సులభంగా ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్లలో సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

 సైనోజెన్ మోడ్ అనేది ఆండ్రాయిడ్ ఒపెన్ సోర్స్ కోడ్ తో తయారుచేయబడిన ఒక కస్టం రామ్‌. గూగులోడి ఆండ్రాయిడ్ లో లేని ఫీచర్లని అందించడమేకాకుండా ఫోన్ తయారీదారులు ఇవ్వని అప్‌డేట్స్ ని కూడా పొందడానికి సైనోజెన్ మోడ్ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు సైనోజన్ మోడ్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే కొంత పరిజ్ఞానం ఉండవలసి వచ్చేది. కాని ఇప్పుడు ఎవరైనా తమ ఫోన్‌లలో సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి అనువుగా తయారుచేసారు. ఈ మధ్యే కంపెనీ గా అవతారం ఎత్తిన సైనోజెన్ మోడ్ డెవలపర్ల సమూహం తొదరగానే తమ ప్రణాళికలను ఆచరణలో పెట్టింది. ఇప్పుడు కొన్ని ఫోన్‌లకే మద్దతునిస్తున్న సైనోజెన్ మూడ్ ఇన్‌స్టాలర్ తొదరలోనే మరిన్ని ఫోన్‌లకి అందుబాటులోకి తేవాలని కొంత కాలానికి సుమారు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లకి అందుబాటులోకి తేవాలని తమ లక్ష్యంగా పెట్టుకున్నారు.
 సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాలర్ ఆప్‌ని ఇక్కడ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సైనోజెన్ మోడ్ ని మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడానికి లింకులో ఉన్న సపోర్టెడ్ డివైస్ లో మన డివైస్ తప్పని సరిగా ఉండాలి. ఫోన్ రూట్ చేసిఉన్నా లేకున్నా బూట్ లోడర్ అన్‌లాక్ చేయకున్నా ఇప్పటికే వేరే కస్టం రామ్‌ వాడుతున్నప్పటికి పర్వాలేదు మనం మన ఫోన్‌లో సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాలర్ ని ప్రయత్నించవచ్చు. ఇంటర్ నెట్ కలిగిఉన్న విస్టా, విండోస్7 లేదా 8 ఇన్‌స్టాల్ చేయబడిన కంప్యూటర్ ఉండాలి. యాంటి వైరస్ తప్పని సరిగా డిసేబుల్ చేసి ఉండాలి. ఫోన్ తో వచ్చిన డాటా కేబుల్ ఉంటే మంచిది. యూయస్ బి హబ్ వంటివి కాకుండా డాటా కేబుల్ తో నేరుగా ఫోన్ని కంప్యూటరుకి అనుసంధానించాలి. ఇన్‌స్టాలేషన్ లో మన ఫోను ఫ్యాక్టరీ రిసెట్ చేయబడుతుంది కనుక డాటా బేకప్ తీసుకుని సైనోజెన్ మూడ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో డాటా బేకప్ ఎలా తీయాలో ఇక్కడ చూడవచ్చు. ఫోన్ పూర్తిగా చార్జి అయి ఉండాలి. ఇక సైనోజెన్ మోడ్ విండోస్ ఇన్‌స్టాలర్ ని ఇక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 ఆండ్రాయిడ్ ఫోన్‌లో సైనోజెన్ మోడ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తరువాతి టపాలో వివరంగా చూద్దాం.

సైనోజెన్ మోడ్ ఇన్‌స్టాలర్