ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రతిఫలాలను రైతులకు కూడా అందించే సదుద్దేశంతో అంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయశాఖ వారు రైతుల కోసం ఒక వెబ్ సైటుని రూపొందించారు.ఎపిఅగ్రిస్ నెట్ అనే ఈ సైటులో రైతులకు ఉపయోగపడే భూసార పరిక్షల వివరాలు,పంటల సాగులో మెళుకువలు,పంటలకు వాడవలసిన ఎరువులు,రైతుల అనుభవాలు,ఎరువుల ధరలు వంటి అనేక విషయాలను తెలుగులో అందుబాటులో ఉంచారు.