ఆఫీస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆఫీస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఉచిత ఆఫీస్ 4.4 విడుదలైంది

ఖరీదైన ఆఫీస్ అప్లికేషన్లకు దీటయిన ఉచిత ప్రత్యామ్నాయం లిబ్రేఆఫీస్. ఉచితంగా లభించే ఈ లిబ్రేఆఫీస్ సాఫ్ట్‌వేర్ విండోస్, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఒపెన్ సోర్స్ సాఫ్ట్‌వేరును ఉపయోగించి ప్రజా డాక్యుమెంటు ఫార్మాటు అయిన ఒపెన్ డాక్యుమెంటు ఫార్మాటులో మనం డాక్యుమెంట్లు తయారువేసుకోవచ్చు. అంతే కాకుండా

ఉచిత అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్

సాధారణంగా చాలామంది వ్యక్తిగత మరియు చిన్న వ్యాపార ఆర్ధిక లావాదేవీలను తమ కంప్యూటర్లలో చేసుకోవడానికి పేరుపొందిన అకౌంటింగ్ సాఫ్ట్వేర్ల యొక్క పైరేటెడ్ వెర్షనుని లేదా ట్రయిల్ వెర్షనులు వాడుతుంటారు. ఇటువంటి వారు పైరేటెడ్ సాఫ్ట్వేరు వాడకుండానే ఉచిత ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్లను వాడి తమ వ్యవహారాలను చక్కబెట్టుకోవచ్చు. అలా

ఆండ్రాయిడ్ పరికరాలకి లిబ్రేఆఫీస్ రాబోతుంది.

లిబ్రే ఆఫీస్ అనేది ఉచితంగా లభించే ఒపెన్ సోర్స్ ఆఫీస్ సూట్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న ఈ ఆఫీస్ సూట్ ఒపెన్ ఆఫీస్ నుండి ఆవిర్బవించింది. విండోసు, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే లిబ్రే ఆఫీస్ తొందరలోనే ఆండ్రాయిడ్ పరికరాలలో కూడా పనిచేయబోతుంది. లిబ్రే ఆఫీసును ది డాక్యుమెంట్ ఫౌండేషన్ అన్న సంస్థ

ఉచిత ఆఫీస్ అప్లికేషన్ కొత్త వెర్షను విడుదల

సాధారణంగా మనకి కనిపించే ఆఫీస్ అప్లికేషను ధర చాలా ఎక్కువగా ఉండడం వలన చాలా మంది పైరేటెడ్ వెర్షను వాడుతుంటారు. దానికి చక్కని ప్రత్యామ్నాయాలు ఇప్పుడు మనకి చాలా ఉందుబాటులో ఉన్నాయి. వాటిలో మొదటిది లిబ్రే ఆఫీస్. ఇది ఉచితంగా లభించడంతో పాటు అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. అంతేకాకుండా కొత్త

లిబ్రే ఆఫీస్ తో సమయాన్ని ఆదా చేసుకుంటునే పనితీరును మెరుగుపరుచుకోవడానికి

 వేలకువేలు పోసి కొనే వాణిజ్య ఆఫీస్ అనువర్తనాలకు ఉచిత ప్రత్యామ్నాయమే లిబ్రే ఆఫీస్. ఇది ఉచితంగా లభిస్తుంది. ఎవరైనా సులభంగా దీన్ని వాడవచ్చు. చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఎన్ని కంప్యూటర్లలో అయిన ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఎంతమంది కైనా ఇవ్వవచ్చు. ఈమధ్యే లిబ్రే ఆఫీస్ యొక్క సరికొత్త వెర్షను 4.1.1 విడుదలైంది. దీనిని క్రింది లంకె నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.




 లిబ్రే ఆఫీస్ వాడే వారికోసం డాక్యుమెంట్ ఫౌండేషన్ వారు అందిస్తున్న ఈ ఉచిత టెంప్లెట్లు మన పనిని సులభతరం చేస్తూనే సమయాన్ని కూడా ఆధా చేస్తాయి. మన రోజువారి అవసరాలకి తగిన టెంప్లెట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రెజ్యూమ్లు, ఇన్ వాయిస్లు, నెలసరి మరియు వార్షిక ఆర్ధిక ప్రణాళికలు, ఫాక్స్ మరియు కవరింగ్ లెటర్లు, బిజినెస్ కార్డులు, వివిధ రకాల ప్రజంటేషన్ స్లైడ్లు వంటి నిత్యావసర టెంప్లెట్లు ఇక్కడ లభిస్తాయి. ముందే తయారుచేయబడిన ఈ టెంప్లెట్లలో మనం మన సమాచారాన్ని ఉంచి వాటిని వాడుకోవచ్చు. అంతే కాకుండా వాటిని మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. పెద్ద మొత్తంలో వివిధ రకాల టెంప్లెట్లు ఒపెన్ ఆఫీస్ కూడా అందిస్తుంది. వాటిని కూడా మనం లిబ్రే ఆఫీస్ లో కూడా వాడుకోవచ్చు.




లిబ్రే ఆఫీస్ 4.0.3 విడుదలైంది


 డాక్యుమెంట్ ఫౌండేషన్ ఈరోజు లిబ్రే ఆఫీస్ యొక్క తరువాతి వెర్షన్ అయిన 4.0.3 ని విడుదలచేసింది. సుమారు వంద దోషాలు సరిచేయబడిన 4.0.3 విడుదల ప్రకటన ఇక్కడ చూడవచ్చు.

 ఉబుంటు, మీంట్ మరియు డెబియన్ వాడేవారు క్రింది ఇవ్వబడిన కమాండ్లను టెర్మినల్ లో నడపడం ద్వారా కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
  •  sudo add-apt-repository ppa:libreoffice/libreoffice-4-0 
  • sudo apt-get update
  • sudo apt-get install libreoffice

ఆండ్రాయిడ్ కోసం లిబ్రే ఆఫీస్ రాబోతుంది

 ప్రపంచంలో ఎక్కువ పరికరాల్లో వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టంగా ప్రసిధ్ది చెందిన ఆండ్రాయిడ్ కి ఇప్పటికే పలు ఆఫీస్ అనువర్తనాలు ఉన్నప్పటికి వాటిలో ఉచితంగా లభించేవి కొన్నే. వాటిలో అన్ని ఫార్మాటులకి మధ్దతు ఇవ్వగల ఉచిత ఆఫీస్ అనువర్తనాలు ఇంకా తక్కువ. డెస్క్ టాప్ ఆఫీస్ సూట్ లలో వాణిజ్య ఆఫీస్ అనువర్తనాలకి ప్రత్యామ్నాయంగా నిలిచిన ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్ అయిన లిబ్రే ఆఫీస్ ఇప్పుడు ఆండ్రాయిడ్ కి కూడా ఆఫీస్ అనువర్తనాన్ని తయారుచేస్తుంది. అభివృధ్ది దశలో ఉన్న ఆండ్రాయిడ్ కోసం లిబ్రే ఆఫీస్ ని ఇక్కడ నుండి దింపుకోని ప్రయత్నించి చూడవచ్చు.
గూగుల్ నెక్సాస్ 7లో లిబ్రే ఆఫీస్

మీ స్వేచ్ఛను రెట్టింపు చేసుకోండి

 వేలకువేలు వెచ్చించనవసరం లేకుండా ఉచితంగా దొరికే లిబ్రే ఆఫీస్ ప్రముఖ వాణిజ్య ఆఫీస్ అనువర్తనాలకు చక్కని ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు లిబ్రే ఆఫీస్ అందించే అన్ని సదుపాయాలను ఇన్ స్టాల్ చేయనవసరం లేకుండానే వాడుకోవచ్చు. మనకు అవసరం వచ్చినపుడు వాడుకోవడానికి అనువుగా తయారుచేయబడిన లిబ్రే ఆఫీస్ పోర్టబుల్ మనతో పాటు పెన్ డ్రైవ్ లో తీసుకుపోయి ఎప్పుడైనా ఎక్కడైనా వాడుకోవచ్చు. లిబ్రే ఆఫీస్ పోర్టబుల్ కూడా ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్. లిబ్రే ఆఫీస్ పోర్టబుల్ ని క్రింది లంకె నుండి దింపుకోవచ్చు.

లిబ్రే ఆఫీస్ చేతి పుస్తకము(మాన్యువల్) ఉచితంగా

 వేలకువేలు పోసి కొనే ప్రముఖ వాణిజ్య ఆఫీస్ అనువర్తనాలకు ఉచిత ప్రత్యామ్నాయమే లిబ్రే ఆఫీస్. ఇది ఉచితంగా లభిస్తుంది. ఎవరైనా సులభంగా దీన్ని వాడవచ్చు. చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఎన్ని కంప్యూటర్లలో అయిన ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఎంతమంది కైనా ఇవ్వవచ్చు. ఈమధ్యే లిబ్రే ఆఫీస్ యొక్క సరికొత్త వెర్షను 4.0 విడుదలైంది. దీనిని క్రింది లంకె నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.


 లిబ్రే ఆఫీస్ యొక్క చేతి పుస్తకం ఇప్పుడు అందుబాటులో ఉంది. దీనిలో లిబ్రే ఆఫీస్ వాడు విధానమును గూర్చి సవివరంగా చిత్రాలతో సమగ్రంగా వివరించబడినది. మూడు వందల తొంభై పేజిల ఈ పుస్తకము .odt మరియు పిడియఫ్ ఫార్మాటులలో లభిస్తుంది. దీనిని క్రింది లంకె నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

నెమ్మదిగా ఉన్న కంప్యూటర్లలో కూడా వేగంగా PDF ఫైళ్ళను తెరవడానికి

 ఎక్కువ పరిమాణం గల PDF ఫైళ్ళను నెమ్మదిగా ఉన్న కంప్యూటర్లలో కూడా వేగంగా తెరవడానికి MuPDF అను చిన్న, వేగవంతమైన, స్వేచ్ఛా సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. దీనిలో అదనపు హంగులు లేకుండా అతి తక్కువ పరిమాణంలో ఉండడం వలన ఇది చాలా వేగంగా పనిచేస్తుంది.దీనిని వాడడానికి తప్పనిసరిగా కీబోర్డ్ షార్ట్ కట్స్ ని ఉపయోగించాలి. ఇది లినక్స్ , విండోస్ , ఆండ్రాయిడ్ మరియు ఐ ఒయస్ లందు పనిచేస్తుంది. 

ఉబుంటు వాడువారు సరికొత్త వెర్షనుని ఇన్ స్టాల్ చేయడానికి క్రింద ఇవ్వబడిన కమాండ్లను రన్ చేయాలి.
sudo add-apt-repository ppa:guilhem-fr/mupdf
sudo apt-get update
sudo apt-get install mupdf
MUPDF

ఉత్తమ మెయిల్ క్లయింట్ ఉచితంగా

 సాధారణంగా ప్రొఫెషనల్ ఆఫీస్ సూట్ తో మాత్రమే మెయిల్ క్లయింట్ వస్తుంది. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. వాణిజ్య మెయిల్ క్లయింట్లకు దీటయిన ప్రత్యామ్నాయంగా తండర్ బర్డ్ అను స్వేచ్ఛా సాఫ్ట్వేర్ని చెప్పుకోవచ్చు. దీనిని ఫైర్ ఫాక్స్ ని తయారుచేసిన లాభాపేక్ష లేని సంస్థ అయిన మొజిల్లా వారు తయారుచేసారు. ఎన్నో విశిష్టతలతో పాటు భద్రత పరంగా కూడా మేటి అయిన ఈ తండర్ బర్డ్ ఉచితంగా లభిస్తుంది. ఉబుంటు లో అప్రమేయంగా ఇది ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది. ఇది మెయిల్ క్లయింట్ గానే కాకుండా RSS ఫీడ్ రీడర్ గాను,అవసరానికి వెబ్ బ్రౌసర్ గా కూడా పనిచేస్తుంది. తండర్ బర్డ్ ని విండోసు, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఫైర్ ఫాక్స్ మాదిరిగానే చాలా రకాల యాడ్ ఆన్లు తండర్ బర్డ్ కి కూడా అందుబాటులో ఉన్నాయి.




ఒపెన్ సోర్స్ DTP సాఫ్ట్వేర్

  స్క్రైబస్ అను స్వేచ్చా సాఫ్ట్వేర్ పేజ్ మేకర్ లాంటి వాణిజ్య సాఫ్ట్వేర్లకు ప్రత్యామ్నాయ డెస్క్ టాప్ పబ్లిషింగ్ సాఫ్ట్వేర్. స్క్రైబస్ ని ఉపయోగించి కరపత్రాలు,వార్తాపత్రికలు మరియు ప్రచార చిత్రాలు వంటి వాటిని రూపొందించవచ్చు.అధునాతన ప్రచురణకు కావలసిన హంగులన్ని దీని సొంతం.అంతేకాకుండా దీని వాడకాన్ని గురించి వివరించే ట్యుటోరియళ్ళు అంతర్జాలంలో సులభంగా దొరుకుతాయి.ఇది విండోస్,మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టముల నందు పనిచేస్తుంది. స్క్రైబస్ ని ఉచితంగా ఇక్కడ నుండి దిగుమతి చేసుకోవచ్చు. తొందరలోనే  స్క్రైబస్ లో తెలుగు మద్దతును చేర్చబోతున్నారు.


చిటికలో పిడిఎఫ్ ఫైల్ ని తయారుచేసుకోండి

  పిడిఎఫ్ ఫైళ్ళను తయారుచేయడానికి రకరకాల పద్దతులు వాడుతుంటాము.ఉబుంటు వాడేవారు ఎటువంటి సాఫ్ట్వేర్లు అధనంగా ఇన్ స్టాల్ చేయనక్కరలేకుండానే ఈవీడియోలో చూపించినట్లు చిటికలో చాలా సులభంగా పిడిఎఫ్ ఫైల్ ని తయారుచేసుకోవచ్చు.

తేలికైన పిడిఎఫ్ రీడర్

  పిడిఎఫ్ ఫైళ్ళను చదువడానికి మనం సాధారణంగా అడోబ్ రీడర్ ని వాడుతుంటాము.ఉబుంటులో ఎటువంటి పిడిఎఫ్ రీడర్ ఇన్ స్టాల్ చేయనవసరం లేకుండానే మనం  పిడిఎఫ్ ఫైళ్ళను చదువుకోవచ్చు. ఉబుంటు లో పిడిఎఫ్ ఫైల్ ని క్లిక్ చేయగానే డాక్యుమెంట్ వ్యూయర్(ఎవిన్స్) అనబడు అనువర్తనము తో పిడిఎఫ్ ఫైల్ తెరవబడును.ఎవిన్స్ గ్నోం డెస్క్ టాప్ ఆదారిత అన్ని లినక్స్ పంపకాలలో అప్రమేయంగా ఉంటుంది.ఇది చాలా తేలికైన,తక్కువ పరిమాణాము గల పిడిఎఫ్ రీడర్.ఎవిన్స్ ని ఉపయోగించి PDF,Postscript,djvu,tiff, dvi,XPS,SyncTex support with gedit మరియు comics books (cbr,cbz,cb7 and cbt) డాక్యుమెంట్లను చదువవచ్చు.
 ఎవిన్స్ విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టం లలో పనిచేస్తుంది.

డయాగ్రాములు, ఫ్లోచార్టులు గీయడానికి

డయాగ్రాములు, ఫ్లోచార్టులు గీయడానికి ఉచిత స్వేచ్చా అనువర్తనము డయా. దీనిని మైక్రోసాఫ్ట్ విసియోకి చక్కని ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. విండోస్, మాక్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టములలో పనిచేస్తుంది. ఉబుంటు వాడేవారు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి నేరుగా స్థాపించుకోవచ్చు. మిగిలిన ఆపరేటింగ్ సిస్టములు వాడువారు క్రింద

యమ్.ఎస్.ఆఫీస్ కి ఉచిత ప్రత్యామ్నాయాలు

ఆఫీస్ ప్రత్యామ్నాయాలలో మొదట చెప్పుకోవలసింది లిబ్రేఆఫీస్. ఇది పూర్తిగా ప్రజలచే, ప్రజల కొరకు తయారుచేయబడినది. ఓపెన్ సోర్స్ ప్రపంచం మద్దతు దీనికే. ఎటువంటి వాణిజ్య సంస్థల నియంత్రణ లేకుండా నడుస్తున్నది. అన్ని ఆపరేటింగ్ సిస్టములలో పనిచేస్తుంది. ఉబుంటు మరియు కొన్ని లినక్స్ పంపకాలతో అప్రమేయంగా అందించబడుతుంది. మిగిలిన ఆపరేటింగ్ సిస్టములు