తెలుగు మరియు ఇతర భారతీయ భాషలకి సంభందించిన వెబ్ సైట్లు అర్ధంకాని అక్షరాలతో గజిబిజిగా కనిపించినపుడు మనం చాలా సులభంగా ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చు.పద్మ అను ఫైర్ ఫాక్స్ యాడ్ అన్ ని మనం ఇన్ స్టాల్ చేసుకొని అటువంటి సైట్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు.ఈ యాడ్ అన్ వాణిజ్య ఫాంట్లలో ఉన్న భారతీయ భాషల అక్షరాలను యునికోడ్ రూపంలోకి మార్చి మనకి చూపించును.ఈ యాడ్ అన్ తెలుగు ,తమిళం ,మలయాళం, దేవనాగరి,గుజరాతి ,బెంగాలి మరియు గుర్మికి లిపులకు మద్దతునిచ్చును.దీనిని తెలుగువాడయిన నాగార్జున వెన్న తయారుచేయడం విశేషం.
పద్మ ఫైర్ ఫాక్స్ యాడ్ అన్