ఆపరేటింగ్ సిస్టంలు ఎన్ని?

ఆపరేటింగ్ సిస్టంలు ఎన్ని? అని అడిగితే ఎవరికైనా చెప్పడం కష్టమే. ఒక్క లినక్స్ కర్నేలు పైనే ఎన్నో ఆపరేటింగ్ సిస్టంలు నిర్మించబడ్డాయి. వాటిలో ప్రాచూర్యం పొందిన ఉబుంటు, డెబియన్, లినక్స్ మింట్ వంటి వాటి గూర్చి మాత్రమే మనకు తెలుసు. అసలు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలు ఎన్ని, వాటి గురించి సమాచారం, అవి ఎక్కడ దొరుకుతాయి?
మీ ప్రశ్నలకి సరి అయిన సమాధానం లభించు చోటు డిస్ట్రోవాచ్. డిస్ట్రోవాచ్.కాం నందు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలు, వాటి గూర్చి పూర్తి సమాచారం, అవి లభించు చోటు అన్ని సవివరంగా వివరించబడినవి. అంతే కాకుండా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని, క్రొత్త విడుదలలు గూర్చి మనకి తెలియజేయును. డిస్ట్రోవాచ్.కాం ను స్థానిక భాషలలో కూడా తీసుకొనిరావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగులో అనువదించడానికి మీ వంతు సహకారాన్ని అందించండి.