ఫైర్ ఫాక్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఫైర్ ఫాక్స్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఫేస్ బుక్ వీడియోలు డౌన్లోడ్ చేయడం ఎలా?

 ఫేస్ బుక్ లో రకరకాల వీడియోలు చూస్తుంటాము. వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి సదుపాయం ఉండదు. ఇక్కడ వివరించినట్లు మనకు నచ్చిన వీడియోలను చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోని మనకిష్టం వచ్చినపుడు  చూసుకోవచ్చు. ఫ్లాష్ వీడియో డౌన్లోడర్ అను ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఉపయోగించి ఫేస్ బుక్ వీడియోలే కాకుండా యు ట్యూబ్ మరియు వివిధ వీడియో మరియు ఫ్లాష్ గేమింగ్ సైట్ల నుండి వీడియోలను, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాడ్ ఆన్ ని క్రింది లంకె నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.


యాడ్ ఆన్ ఇన్ స్టాల్ చేసిన తరువాత యుఆర్ యల్ బార్ ప్రక్కన బాణం గుర్తు కనిపిస్తుంది.  ఫ్లాష్ వీడియోలు గల వెబ్ పేజీ లోనికి వెళ్ళినపుడు బాణం గుర్తు నీలం రంగు లోకి మారుతుంది. అప్పుడు దాన్ని నొక్కి వీడియో డౌన్లోడ్ ని ప్రారంభించవచ్చు.

స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల వెలుగులు

 మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో ప్రదర్శించిన స్వేచ్ఛా సాఫ్ట్వేర్లకి ఆమోఘమైన ప్రతిస్పందన లభించింది. డెస్క్ టాప్ రంగంలో పోటీని ఇవ్వనప్పటికి, సాఫ్ట్ వేర్ దిగ్గజాలే తయారీదారులు దొరక్క చతికిలపడిన ఈరంగంలో ఎటువంటి లాభాపేక్షా లేని స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల సంస్థలు అన్ని వర్గాల నుండి సానుకూలతను, మన్ననలను అందుకోవడం నిజంగా అద్బుతమే. 
 ఇక్కడ మొదట చెప్పుకోవలసింది ఖచ్చితంగా ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం గురించే. మొదట్లో అంతగా ఆకర్షించనప్పటికి రానురాను తయారీదారులను,మొబైల్ ఆపరేటర్ల ఆదరణను బాగానే సంపాదించుకోగలిగింది. లినక్స్ పై HTML5 తో మొజ్జిల్లా వారు నిర్మించిన ఈ స్వేచ్ఛా మొబైల్ ఆపరేటింగ్ సిస్టం తక్కువ సామర్ధ్యం గల ఫోన్లలో కూడా సమర్దవంతంగా పనిచేయగలదు. ఇప్పటికే ఆల్కాటెల్ మరియు ZTE ఫోన్లని ప్రదర్శించగా హువాయ్, యల్ జి మరియు సోనిలు కూడా విడుదలచేయడానికి ముందుకు వచ్చాయి.
 తరువాత చెప్పుకోవలసింది ప్రతిష్టాత్మకమైన టైజెన్. లినక్స్ ఫౌండేషన్ సారధ్యంలో సాంసంగ్, ఇంటెల్, పానాసోనిక్ మరియు హువాయ్ వంటి తయారీదారుల, డొకోమో,ఆరెంజ్ మరియు స్ప్రింట్ వంటి మొబైల్ ఆపరేటర్ దిగ్గజాల కలయికతో ఏర్పడిన టైజెన్ ఒక్క మొబైల్ ఫోన్ కే కాకుండా టాబ్లెట్, నెట్ బుక్, టీవీ మరియు వాహనాల సమాచారాన్ని,వినోదాన్ని అందించే పరికరాలలో పనిచేసే విదంగా రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఆండ్రాయిడ్ ని అధిగమించగల సత్తా ఉన్నదని దీని వెనుక గల సంస్థలని బట్టే చెప్పవచ్చు.
 ప్రపంచంలో ఎక్కువగా వాడే ఆపరేటింగ్ సిస్టం లలో మూడవది, స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో మొదటిది అయిన ఉబుంటు తయారీదారులచే ప్రకటించబడిన ఉబుంటు టచ్ (ఫోన్లు,టాబ్లెట్ల కోసం ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం) కూడా మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో అత్యధిక ఆదరణ పొందినది. తెరపై ఎటువంటి మీటలు లేకుండా తెర అంచులనే వాడుకోగల ఈ ఆపరేటింగ్ సిస్టం ఉత్తమ ఆవిష్కరణగా కూడా గుర్తింపు పొందినది.
 ఇక ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఆండ్రాయిడ్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది.

చేతు(త)ల్లో స్వేచ్ఛా సాఫ్ట్వేర్

 తొందరలో రాబోతున్న స్వేచ్ఛా మొబైల్ ఆపరేటింగ్ సిస్టంల నమూనా ఫోన్లని క్రింది వీడియోలలో చూడవచ్చు.
ఫైర్ ఫాక్స్

ఉబుంటు


టైజెన్

CNET మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 ఉత్తమం గా ఎంపికైన


 ఈరోజు ముగిసిన మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో CNET వారి ఉత్తమ ఎంపికగా ఉబుంటు టచ్ ఎన్నికయినట్లు ప్రకటించారు. తయారీదారుల, మొబైల్ ఆపరేటర్ల ఆదరణ పొందిన ఫైర్ ఫాక్స్ చివరి వరకు పోటీలో నిలిచి రెండో స్థానంలో నిలిచినది.
ఉబుంటు టచ్ గురించిన CNET విశ్లేషణ క్రింది వీడియోలో చూడవచ్చు.

మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో ప్రదర్శించబడిన మొట్టమొదటి ఫైర్ ఫాక్స్ ఫోన్లు

 బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో మొట్టమొదటి ఫైర్ ఫాక్స్ ఫోన్లని ప్రదర్శించారు. HTML5 తో శక్తివంతమై, స్వేచ్ఛా సాఫ్ట్వేర్ అయిన ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం తో నడిచే ఆల్కాటెల్ వన్ టచ్ ఫైర్ మరియు ZTE ఒపెన్ అను రెండు ఫోన్లని ప్రదర్శించారు. ఆల్కాటెల్, ZTE తోపాటు హువాయ్ మరియు LGలు రానున్న వేసవిలో ప్రపంచవ్యాప్తంగా ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం తో నడిచే ఫోన్లని విడుదల చేయబోతున్నాయి.
 ఫోన్లని మరియు ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం యొక్క విశిష్టతలను వివరించే వీడియోని ఇక్కడ చూడవచ్చు.

ఫైర్ ఫాక్స్ 19 విడుదలైంది

 ప్రముఖ ఒపెన్ సోర్స్ వెబ్ బ్రౌసర్ అయిన ఫైర్ ఫాక్స్ యొక్క కొత్త వెర్షను ఫైర్ ఫాక్స్ 19 విడుదలైంది. PDF ఫైళ్ళను తెరవడానికి కావలసిన సామర్ధ్యం, మెరుగు పరచబడిన యాడ్ ఆన్ల మెమొరీ వాడకం, అభివృధ్ది పరచబడిన విశిష్టతలతో మరియు సవరించిన దోషాలతో విడుదల కాబోతుంది. దీనిని ఉచితంగా ఫైర్ ఫాక్స్ వెబ్ సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఫైర్ ఫాక్స్ వాడుతున్నవారు అప్ డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఉబుంటు వాడుతున్న వారు ఉబుంటు అప్ డేట్స్ ద్వారా ఫైర్ ఫాక్స్ 19 ని పొందుతారు.

వ్యాపార ప్రకటనలు(యాడ్స్)లేని, వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్ కోసం

 మనం ఒక వెబ్ సైట్ ని సందర్శించినపుడు మనకి కావలసిన విషయాలతో పాటుగా చాలారకాల ప్రకటనలు(flash adds,text adds) కనిపిస్తుంటాయి. వీటివలన వాడుకరికి విసుగు తో పాటు ఆ వెబ్ పేజి నెమ్మదిగా లోడ్ కావడం,విలువైన సమయం మరియు బాండ్ విడ్త్ వృధా అవుతాయి. ఈ సమస్యకు చక్కని పరిష్కారం ABP(యాడ్ బ్లాక్ ప్లస్)యాడ్ ఆన్. దీన్ని ఫైర్ ఫాక్స్ మరియు గూగుల్ క్రోం లో ఇక్కడ నుండి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇన్ స్టాల్ అయిన తరువాత కావలసిన ఫిల్టర్ ను సబ్ స్రైబ్ చెసుకోవడంద్వారా అవాంచిత  ప్రకటనలు అరికట్టవచ్చును.
ఫిల్టర్ ను సబ్ స్రైబ్ చెసుకోవడం
నేరుగా ప్రకటనలని బ్లాక్ చెయ్యడం
ABP కి ముందు

ABP తరువాత
చూసారుగా యాడ్ బ్లాక్ ప్లస్ వాడిన తరువాత వెబ్ పేజి ఎంత పొందికగా ఉందో,మరి ఆలస్యం ఎందుకు విలువైన మీకాలాన్ని,బాండ్ విడ్త్ ని ఆదాచేసుకోండి.

ఫైర్ ఫాక్స్ 15

 ప్రముఖ ఒపెన్ సోర్స్ వెబ్ బ్రౌసర్ అయిన ఫైర్ ఫాక్స్ యొక్క కొత్త వెర్షను ఫైర్ ఫాక్స్ 15 ఈరోజు విడుదల కాబోతుంది. PDF ఫైళ్ళను తెరవడానికి కావలసిన సామర్ధ్యం, మెరుగు పరచబడిన యాడ్ ఆన్ల మెమొరీ వాడకం, అభివృధ్ది పరచబడిన విశిష్టతలతో మరియు సవరించిన దోషాలతో విడుదల కాబోతుంది. దీనిని ఉచితంగా ఫైర్ ఫాక్స్ వెబ్ సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఫైర్ ఫాక్స్ వాడుతున్నవారు అప్ డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఉబుంటు వాడుతున్న వారు తొందరలో ఉబుంటు అప్ డేట్స్ ద్వారా ఫైర్ ఫాక్స్ 15 ని పొందుతారు.

గమనిక: ఫైర్ ఫాక్స్ 15 లో PDF ఫైళ్ళను తెరవడానికి కావలసిన సామర్ధ్యం కల్పించలేదు. పూర్తి సిద్దం కాకపోవడం వలన  చివరి వరకు ఫైర్ ఫాక్స్ 15 బీటాలో ఉన్న ఈ సదుపాయాన్ని ఫైర్ ఫాక్స్ 15 లో అందించలేదు. వచ్చే విడుదలలో PDF ఫైళ్ళను తెరవడానికి కావలసిన సామర్ధ్యం అప్రమేయంగా అందుబాటులోకి రావచ్చు.

తెలుగు చదవలేక పోతున్నారా?

 తెలుగు మరియు ఇతర భారతీయ భాషలకి సంభందించిన వెబ్ సైట్లు అర్ధంకాని అక్షరాలతో గజిబిజిగా కనిపించినపుడు మనం చాలా సులభంగా ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చు.పద్మ అను ఫైర్ ఫాక్స్ యాడ్ అన్ ని మనం ఇన్ స్టాల్ చేసుకొని అటువంటి సైట్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు.ఈ యాడ్ అన్ వాణిజ్య ఫాంట్లలో ఉన్న భారతీయ భాషల అక్షరాలను యునికోడ్ రూపంలోకి మార్చి మనకి చూపించును.ఈ యాడ్ అన్ తెలుగు ,తమిళం ,మలయాళం, దేవనాగరి,గుజరాతి ,బెంగాలి మరియు గుర్మికి లిపులకు మద్దతునిచ్చును.దీనిని తెలుగువాడయిన నాగార్జున వెన్న తయారుచేయడం విశేషం.

పద్మ ఫైర్ ఫాక్స్ యాడ్ అన్

ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం

 మరో ఒపెన్ సోర్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం రాబోతుంది.ప్రముఖ ఒపెన్ సోర్స్ వెబ్ బ్రౌసర్ అయిన ఫైర్ ఫాక్స్ ని తయారుచేసిన సంస్థ దీనిని రూపొందిస్తుంది.లాభాపేక్ష లేని సంస్థ అయిన మొజిల్లా ఫౌండేషన్ వారు వచ్చే సంవత్సర ఆరంభానికి  ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పేరుతో అందుబాటులోకి తేనున్నారు.మొజిల్లా ఫౌండేషన్ వారి బూట్ టు గికో ప్రాజెక్ట్ దీనికి ఆధారం.ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పూర్తిగా ఒపెన్ సోర్స్ విధానంలో లినక్స్ కర్నేల్ పై,పూర్తిగా HTML5 తో దిగువ శ్రేణి స్మార్ట్ ఫోనులలో కూడా సమర్ధవంతంగా పనిచేసేవిధంగా నిర్మించబడుతుంది.ఇప్పటికే రెండు మొబైల్ తయారి సంస్థలతో,ఏడు సర్వీస్ ప్రొవైడర్ సంస్థలతో ఒప్పందం జరిగింది.




మరిన్ని వివరాలకు మొజిల్లా బ్లాగును చూడండి.

భారతీయ భాషలు వ్రాయడానికి

 భారతీయ భాషలు వ్రాయడానికి Indic Input Extension అను ఫైర్ ఫాక్స్ యాడ్ అన్ ఉపయోగపడుతుంది.దీనిని ఉపయోగించి భారతీయ భాషలను ఇన్ స్క్రిప్ట్ మరియు ఫోనిటిక్ పద్దతులలో వ్రాయవచ్చు.దీనిని తెలుగు వాడయిన ప్రసాద్ సుంకరి గారు తయారు చేయడం విశేషం.దీనిని ఇక్కడ నుండి మీ ఫైర్ ఫాక్స్ కి జత చేయవచ్చు.యాడ్ అన్ బార్ లో ఉన్న ఇండిక్ ఇన్ పుట్ మెనూ నుండి ఇన్ పుట్ విధానమును ఎంచుకోవచ్చు.

యుట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలనుకొంటున్నారా?

యుట్యూబ్ లో వీడియోలు చూసేవారు నచ్చిన వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడానికి వేరే సైట్లో వీడియో తాలుకు URL ని ఇవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకొంటారు. ఫైర్ ఫాక్స్ వాడేవారు సులభంగా యుట్యూబ్ వీడియో పేజి నుండే మనకు నచ్చిన ఫార్మాట్లో వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం చేయవలసిందల్లా Easy YouTube Video Downloader

ఫైర్ ఫాక్స్ లో త్రీడి ఎఫెక్ట్స్

ఫైర్ ఫాక్స్ లో టాబ్స్ మధ్య సులభం విహరించడానికి ,ఆకర్షణీయమైన త్రీ-డి ఎఫెక్ట్స్ కోసం ఫాక్స్ టాబ్ యాడ్-ఆన్ ఇక్కడ నుండి స్థాపించండి.త్రీ-డి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో క్రింది చిత్రాలలో చూడవచ్చు.