడిలు రిప్ చేయడానికి, విడియోలు కన్వర్ట్ చేయడానికి హేండ్ బ్రేక్ అనే ఉచిత స్వేచ్చా సాప్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఇది విండోస్,మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టముల పై పనిచేస్తుంది.దీనిని ఉపయోగించి సీడీ, డివిడి మరియు బ్లూరే డిస్కులు రిప్ చేసుకోవచ్చు.అంతేకాకుండా ఐఫోన్, ఆపిల్ టీవి, ఐపాడ్, ఆండ్రాయిడ్ మరియు నోకియా ఫోన్లకు సరిపడు విధంగా వీడియోలను కన్వర్ట్ చేసుకోవచ్చు.



ఉబుంటు వాడువారు క్రింద ఇవ్వబడిన రెండు కమాండ్లను టెర్మినల్ నందు రన్ చెయ్యడం ద్వారా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
sudo add-apt-repository ppa:stebbins/handbrake-releases

sudo apt-get update && sudo apt-get install handbrake-gtk

లేదా ఇక్కడ నుండి మన ఉబుంటు వెర్షనుకి తగిన .deb ఫైల్‌ని డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. విండోస్, మాక్ మరియు ఇతర లినక్స్ ఆపరేటింగ్ సిస్టములు వాడుతున్నవారు ఇక్కడ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లు ఉచితం , ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే!

ఆంధ్రప్రదేశ్ కి మా సాఫ్ట్వేర్లు ఉచితం - మైక్రోసాఫ్ట్

ఆంధ్రప్రదేశ్ దెబ్బకు మైక్రోసాఫ్ట్ దాసోహం

ఆంధ్రప్రదేశ్ సేవలను గుర్తించిన మైక్రోసాఫ్ట్

ఆంధ్రప్రదేశ్ సేవలకు మైక్రోసాఫ్ట్ ప్రతిఫలం

ఆంధ్రప్రదేశ్ ని ఆధర్శంగా తీసుకోవాలని ప్రపంచ దేశలకు మైక్రోసాఫ్ట్ హితవు

ఆంధ్రప్రదేశ్ ని బంగారు భాగస్వామి అవార్డుతో సత్కరించిన మైక్రోసాఫ్ట్

పైరేటెడ్ సాఫ్ట్వేర్ కి ఆంధ్రప్రదేశ్ సెలవు




 హైదరాబాద్, రెడ్ మండ్, రేపటి వార్త : ఆంధ్రప్రదేశ్ యొక్క సేవలను గుర్తించిన ప్రముఖ సాఫ్ట్వేర్ ధిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటి నుండి తన సంస్థ తయారు చేసే సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ కి ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించినది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ని బంగారు భాగస్వామి అవార్డుతో సత్కరించినది. ఈ సంధర్బాన్ని పురశ్కరించుకొని నిన్న జరిగిన సమావేశంలో మైక్రోసాఫ్ట్ సంస్థ నేత ఈ విషయాన్ని ప్రకటించారు. చిత్త సుద్దితో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఉత్పత్తులను వాడినందుకు మరియు ప్రచారం కల్పించడంలోను రాష్త్రం యొక్క చొరవను పలువురు వక్తలు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ని ఆధర్శంగా తీసుకోవాలని ప్రపంచ దేశలకు మైక్రోసాఫ్ట్ హితవు పలికింది. మన తరుపున పలానా మాట్లాడుతు చిన్నప్పటి నుండి ప్రజలు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్లు వాడే విధంగా పాఠశాల స్థాయి నుండి ఏవిధంగా ఏర్పాట్లు చేసారో వివరించారు.



కలలా ఉన్నా మన కృషికి ఇదే సరయిన ఫలితం. తొందరలో జరుగుతుందని ఒక చిన్న ఆశ.



ఉబుంటు లో తెలుగు

 ఉబుంటు కూడా చాలా స్వేచ్చా సాప్ట్ వేర్ ల మాదిరిగానే తెలుగు మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర స్థానిక భాషలకు కూడా మద్దతునిస్తుంది.ఉబుంటు లో తెలుగు చూడవచ్చు,వ్రాయనువచ్చు మరియు ఉబుంటు ను తెలుగు లో వాడుకోవచ్చు.

తెలుగు చూడడానికి:

 చాలా వెబ్ సైట్లు,యునికోడ్ లో ఉన్న వెబ్ సైట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు.కొన్ని వార్త పత్రికలు సొంత ఫాంట్లను వాడుతుంటాయి.వాడుకరి సహాయార్ధం వారు ఫాంట్లను డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటు లో ఉంచుతారు.ఆ ఫాంట్ ని డౌన్ లోడ్ చేసుకొని దానిని తెరచినపుడు క్రింది విధంగా కనిపించును.
ఉబుంటు లో ఫాంట్ ఇన్ స్టాల్ చేయడానికి ఉదాహరణ
ఇన్ స్టాల్ ఫాంట్ ని నొక్కినపుడు ఫాంట్ మన కంప్యుటర్ నందు ఇన్ స్టాల్ అవుతుంది.అపుడు ఫైర్ ఫాక్స్ ని తిరిగి ప్రారంభించినపుడు ఆయా సైట్ వెబ్ పేజీలు మనకు సరిగా కనిపించును.

తెలుగు లో వాడుకోవడానికి:

 మొదట తెలుగు భాషకు మద్దతు ని ఇన్ స్టాల్ చేసుకోవాలి.ఉబుంటు లాంచర్ నందుగల  System Settings ని తెరచి Language Support లోనికి వెళ్లి తెలుగు భాషకు మద్దతు ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

మొదటిసారి Language Support ని తెరచినపుడు క్రిందివిధంగా అడుగుతుంది.

 ఇన్ స్టాల్ ని నొక్కిన తరువాత పాస్ వర్డ్ అడుగును.పాస్ వర్డ్ ని ఇవ్వగానే డౌన్ లోడ్ చేసుకొని,ఇన్ స్టాల్ చేసుకొని క్రింది విండో తెరవబడును.
 Install/Remove Languages ని నొక్కినపుడు మరొక విండో తెరవబడును.అక్కడ తెలుగు ని ఎంచుకొని Apply Changes ని నొక్కినపుడు తెలుగు భాషకు మద్దతు మన కంప్యుటర్ లో స్థాపించబడును.

ఉబుంటు ఆపరేటింగ్ సిస్టంని  తెలుగులో కూడా వాడుకోవచ్చు.పైన చూపించిన విధంగా తెలుగు భాషకు మద్దతు ని ఇన్ స్టాల్ చేసుకోన్న తరువాత Language Support లోనికి వెళ్లి అక్కడ చూపించబడిన భాషలలో తెలుగును లాగి (డ్రాగ్ చేసి) ప్రాధాన్యత క్రమం లో మొదట ఉంచవలెను.
 ఆ తరువాత సిస్టం ని లాగ్ అవుట్ చేసి మరలా లాగిన్ కావాలి.అప్పుడు క్రింది చిత్రాలలో చూపించినట్లు మెనూ మరియు డాష్ లో తెలుగు కనిపించును.
తెలుగులో మేనూలు
తెలుగులో డాష్
 ఉబుంటు ని తెలుగులో ఉపయేగిస్తున్నపుడు అక్కడక్కడా ఇంగ్లీష్ లో కనిపించును.ఇంకనూ వాటి అనువాదాలు పుర్తికాకపోవడం వలన ఈవిధంగా కనిపించును.ఈ అనువాద పక్రియలో మీరు కూడా పాలుపంచుకోవచ్చు.ఇక్కడ  మనం ఇప్పటికే అనువాదాలు చేస్తున్న ఒత్సాహికులను చూడవచ్చు,మనం కూడా వీరితో చేరి అనువాదాలు చేయవచ్చు.

తెలుగు వ్రాయడానికి: 

 System Settings లో ఉన్న Keyboard ని తెరిచి Layout Settings లోకి వెళ్ళాలి.  
 + ని నొక్కడం ద్వారా మరొక విండో తెరవబడును.అక్కడ పెట్టెలో తెలుగు అని టైప్ చేసినపుడు పైన పెట్టెలో తెలుగు కనిపించును.Add ని నొక్కినపుడు ప్యానల్ లో కీబోర్డ్ గుర్తుని చూపించును.అక్కడ నుండి మనం ప్రతిసారి కీబోర్డ్ లేఅవుట్ ని మార్చుకోవచ్చు.ప్యానల్ లో కీబోర్డ్ గుర్తుని నొక్కి తెలుగు ను ఎంచుకొని తెలుగు లో టైప్ చేసుకోవచ్చు.
తెలుగు కీబోర్డ్ లేఅవుట్
ఉబుంటు లో తెలుగు టైప్ చేయడానికి కావలసిన మరింత సమాచారాన్ని ఇక్కడ చూడండి.

తెలుగు వీర లేవరా..

 ఏ దేశమేగినా,ఎందు కాలిడినా మన తెలుగువారు లేని ప్రదేశము లేదంటే అతిశయోక్తి కాదేమో.జీవన అవకాశాల కోసం వివిధ దేశాలకు వెళ్ళి,వెళ్ళిన చోట తమ కష్టించే తత్వం మరియు ప్రతిభా పాటవాలతో అనతి కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో తెలుగు వారికి సాటి లేదు.ఈరోజుల్లో ప్రపంచంలో ప్రసిధ్ధి చెందిన ఏ ప్రాజెక్టును తీసుకున్నా వాటిలో తెలుగు వారి పాత్ర లేని ప్రాజెక్టు మనకు కనిపించదు.అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా మన వారు ఎన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించినారు.మన వారు తయారు చేసిన సాఫ్ట్వేర్లు,వారి సేవలు లేని దేశాలు బహుషా లేకపోవచ్చు.ఇన్ని విశిష్టతలు గల మనం స్వేచ్చా సాఫ్ట్వేర్ల వినియోగం మరియు వాటి అభివృధ్ధిలో గణనీయంగా వెనకబడి ఉన్నాం అని చెప్పడంలో సంధేహం లేదు.ఎందుకో మనలో స్వేచ్చా,ఉచిత సాఫ్ట్వేర్లంటే కొంత చిన్న చూపు ఉందని అనిపిస్తుంది.సమాజం కొరకు సమాజమే సాఫ్ట్వేర్లు తయారు చేసుకొని తిరిగిసమాజమే వాటిని ఉచితంగా వాడుకోవడం వలన ప్రజల,ప్రభుత్వాల సొమ్ము ఎంత ఆదా అవుతుంది.ఒక్క కేరళ లోనే కేవలం పాఠశాలల విషయం లోనే స్వేచ్చా,ఉచిత సాఫ్ట్వేర్లు వాడడం వలన కొన్ని కోట్ల విలువైన ప్రజాధనం ఆదా అయితే ఇక పూర్తి భారతదేశం విషయానికి వస్తే మరెంత ఆదా అవుతుంది.కేవలం అవగాహన లేకపోవడం వలన చాలా మంది వ్యక్తిగత ధనం కూడా వృధా చేసుకుంటున్నారు. నిధానంగా సాగుతున్న  స్వేచ్చా,ఉచిత సాఫ్ట్వేర్ల అభివృద్ధి తెలుగువారి ప్రవేశంతో వేగవంతమవుతుందని నా బలమైన నమ్మకం.కనుక తెలుగు సాఫ్ట్వేర్ వీరులారా సొంత లాభం కొంత మానుకోకుండా కొంత సమయం మాత్రమే కేటాయించి సరికొత్త సాఫ్ట్వేర్ విప్లవంలో మీరుకూడా పాలుపంచుకోండి.

ఇది మన సంగతి

 మన రాష్ట్రంలో ప్రభుత్వం కంప్యూటర్ విధ్యను వాణిజ్య సాఫ్ట్వేర్లతో అందిస్తుంది. ఒక కంప్యూటర్‌ను కొనటానికయ్యే ఖర్చుతో సమాంతరంగా సాఫ్ట్వేర్ కొనటానికి కూడా ఖర్చు కావడం వలన ప్రభుత్వ వ్యయంలో సగానికి సగం కేవలం సాఫ్ట్వేర్ కొనటానికి ఖర్చవుతున్నది. ఇలా సాఫ్ట్వేర్ల కోసం కోట్ల విలువైన ప్రజాధనం వృధా అవుతుంది. వీటి నిర్వహణను కొందరు గుత్తేదారులకు అప్పగించి వారికి డబ్బును చెల్లిస్తున్నది. అక్కడ టీచర్లుగా పని చేస్తున్న వారికి జీత బత్యాలు సైతం సరిగా ఇవ్వట్లేదు, ఇస్తున్నవి కూడా మరీ తక్కువగా ఉన్నాయి. అందువలన వారు తరచుగా సమ్మె చేయడం కూడా జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా వాణిజ్య సాఫ్ట్వేర్ల స్థానంలో స్వేచ్ఛా సాఫ్ట్వేర్లను ఉపయోగించి విలువైన ప్రజాధనం వృధా కాకుండా చేయవచ్చు. సాఫ్ట్వేర్ల కొరకు ఖర్చు చేస్తున్న  కోట్లాది రూపాయిల వ్యయాన్ని ఉపాధి కల్పనకు కంప్యుటర్ టీచర్ల జీత భత్యాలకొరకు ఖర్చు చేస్తే బాగుంటుంది. ఈ పద్దతిని అభివృద్ది చెందిన దేశాలైన జర్మనీ,ఫ్రాన్సు, అభివృద్ది చెందుతున్న దేశాలయిన బ్రెజిల్, వెనిజూలా, చైనా వంటి దేశాలే అమలు చేస్తున్నాపుడు, నిత్యం నిధుల కొరతతో సతమవుతున్న మన దేశ,రాష్ట్రా ప్రభుత్వాలు  ఎందుకు అమలు జరపలేక పోతున్నాయన్నదే సందేహం.