అత్యుత్తమ ఆండ్రాయిడ్ రామ్ ఉచితంగా

  
 తయారీదారు మనం కొన్న తరువాత ఆపరేటింగ్ సిస్టం కి సంబంధించిన అప్ డేట్ కొన్ని రోజుల పాటు మాత్రమే విడుదల చేస్తుంటారు. తయారీదారు అప్ డేట్ నిలిపివేసిన తరువాత ఆండ్రాయిడ్ లో వచ్చిన తాజా వెర్షన్ వాడాలనుకొంటే మనం తప్పకుండా ఇలా తయారు చేయబడిన ఆండ్రాయిడ్ రామ్ ల పై ఆధారపడ వలసిందే. ఎన్నో ఆండ్రాయిడ్ రామ్ లు మనకి దొరుకుతున్నప్పటికి వాటిలో నమ్మకమైనది ఎక్కువ గా వాడబడుతున్న ఆండ్రాయిడ్ రామ్ సైనోజెన్ మోడ్.
 గూగుల్ చే తయారుచేయబడిన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ప్రపంచంలో ఎక్కువ పరికరాల్లో ఇన్ స్టాల్ చేయబడిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టం గా అనతికాలం లోనే రికార్డు సృష్టించింది. వాడుకరి అందుబాటులో అనేక అప్లికేషన్లు, సులభంగా ఇష్టం వచ్చినట్లు మార్చుకోగల గుణం, వెల విషయానికొస్తే అందరికి అందుబాటులో వివిధ శ్రేణుల్లో ఆండ్రాయిడ్ పరికరాలు లభించడం వలన ఆండ్రాయిడ్ ప్రపంచంలోనే ఎక్కువగా వాడబడుతుంది. అందువలన ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు వివిధ రకాల ఆండ్రాయిడ్ రామ్ లను తయారు చేస్తున్నారు. కనీస పరిజ్ఞానం ఉన్నవారు కూడా ఆండ్రాయిడ్ పరికరాల్లో కంప్యూటర్లలో ఎలా అయితే ఆపరేటింగ్ సిస్టం ఇన్ స్టాల్ చేసుకొంటామో అదే విధంగా ఈ ఆండ్రాయిడ్ రామ్ లను ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
 సైనోజెన్ మోడ్ అనేది ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ ని ఉపయోగించుకొని తయారుచేయబడిన ఆండ్రాయిడ్ రామ్. ఇది కూడా ఉచితంగా లభించే ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. దీని ముఖ్యోధ్దేశం తయారీదారు అందించిన దానికన్నా అత్యుత్తమ పనితీరు, విశ్వసనీయత  అందించడమే. అంతేకాకుండా  తయారీదారు యొక్క ఆపరేటింగ్ సిస్టం లో లేనటువంటి అధనపు విశిష్టతలను మరియు మనకి నచ్చినట్లు ఎన్నో విధాలుగా అనుకూలీకరించుకునే అవకాశాన్ని మనకిస్తుంది. ఎక్కువ పరికరాలకి మధ్దతు నివ్వడం, అధికారిక ఆండ్రాయిడ్ విడుదలను అనుసరించి వెంటవెంటనే విడుదల చేయడం దీని ప్రత్యేకత.
  సైనోజెన్ మోడ్ మనకి నాలుగు రకాలు గా లభిస్తున్నప్పటికి రోజువారి వాడకం కోసం ఉద్దేశించిన స్టెబుల్ వెర్షన్ని వాడడం ఉత్తమం. సైనోజెన్ మోడ్ పనిచేసే పరికరాల చిట్టా ఇక్కడ చూడవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ లేదా టాబ్లెట్ కి కావలసిన సైనోజెన్ మోడ్ అధికారిక చిట్టాలో లేకపోతే అనధికార చిట్టాని ఇక్కడ చూడండి. డౌన్లోడ్ పేజి నందే ఇన్ స్టాల్ చేయు విధానము వివరించు లంకె ఉంటుంది.
సైనోజెన్ మోడ్ 10 హోమ్