సయనోజెన్‌మోడ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సయనోజెన్‌మోడ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఈ స్మార్ట్‌ఫోన్ ధర కొంచెం, ఫీచర్లు ఘనం

వేగంగా వృద్ది చెందుతున్న, ఇంకా వృద్ది చెందడానికి అవకాశం ఉన్న భారత స్మార్ట్‌ఫోన్ విపణి ఇప్పుడు అన్ని కంపెనీలకు ప్రధాన లక్ష్యంగా మారింది. చిన్న, మధ్యతరగతి తయారీదారులే కాకుండా దిగ్గజసంస్థలు కూడా మన దేశవిపణి పై ఆశక్తి చూపిస్తూ వారి ఉత్పత్తులతో ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందించే స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి, భవిష్యత్తులో

సయనోజెన్‌మోడ్ ఇన్‌స్టాలర్‌ గూగుల్ ప్లేస్టోర్ నుండి తొలగించబడింది

 ప్రముఖ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ యొక్క ఒపెన్‌సోర్స్ రామ్‌ అయిన సయనోజెన్‌మోడ్ ఈ మధ్యే సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అనువుగా ఇన్‌స్టాలర్‌ని విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే అనుకున్నట్టుగానే గూగులోడు ప్లేస్టోర్ నుండి సయనోజెన్‌మోడ్ ఇన్‌స్టాలర్‌ని నిబంధనలను అతిక్రమించినందుకు అంటూ తొలగించాడు. సైనోజెన్‌మోడ్ ఎంతగా ప్రాచూర్యం పొందుతుందో ఇక్కడ ఇవ్వబడిన గణాంకాలను చూస్తే తెలుస్తుంది. ఇకనుండి ఎవరైన సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాలర్ ని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి .apk ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. .apk ఫైల్‌ని ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఇక్కడ చూడవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో సైనోజెన్‌మోడ్ ని ఇన్‌స్టాల్ చేయడం

 మొన్న విడుదలైన సైనోజెన్‌మోడ్ ఇన్‌స్టాలర్ తో సైనోజెన్‌మోడ్ కస్టమ్‌ రామ్‌ ని ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడం చాలా సులభమైపోయింది. మనం ఎలా అయితే ఒక సాఫ్ట్‌వేర్ ని మన కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసుకుంటామో అంత సులభంగా మన ఫోనులో కూడా సైనోజెన్‌మోడ్ ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సైనోజెన్‌మోడ్ కస్టమ్‌ రామ్‌ ని ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కావలసినవి, ముందుగా తీసుకోవలసిన జాగ్రత్తల కోసం ఇక్కడ చూడండి. అంతా సిద్దంగా ఉంటే కనీసం 20 నిమిషాలలో అయిపోతుంది. మన నెట్ వేగాన్ని బట్టి సమయం పడుతుంది. 
 మొదట సైనోజెన్‌మోడ్ ఇన్‌స్టాలర్ ఆప్ ని ఇక్కడ నుండి దింపుకుని మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
https://play.google.com/store/apps/details?id=org.cyanogenmod.oneclick
  సైనోజెన్‌మోడ్ ఇన్‌స్టాలర్ ఆప్ ని ఫోన్‌లో తెరిచి అది చెప్పినట్లు చేసుకుంటూ పోవడమే. ఎలా అన్నది క్రింది చితాలలో చూడండి.






సైనోజెన్‌మోడ్ సైటు నుండి విండోస్ ఇన్‌స్టాలర్ ని డౌన్‌లోడ్ చేసుకొని కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి

ఫోన్‌ని యుయస్‌బి కేబుల్ తో కంప్యూటర్‌కి అనుసంధానించాలి


యాంటీ వైరస్ ని డిసేబుల్ చెయ్యాలి








వాల్యూం కీ లను పైకి క్రిందకి వెళ్ళడానికి పవర్ కీని సెలెక్ట్ చేసుకోవడానికి వాడాలి





Exit ని నొక్కి ఫోన్‌ని కంప్యూటర్ నుండి వేరుచేయాలి





సైనోజెన్‌మోడ్ చక్రం రెండు నిమిషాలు తిరుగుతు ఆపరేటింగ్ సిస్టం ఇన్‌స్టాల్ చేయబడుతుంది

ఇక ఫోన్ మనం వాడుకోవడానికి తయారయినట్లే





సైనోజెన్‌మోడ్ హోం స్క్రీన్



 సైనోజెన్‌మోడ్ ని ఇన్‌స్టాల్ ఎలా చెయ్యాలి అని ఈ హెచ్‌డి వీడియోలో చూడండి.

సులభంగా ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్లలో సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

 సైనోజెన్ మోడ్ అనేది ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ కోడ్ తో తయారుచేయబడిన ఒక కస్టం రామ్‌. గూగులోడి ఆండ్రాయిడ్ లో లేని ఫీచర్లని అందించడమేకాకుండా ఫోన్ తయారీదారులు ఇవ్వని అప్‌డేట్స్ ని కూడా పొందడానికి సైనోజెన్ మోడ్ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు సైనోజన్ మోడ్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే కొంత పరిజ్ఞానం ఉండవలసి వచ్చేది. కాని ఇప్పుడు ఎవరైనా తమ ఫోన్‌లలో సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అనువుగా తయారుచేసారు. ఈ మధ్యే కంపెనీ గా అవతారం ఎత్తిన సైనోజెన్ మోడ్ డెవలపర్ల సమూహం తొదరగానే తమ ప్రణాళికలను ఆచరణలో పెట్టింది. ఇప్పుడు కొన్ని ఫోన్‌లకే మద్దతునిస్తున్న సైనోజెన్ మూడ్ ఇన్‌స్టాలర్ తొదరలోనే మరిన్ని ఫోన్‌లకి అందుబాటులోకి తేవాలని కొంత కాలానికి సుమారు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లకి అందుబాటులోకి తేవాలని తమ లక్ష్యంగా పెట్టుకున్నారు.
 సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాలర్ ఆప్‌ని ఇక్కడ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సైనోజెన్ మోడ్ ని మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి లింకులో ఉన్న సపోర్టెడ్ డివైస్ లో మన డివైస్ తప్పని సరిగా ఉండాలి. ఫోన్ రూట్ చేసిఉన్నా లేకున్నా బూట్ లోడర్ అన్‌లాక్ చేయకున్నా ఇప్పటికే వేరే కస్టం రామ్‌ వాడుతున్నప్పటికి పర్వాలేదు మనం మన ఫోన్‌లో సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాలర్ ని ప్రయత్నించవచ్చు. ఇంటర్ నెట్ కలిగిఉన్న విస్టా, విండోస్7 లేదా 8 ఇన్‌స్టాల్ చేయబడిన కంప్యూటర్ ఉండాలి. యాంటి వైరస్ తప్పని సరిగా డిసేబుల్ చేసి ఉండాలి. ఫోన్ తో వచ్చిన డాటా కేబుల్ ఉంటే మంచిది. యూయస్ బి హబ్ వంటివి కాకుండా డాటా కేబుల్ తో నేరుగా ఫోన్ని కంప్యూటరుకి అనుసంధానించాలి. ఇన్‌స్టాలేషన్ లో మన ఫోను ఫ్యాక్టరీ రిసెట్ చేయబడుతుంది కనుక డాటా బేకప్ తీసుకుని సైనోజెన్ మూడ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో డాటా బేకప్ ఎలా తీయాలో ఇక్కడ చూడవచ్చు. ఫోన్ పూర్తిగా చార్జి అయి ఉండాలి. ఇక సైనోజెన్ మోడ్ విండోస్ ఇన్‌స్టాలర్ ని ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 ఆండ్రాయిడ్ ఫోన్‌లో సైనోజెన్ మోడ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తరువాతి టపాలో వివరంగా చూద్దాం.

సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాలర్

సంస్థగా మారిన అత్యుత్తమ ఆండ్రాయిడ్ రామ్

 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా తయారుచేయబడి, ఆండ్రాయిడ్ని మించిన ఫీచర్లని అందిస్తు నెంబర్ వన్ ఆండ్రాయిడ్ రామ్ గా పేరు తెచ్చుకొన్న సైనోజెన్ మొడ్ ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం ఇప్పడు ఒక కంపెనీగా కొత్త అవతారం ఎత్తింది. దానికి సంబంధించిన ప్రకటన సైనోజెన్ మొడ్ వారి బ్లాగులో చూడవచ్చు. ఇప్పటి వరకు వివిధ కంపెనీల డివైస్ లకు అనధికార ఆపరేటింగ్ సిస్టంలు తయారు చేస్తూవచ్చిన సైనోజెన్ మొడ్ ఇప్పుడు తను కూడా సొంతంగా మొబైళ్ళు, టాబ్లెట్లు విడుదల చేయబోతుంది. సైనోజెన్ మొడ్ ఆపరేటింగ్ సిస్టం మిగిలిన రామ్ లతో పోల్చుకుంటే చాలా పరికరాల్లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
 ఈ సంధర్బంగా అన్ని మొబైళ్ళు, టాబ్లెట్లలో పనిచేచే విధంగా తయారుచేయడం, ఫోన్ లో అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకున్నంత సులువుగా సైనోజెన్ మొడ్ ని ఇన్ స్టాల్ చేయగలగడం తమ లక్ష్యాలు గా పేర్కొన్నారు. తొందరలోనే సైనోజెన్ మొడ్ ఇన్ స్టాలర్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. సైనోజెన్ మొడ్ ఇన్ స్టాలర్ యొక్క చిత్రాలు క్రింద చూడవచ్చు.



అత్యుత్తమ ఆండ్రాయిడ్ రామ్ ఉచితంగా

  
 తయారీదారు మనం కొన్న తరువాత ఆపరేటింగ్ సిస్టం కి సంబంధించిన అప్ డేట్ కొన్ని రోజుల పాటు మాత్రమే విడుదల చేస్తుంటారు. తయారీదారు అప్ డేట్ నిలిపివేసిన తరువాత ఆండ్రాయిడ్ లో వచ్చిన తాజా వెర్షన్ వాడాలనుకొంటే మనం తప్పకుండా ఇలా తయారు చేయబడిన ఆండ్రాయిడ్ రామ్ ల పై ఆధారపడ వలసిందే. ఎన్నో ఆండ్రాయిడ్ రామ్ లు మనకి దొరుకుతున్నప్పటికి వాటిలో నమ్మకమైనది ఎక్కువ గా వాడబడుతున్న ఆండ్రాయిడ్ రామ్ సైనోజెన్ మోడ్.
 గూగుల్ చే తయారుచేయబడిన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ప్రపంచంలో ఎక్కువ పరికరాల్లో ఇన్ స్టాల్ చేయబడిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టం గా అనతికాలం లోనే రికార్డు సృష్టించింది. వాడుకరి అందుబాటులో అనేక అప్లికేషన్లు, సులభంగా ఇష్టం వచ్చినట్లు మార్చుకోగల గుణం, వెల విషయానికొస్తే అందరికి అందుబాటులో వివిధ శ్రేణుల్లో ఆండ్రాయిడ్ పరికరాలు లభించడం వలన ఆండ్రాయిడ్ ప్రపంచంలోనే ఎక్కువగా వాడబడుతుంది. అందువలన ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు వివిధ రకాల ఆండ్రాయిడ్ రామ్ లను తయారు చేస్తున్నారు. కనీస పరిజ్ఞానం ఉన్నవారు కూడా ఆండ్రాయిడ్ పరికరాల్లో కంప్యూటర్లలో ఎలా అయితే ఆపరేటింగ్ సిస్టం ఇన్ స్టాల్ చేసుకొంటామో అదే విధంగా ఈ ఆండ్రాయిడ్ రామ్ లను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
 సైనోజెన్ మోడ్ అనేది ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ ని ఉపయోగించుకొని తయారుచేయబడిన ఆండ్రాయిడ్ రామ్. ఇది కూడా ఉచితంగా లభించే ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. దీని ముఖ్యోధ్దేశం తయారీదారు అందించిన దానికన్నా అత్యుత్తమ పనితీరు, విశ్వసనీయత  అందించడమే. అంతేకాకుండా  తయారీదారు యొక్క ఆపరేటింగ్ సిస్టం లో లేనటువంటి అధనపు విశిష్టతలను మరియు మనకి నచ్చినట్లు ఎన్నో విధాలుగా అనుకూలీకరించుకునే అవకాశాన్ని మనకిస్తుంది. ఎక్కువ పరికరాలకి మధ్దతు నివ్వడం, అధికారిక ఆండ్రాయిడ్ విడుదలను అనుసరించి వెంటవెంటనే విడుదల చేయడం దీని ప్రత్యేకత.
  సైనోజెన్ మోడ్ మనకి నాలుగు రకాలు గా లభిస్తున్నప్పటికి రోజువారి వాడకం కోసం ఉద్దేశించిన స్టెబుల్ వెర్షన్ని వాడడం ఉత్తమం. సైనోజెన్ మోడ్ పనిచేసే పరికరాల చిట్టా ఇక్కడ చూడవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ లేదా టాబ్లెట్ కి కావలసిన సైనోజెన్ మోడ్ అధికారిక చిట్టాలో లేకపోతే అనధికార చిట్టాని ఇక్కడ చూడండి. డౌన్లోడ్ పేజి నందే ఇన్ స్టాల్ చేయు విధానము వివరించు లంకె ఉంటుంది.
సైనోజెన్ మోడ్ 10 హోమ్