ఉపయోగపడే వెబ్ సైట్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఉపయోగపడే వెబ్ సైట్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ప్రోటీన్ల సమాచార బాండాగారం (ప్రోటీన్ డాటా బ్యాంక్)

 ప్రోటీన్ల సమాచార బాండాగారం (ప్రోటీన్ డాటా బ్యాంక్) లేదా www.pdb.org అనేది వివిధ రకాల ప్రోటీన్లు, ఎంజైములు,డిఎన్ఎ, ఆర్ ఎన్ ఎ మరియు సంక్లిష్ట అణు నిర్మాణాలను గురించి, వాటి నిర్మాణం మరియు వాటి అమరికల గూర్చి వివరించే సమాచారాన్ని కలిగి ఉన్న ఆన్ లైన్ నిధి. ఇక్కడ విద్యార్ధులకి, ఉపాధ్యాయులకి మరియు పరిశోధకులకి ఉపయోగపడే విలువైన సమాచారం పొందుపరచబడిఉంది. విశ్వవ్యాప్త శాస్త్రజ్ఞుల మరియు పరిశోధకులచే ఏర్పరచబడిన ప్రపంచంలో అతి పెద్ద ప్రోటీన్ల సమాచార బాండాగారం అయిన ప్రోటీన్ డాటా బ్యాంక్ నందు ఇప్పటివరకు 93624 అణువుల నిర్మాణాలు చేర్చబడ్డాయి. మనకి కావలసిన అణువులను సులభంగా వెతకడానికి అనువుగా అమర్చారు. అణువులలో పరమాణువుల వరసలను, వాటి అమరికని, ముడుతలని 3D గా చూడవచ్చు, వాటిని విశ్లేషించవచ్చు మరియు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రోటీన్ డాటా బ్యాంక్ నుండి డౌన్లోడ్ చేసుకోన్న .pdb ఫైళ్ళను బయో బ్లెండర్ అను ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ ని ఉపయోగించి విశ్లేషించవచ్చు, మార్చవచ్చు. ఇక్కడ ఉన్న సమాచారం ఉపాధ్యాయులు, విద్యార్ధులకి ఆసక్తి కలిగే విధంగా బోధించడానికి కూడా ఉపయోగపడుతుంది.
మానవ హిమోగ్లోబిన్

ఉచిత విద్యా వనరులు

 భారత ప్రభుత్వ మానవవనరుల మంత్రిత్వశాఖ వారు జాతియ ఉచిత విద్యా వనరుల భాండాగారాన్ని ఏర్పాటు చేసారు. నిర్మాణంలో ఉన్న ఈ డిజిటల్ భాండాగారం యొక్క ముఖ్య ఉధ్దేశము పాఠశాల విద్యార్థులు మరియు  ఉపాధ్యాయులు   కోసం అన్ని తరగతులు వారికి అన్ని విషయాలను బోధించడానికి అనువైన వనరులని ఉచితంగా ఒకేచోట అందరికి అందుబాటులో తీసుకురావడం. వీడియో, ఆడియో వంటి వివిధ డిజిటల్ రూపాల్లో ఉన్న పాఠ్యాంశాలను ఒక్క దగ్గరకి చేర్చి వెతకడానికి సులభంగా అమర్చి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతారు. అందుకు వివిధ సబ్జెక్టులలో నిపుణుల మరియు ఉపాధ్యాయుల సహకారం కోరుతున్నారు. ఆసక్తి గలవారు వివరాలకు ఇక్కడ చూడండి.

జాతియ ఉచిత విద్యా వనరుల భాండాగారం

అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తున్న

 తెలుగుని కంప్యూటర్లో చూడవచ్చు, వ్రాయవచ్చని, తెలుగులో జాలాన్ని అన్వేషించవచ్చునని అందరికి తెలియజేయడానికి, రోజువారీ సంభాషణలని తెలుగులో జరుపుకోవడాన్ని ప్రోత్సహించడానికి, తెలుగులో అందుబాటులో ఉన్న అంతర్జాల సేవలను అందరికి తెలియజేయడానికి, సాఫ్ట్వేర్ల తెలుగీకరణని ప్రోత్సహించడానికి ఏర్పడిన సంస్థ e-తెలుగు. తెలుగువారందరూ తమ అవసరాలకి కంప్యూటర్లనూ, మెబైళ్ళనూ, అంతర్జాలాన్నీ తెలుగులో వాడుకోగలగాలనే స్వప్నంతో ఆ దిశగా కృషిచేస్తున్న లాభాపేక్షలేని సంస్థ e-తెలుగు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద నమోదయిన ఈ సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైటు www.etelugu.org
  అంతర్జాలంలో బ్లాగులు, గుంపులు వంటి వివిధ వేదికల ద్వారా తెలుగు బ్లాగరులు నిత్యమూ కలుసుకుంటూండేవారు. ముఖాముఖి కూడా కలిస్తే బాగుంటుందని ఆలోచించి 2006 మార్చి 12 న మొదటి సారి హైదరాబాదులో సమావేశమయ్యారు. అప్పటినుండి, ప్రతీనెలా రెండవ ఆదివారం నాడు హైదరాబాదు తెలుగు బ్లాగరులు, వికీపీడియనులు సమావేశమౌతూ వస్తున్నారు. ఈ సమావేశాలలో తెలుగు బ్లాగుల గురించిన సాధకబాధకాల గురించీ వికీపీడియా పురోగతి గురించీ చర్చించేవారు. తెలుగువారికి వీటిని గురించి తెలియజెయ్యడానికి ఏమేం చెయ్యాలి అన్న విషయాల గురించి కూడా చర్చిస్తూ ఉండేవారు. ముందుగా అతి తక్కువ శ్రమతో కంప్యూటరులో తెలుగు కనిపించేలా చేసుకోవచ్చనీ, ఇంగ్లీషులోలానే తెలుగులోనూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవచ్చనీ, తెలుగువారికి తెలియజెయ్యాల్సిన అవసరం ఉందని గ్రహించారు. ఈ అంశాలను ప్రచారం చేసి, మరింతమంది ఔత్సాహికులను చేర్చుకొంటే, మరిన్ని పనులను, మరింత త్వరగా చేయగలమని భావించారు.  ఈ కార్యక్రమాలన్నిటినీ ఒక గొడుగు కిందకు చేర్చి, ఒక లాభాపేక్ష లేని సంస్థ ఆధ్వర్యంలో చేస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చని భావించి e-తెలుగుని ఏర్పాటుచేసారు.
 e-తెలుగు కంప్యూటరులో తెలుగును స్థాపించుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి అవసరమైన సాంకేతిక సహాయం అందిస్తుంది. ఇందుకవసరమైన సాఫ్టువేరు ఉపకరణాలను కూడా తయారుచేసి ఉచితంగా అందిస్తుంది. తెలుగులో టైపు చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. లిప్యంతరీకరణకు అవసరమైఅన ఉపకరణాల గురించి ప్రచారం చేస్తుంది. ఇప్పటికే వివిధ కీబోర్డు లేఔట్లను వాడి తెలుగులో టైపు చేస్తున్నవారికి అవే లేఔట్లను వాడి యూనికోడులో కూడా టైపు చేసేందుకు అవసరమైన సాఫ్టువేరు ఉపకరణాలను తయారుచేసి, ఉచితంగా అందుబాటులో ఉంచింది. ఈ విషయమై ప్రచారమూ చేస్తోంది. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై చేసే కృషిలో భాగంగా బ్లాగులను, వికీపీడియాను, వెబ్ పత్రికలను, ఇతర తెలుగు వెబ్‌సైట్లను తెలుగువారికి పరిచయం చేస్తోంది. వివిధ సాఫ్టువేరు ఉపకరణాల స్థానికీకరణ గురించి తెలియని వారికి తెలియజేస్తూ, తెలిసిన వారికి వాటికి సంబంధించిన విషయాలలో సాంకేతిక సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తోంది.

ఇక్కడ ఉచిత సాఫ్ట్వేర్లు దొరుకుతాయి

 ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం వాడే వారికి ఉపయోగపడే అప్లికేషనులు అన్ని ఒకే చోట లభించు చోటు ఉబుంటు ఆప్ డైరెక్టరీ. దీనిని ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ కి వెబ్ ప్రతిరూపంగా చెప్పుకోవచ్చు. ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ లో మాదిరిగానే ఇక్కడ కూడా అప్లికేషన్ లు విభాగాల వారిగా కొలువుదీరి ఉన్నాయి. అప్లికేషన్ యొక్క విశిష్టతలు వాడిన వారి అభిప్రాయాలను ఇక్కడ చూడవచ్చు.

ఉచిత సాఫ్ట్వేర్ల కర్మాగారం



 సోర్స్ ఫోర్జ్.నెట్ ఎన్నో విజయవంతమైన ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ల తయారీకి నెలవు. సమాజం సహకారంతో అభివృద్ధి చేయబడు ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్లకి కావలసిన అన్ని వనరులు అందించడంలో సోర్స్ ఫోర్జ్.నెట్ దే అగ్రస్తానం. సోర్స్ ఫోర్జ్.నెట్ యొక్క సాధనాలని వాడుకొని ఇప్పటికే 3.4 మిలియన్ డెవలపర్లు 324,000 పైగా ప్రాజెక్టులని వృధ్ది చేసారు. ప్రతి రోజు4,000,000 డౌన్లోడ్లతో ఎంతో మందికి సేవలు అందిస్తున్నది సోర్స్ ఫోర్జ్.నెట్.
 సాఫ్ట్వేర్ల పాధమిక దశ అయిన కోడింగ్ నుండి మొదలుకొని అభివ్రుధ్ది చేయడం, ఆ సాఫ్ట్వేర్లని ప్రచూరించేవరకు అన్నిటికి సోర్స్ ఫోర్జ్.నెట్ సమాధానం చెబుతుంది. ఇక్కడ దొరకని ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎవరైనా తమకు కావలసివ సాఫ్ట్వేర్లు ఇక్కడ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

16 తెలుగు డిక్షనరీలు ఉచితంగా

 ఏదైనా తెలుగు లేదా అంగ్ల పదానికి అర్ధం కావలసినపుడు మనం నిఘంటువు పై ఆధారపడుతుంటాము.దీనికి కొంత సమయం తీసుకుంటుంది.అయితే మనకి కావలసినపుడే చిటికెలో మనకి కావలసిన పదానికి అర్ధం మనముందుంచితె?అదీ ఒకటి కాదు 16 నిఘంటువులను వెతికి మన ముందుఉంచితే?చాల బాగుంటుంది కదు!
 మరెందుకు ఆలస్యం తానా వారి అంధ్ర భారతి తెలుగు నిఘంటువుని చూడండి.ఇక్కడ ఉన్న శోధనలో మనం తెలుగు లేదా అంగ్ల పదాన్ని ఇచ్చినపుడు వెంటనే 16 నిఘంటువులను వెతికి క్షణాల్లో అర్ధాలను మన ముందుంచును.శోధనలో మనం నేరుగా తెలుగులో (ఫోనెటిక్)కూడా టైప్ చేయవచ్చు.మనం అక్షరాలను టైప్ చేస్తుండగానే గూగుల్ మాదిరిగా దానికి సంభందించిన పదాలను చూపిస్తుంది.
 తొందరలో మరిన్ని నిఘంటువులను జతచేయ బోతున్నారు.ఈ పక్రియని వేగవంతం చేయడానికి మన మద్దతు కోరుతున్నారు.రండి మన తెలుగు వారికీ ఎంతో ఉపయోగపడే ఈ తెలుగు నిఘంటువుకి తోడ్పాటునిద్దాం.

తప్పక చూడవలసిన భారత ప్రగతి ద్వారం

 భారత ప్రగతి ద్వారం(India Development Gateway) అనే ఈ వెబ్ పోర్టల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సమాచార, సాంకేతిక పరిజ్ఞాన శాఖ, భారత ప్రభుత్వం వారి సహకారంతో ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్, హైదరాబాద్) వారు దీనిని అభివృద్ధి చేస్తున్నారు.భారత ప్రగతి ద్వారం అనే పధకం ద్వారా దేశ  వ్యాప్తంగా గ్రామీణ, సామాజిక అభివృద్ధికి దోహదంచేసే విధంగా బహుళ భాషా వెబ్ పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ  వెబ్ పోర్టల్ లో  వ్యవసాయం, ప్రాధమిక విద్య, ఆరోగ్యం, ఇ-పాలన, ఇంధన వనరుల రంగాలకు సంబంధించిన సమాచారాన్ని గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

భారత ప్రగతి ద్వారం  అని పిలువబడే ఈ వెబ్ పోర్టల్ నిజ జీవితంలో అందరికీ అవసరమయ్యే , నమ్మకమైన సమాచార ఉత్పత్తులను, సేవలను గ్రామీణ భారతానికి వారి వారి స్థానిక భాషల్లో అందజేస్తుంది.  ఇంటర్నెట్ వాడకం, ఇతర సమాచార పరిజ్ఞాన ఉపకరణాల వాడకం, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ప్రజలు వారి జీవనోపాధులను  మెరుగుపరుచుకోవడానికి  ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తుంది. 

ప్రస్తుతానికి భారత ప్రగతి ద్వారం  కొన్ని ముఖ్యమైన అంశాలు - అంటే ఆరోగ్యం(నీరు, పారిశుధ్యంతో సహా), ప్రాథమిక విద్య, వ్యవసాయం, గ్రామీణ శక్తి వనరులు, పరిసరాలు, ఇంకా ఇ-పాలన వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. ఈ వెబ్ పోర్టల్  వల్ల గ్రామీణ ప్రజలకూ, ప్రభుత్వానికీ, తదితర సంస్థలకు, ఇంకా విద్యా సంస్థలకు మధ్య ఉండే అంతరాన్ని బాగా తగ్గించవచ్చు అనేది భారత ప్రగతి ద్వారం భావన. గ్రామీణాభివృద్ధిని సాధించడానికి ప్రజలు, సంస్థలు,  అనుభవజ్ఞులు  నలుమూలల నుంచి పరస్పర సహకారంతో అందరూ పాల్గొని పూర్తి ప్రజాస్వామిక, ప్రజామిత్ర సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపోందించడమే భారత ప్రగతి ద్వారం అంతిమ లక్ష్యం.

భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్), మార్చి 1988 లో శాస్త్ర, సాంకేతిక సంస్థగా ఏర్పడినది. సి-డాక్ ఒక పరిశోధన మరియు అభివృద్ది సంస్థ. ఇది ఎలక్ట్రానిక్స్, ప్రగతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు పరమ్ వంటి సూపర్ కంప్యూటర్లకు సంబంధించిన వివిధ ఉత్పత్తులు, పరిష్కారాలను రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం మరియు వాటిని ఉపయోగంలోకి తీసుకు రావడం చేస్తుంది. సి-డాక్ హైదరాబాద్ ఇ-సెక్యూరిటీ, ఇ-లెర్నింగ్, సప్లై చెయిన్ మేనేఙ్ మెంట్, ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ , వి.యల్.యస్.ఐ మరియు సిస్టమ్స్ డిఙైన్ వంటి వాటి పైన పరిశోధనలు చేస్తుంది.


రైతులకోసం e-వ్యవసాయం

 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతిఫలాలను రైతులకు కూడా అందించే సదుద్దేశంతో అంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు రైతుల కోసం ఒక వెబ్ సైటుని రూపొందించారు.ఎపిఅగ్రిస్ నెట్ అనే ఈ సైటులో రైతులకు ఉపయోగపడే భూసార పరిక్షల  వివరాలు,పంటల సాగులో మెళుకువలు,పంటలకు వాడవలసిన ఎరువులు,రైతుల అనుభవాలు,ఎరువుల ధరలు వంటి అనేక విషయాలను తెలుగులో అందుబాటులో ఉంచారు.

లినక్స్ లో గేమింగ్

 విండోస్ తో పోల్చితే లినక్స్ లో గేమింగ్ లో చాల వెనకబడి ఉందన్నది వాస్తవం.ఈ పరిస్థితి తొందరలోనే మారబోతుంది అన్న దానికి సంకేతంగా ప్రముఖ కంప్యూటర్ ఆటల తయారీదారులు అయిన ఇ.ఎ.స్పోర్ట్స్ మరియు వాల్వ్ సంస్థలు లినక్స్ ఆపరేటింగ్ సిస్టముల కి కూడా ఆటల తయారీని ప్రారంభించినట్లు ప్రకటించారు.
 మీరు కంప్యూటర్ ఆటల ప్రియులా అయితే ఉబుంటు మరియు ఇతర లినక్స్ ఆపరేటింగ్ సిస్టము పై ఆడదగిన ఆటల గురించిన విశేషాలను మరియు ఉబుంటుకి సంబందించిన విశేషాలను అందించే ఈ వెబ్ సైటు మీకు తప్పక ఉపయోగపడుతుంది.
                                               
                                                   ఉబుంటు వైబ్స్ 

సులభంగా చూసి నేర్చుకోవచ్చు

 వాణిజ్య సాఫ్ట్వేర్లకు దీటయిన ఎన్నో స్వేచ్చా సాఫ్ట్వేర్లు ఈనాడు మనకి అందుబాటులో ఉన్నాయి.వాటి గురించి తెలియక పోవడం వలన,వాడేవిధానము తెలియక మరియు వాణిజ్య సాఫ్ట్వేర్లకు అలవాటు పడడం వలన స్వేచ్చా సాఫ్ట్వేర్లు ఆదరణ పొందలేక పోతున్నాయి.షోమీడు.కామ్ లో ప్రముఖ స్వేచ్చా సాఫ్ట్వేర్లు వాడే విధానమును గురించి సవివరంగా,సులభంగా అర్ధమయ్యే వీడియో ట్యుటోరియళ్ళ రూపంలో అందుబాటులో ఉంచారు.ఆసక్తి గలవారు షోమీడు.కామ్ లో వీడియో ట్యుటోరియళ్ళు చూడవచ్చు,డౌన్లోడ్ చేసుకోవచ్చు.అంతేకాకుండా మనం తయారు చేసిన ట్యుటోరియళ్ళను కూడా ఇక్కడ ఉంచవచ్చు.

స్వేచ్చా సాఫ్ట్వేర్ల కూడలి

  స్వేచ్చా సాఫ్ట్వేర్ల అభివృద్ధిలో పాలుపంచుకోవలనుకోను ఔత్సాహికులకు చక్కని వేదిక లాంచ్ పాడ్.నెట్.మనం ఇక్కడ ఉచితంగా ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టి,అభివృద్ధి చేయవచ్చు.దానికి ప్రాచుర్యం కల్పించి కమ్యూనిటి సహాయం పొందడం ద్వారా మన సాఫ్ట్వేర్ అభివృద్ధి ని వేగవంతం చేయవచ్చు.వివిధ భాషలలోకి అనువదించడం వలన మన సాఫ్ట్వేర్ని వాడేవారి సంఖ్య పెంచవచ్చు. అంతేకాకుండా మనం కూడా ఇతర  సాఫ్ట్వేర్ల అభివృద్ధి ని గమనించవచ్చు.వారి సహాయం కోరవచ్చులేదా వారికి సహాయం చేయవచ్చు.

 

లాంచ్ పాడ్.నెట్ విశిష్టతలు:

  • కోడ్ హోస్టింగ్
  • బగ్ ట్రాకింగ్
  • కోడ్ రివ్యు
  • అనువాదాలు
  • మెయిలింగ్ లిస్ట్
  • ప్రశ్నలు,జవాబుల ట్రాకింగ్

  

 

ఆపరేటింగ్ సిస్టములు దొరుకు చోటు

 లినక్స్ ఆపరేటింగ్ సిస్టములు ఆయా సైట్ ల నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఆపరేటింగ్ సిస్టములు ఇమేజ్ ఫైల్(.ISO) రూపంలో సుమారుగా 600 యం.బి లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంతో ఉంటాయి.వాటిని  డౌన్లోడ్ చేసుకోని సీడీ/డీవిడి/పెన్ డ్రైవ్ ల ద్వారా మనం ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.ఆపరేటింగ్ సిస్టముల ఇమేజ్ ఫైళ్ళను నేరుగా డౌన్లోడ్ చేసుకోవడానికి వేగవంతమైన అంతర్జాల అనుసందానము అవసరము.మధ్యలో అంతరాయము కలిగితే అప్పటి వరకు దిగుమతి అయినదంత వృధాఅవుతుంది.కనుక ఇటువంటి పెద్ద పరిమాణం గల ఫైళ్ళను దిగుమతి చేసుకోవడానికి మనం సాధారణంగా టొరెంట్ల పై ఆధారపడుతాము.చాల లినక్స్ ఆపరేటింగ్ సిస్టములు టొరెంట్ లంకెను కూడా అందుబాటులో ఉంచుతారు.ఒకవేళ ఏదైనా లినక్స్ ఆపరేటింగ్ సిస్టము టొరెంట్ దొరక్కపొతే లినక్స్ ట్రాకర్.ఆర్గ్ ని చూడండి.ఇక్కడ అన్ని లినక్స్ ఆపరేటింగ్ సిస్టముల టొరెంట్లు దొరుకుతాయి.



ఆపరేటింగ్ సిస్టంలు ఎన్ని?

ఆపరేటింగ్ సిస్టంలు ఎన్ని? అని అడిగితే ఎవరికైనా చెప్పడం కష్టమే. ఒక్క లినక్స్ కర్నేలు పైనే ఎన్నో ఆపరేటింగ్ సిస్టంలు నిర్మించబడ్డాయి. వాటిలో ప్రాచూర్యం పొందిన ఉబుంటు, డెబియన్, లినక్స్ మింట్ వంటి వాటి గూర్చి మాత్రమే మనకు తెలుసు. అసలు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలు ఎన్ని, వాటి గురించి సమాచారం, అవి ఎక్కడ దొరుకుతాయి?

లినక్స్ ఆపరేటింగ్ సిస్టం వాడే, వాడబోయే ప్రతి ఒక్కరికి ఉపయేగపడే వెబ్ సైట్

linuxappfinder
ఇక్కడ లినక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టంలకి కావలసిన సాప్ట్వేర్లు అన్ని వెతకడానికి సులువుగా విభాగాలుగా విభజించి ఉన్నాయి. వాడుకరి రేటింగ్, అభిప్రాయాలు, స్క్రీన్ షాట్స్, ఎంత మంది చూసారు అన్న సమాచారం, అప్లికేషన్ గురించిన వివరణ పొందుపరచబడి ఉన్నాయి. అంతేకాకుండా విండోస్, మాక్ లలో ప్రాచూర్యం పొందిన అప్లికేషన్స్, వాటికి లినక్స్ ప్రత్యామ్నాయ అప్లికేషన్స్ చూచించబడ్డాయి.