ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా తయారుచేయబడి, ఆండ్రాయిడ్ని మించిన ఫీచర్లని అందిస్తు నెంబర్ వన్ ఆండ్రాయిడ్ రామ్ గా పేరు తెచ్చుకొన్న సైనోజెన్ మొడ్ ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం ఇప్పడు ఒక కంపెనీగా కొత్త అవతారం ఎత్తింది. దానికి సంబంధించిన ప్రకటన సైనోజెన్ మొడ్ వారి బ్లాగులో చూడవచ్చు. ఇప్పటి వరకు వివిధ కంపెనీల డివైస్ లకు అనధికార ఆపరేటింగ్ సిస్టంలు తయారు చేస్తూవచ్చిన సైనోజెన్ మొడ్ ఇప్పుడు తను కూడా సొంతంగా మొబైళ్ళు, టాబ్లెట్లు విడుదల చేయబోతుంది. సైనోజెన్ మొడ్ ఆపరేటింగ్ సిస్టం మిగిలిన రామ్ లతో పోల్చుకుంటే చాలా పరికరాల్లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
ఈ సంధర్బంగా అన్ని మొబైళ్ళు, టాబ్లెట్లలో పనిచేచే విధంగా తయారుచేయడం, ఫోన్ లో అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకున్నంత సులువుగా సైనోజెన్ మొడ్ ని ఇన్ స్టాల్ చేయగలగడం తమ లక్ష్యాలు గా పేర్కొన్నారు. తొందరలోనే సైనోజెన్ మొడ్ ఇన్ స్టాలర్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. సైనోజెన్ మొడ్ ఇన్ స్టాలర్ యొక్క చిత్రాలు క్రింద చూడవచ్చు.