టైజెన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
టైజెన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల వెలుగులు

 మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో ప్రదర్శించిన స్వేచ్ఛా సాఫ్ట్వేర్లకి ఆమోఘమైన ప్రతిస్పందన లభించింది. డెస్క్ టాప్ రంగంలో పోటీని ఇవ్వనప్పటికి, సాఫ్ట్ వేర్ దిగ్గజాలే తయారీదారులు దొరక్క చతికిలపడిన ఈరంగంలో ఎటువంటి లాభాపేక్షా లేని స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల సంస్థలు అన్ని వర్గాల నుండి సానుకూలతను, మన్ననలను అందుకోవడం నిజంగా అద్బుతమే. 
 ఇక్కడ మొదట చెప్పుకోవలసింది ఖచ్చితంగా ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం గురించే. మొదట్లో అంతగా ఆకర్షించనప్పటికి రానురాను తయారీదారులను,మొబైల్ ఆపరేటర్ల ఆదరణను బాగానే సంపాదించుకోగలిగింది. లినక్స్ పై HTML5 తో మొజ్జిల్లా వారు నిర్మించిన ఈ స్వేచ్ఛా మొబైల్ ఆపరేటింగ్ సిస్టం తక్కువ సామర్ధ్యం గల ఫోన్లలో కూడా సమర్దవంతంగా పనిచేయగలదు. ఇప్పటికే ఆల్కాటెల్ మరియు ZTE ఫోన్లని ప్రదర్శించగా హువాయ్, యల్ జి మరియు సోనిలు కూడా విడుదలచేయడానికి ముందుకు వచ్చాయి.
 తరువాత చెప్పుకోవలసింది ప్రతిష్టాత్మకమైన టైజెన్. లినక్స్ ఫౌండేషన్ సారధ్యంలో సాంసంగ్, ఇంటెల్, పానాసోనిక్ మరియు హువాయ్ వంటి తయారీదారుల, డొకోమో,ఆరెంజ్ మరియు స్ప్రింట్ వంటి మొబైల్ ఆపరేటర్ దిగ్గజాల కలయికతో ఏర్పడిన టైజెన్ ఒక్క మొబైల్ ఫోన్ కే కాకుండా టాబ్లెట్, నెట్ బుక్, టీవీ మరియు వాహనాల సమాచారాన్ని,వినోదాన్ని అందించే పరికరాలలో పనిచేసే విదంగా రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఆండ్రాయిడ్ ని అధిగమించగల సత్తా ఉన్నదని దీని వెనుక గల సంస్థలని బట్టే చెప్పవచ్చు.
 ప్రపంచంలో ఎక్కువగా వాడే ఆపరేటింగ్ సిస్టం లలో మూడవది, స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో మొదటిది అయిన ఉబుంటు తయారీదారులచే ప్రకటించబడిన ఉబుంటు టచ్ (ఫోన్లు,టాబ్లెట్ల కోసం ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం) కూడా మొబైల్ వరల్డ్ కాంగ్రేస్ 2013 లో అత్యధిక ఆదరణ పొందినది. తెరపై ఎటువంటి మీటలు లేకుండా తెర అంచులనే వాడుకోగల ఈ ఆపరేటింగ్ సిస్టం ఉత్తమ ఆవిష్కరణగా కూడా గుర్తింపు పొందినది.
 ఇక ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఆండ్రాయిడ్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది.

చేతు(త)ల్లో స్వేచ్ఛా సాఫ్ట్వేర్

 తొందరలో రాబోతున్న స్వేచ్ఛా మొబైల్ ఆపరేటింగ్ సిస్టంల నమూనా ఫోన్లని క్రింది వీడియోలలో చూడవచ్చు.
ఫైర్ ఫాక్స్

ఉబుంటు


టైజెన్

టైజెన్ 2 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం విడుదలైనది

 ఇంటెల్ ,సాంసంగ్ ,డొకోమో వంటి దిగ్గజ కంపెనీల ఆరధ్యంలో లినక్స్ ఫౌండేషన్ వారు అభివృధ్ది చేస్తున్న టైజెన్ 2 మొబైల్ ఆపరేటింగ్ సిస్టం యొక్క సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ మరియు సోర్స్ కోడ్ విడుదలైనది.దానికి సంబందించిన విడుదల పాఠాన్ని ఇక్కడ చూడవచ్చు.సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ ని(విండోస్,ఉబుంటు మరియు మాక్ ఆపరేటింగ్ సిస్టం ల కొరకు) ఇక్కడ నుండి పొందవచ్చు. టైజెన్ 2 మొబైల్ ఆపరేటింగ్ సిస్టంని క్రింది చిత్రాలలోచూడవచ్చు.








ఆండ్రాయిడ్ సోదరుడు వస్తున్నాడు

 మొబైల్ ఫోన్ రంగంలో ఆండ్రాయిడ్ ఫోన్ సృష్టించిన సంచలనం అందరికి తెలిసిందే.ఆండ్రాయిడ్ ని గూగుల్ సంస్థ లినక్స్ కర్నెలు పై ఓపెన్ సోర్స్ విధానంలో రూపొందించినది.ఆనతికాలం లోనే జన ప్రాచుర్యం పొంది ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టములలో అగ్రగామిగా నిలిచింది.ఆండ్రాయిడ్ ఇచ్చిన స్పూర్తితో లినక్స్ ఫౌండేషన్ వారి ఆరధ్యంలో ఇంటెల్ , సామ్ సంగ్ వంటి పెద్ద కంపెనీల సహకారంతో  ఓపెన్ సోర్స్ విధానంలో మరో కొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టము ప్రారంభమైనది.దాని పేరు టిజెన్. దీనిని ఒక్క మొబైల్ ఫోన్ల కోసమే కాకుండా టాబ్లెట్లు,నెట్ బుక్,స్మార్ట్ టివి,వాహనాలలో సమాచారాన్ని,వినోదాన్ని అందించే పరికరాలలో పనిచేసే విధంగా రూపొందిస్తున్నారు.ఈమద్యనే మొదటి సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ ని(ఉబుంటు,యక్స్ పి మరియు 7 కొరకు) విడుదలచేసారు.మరిన్ని వివరాలకు టిజెన్ సైటును చూడండి.