తెలుగు నేర్చుకున్న టీవీ

 కంప్యూటర్లు, మొబైళ్ళు ఇప్పటికే తెలుగు అక్షరాలను చూపించగలుగుతు ఉన్నప్పటికి ఇంకా చాలా మొబైళ్ళు మాత్రం డిఫాల్ట్ గా తెలుగుని చూపించలేకపోవడం విచారించవలసిన విషయం. అయితే ఈ నేపధ్యంలో తెలుగు చూపించగలిగే పరికరాలకోసం వెతుకుతు టీవీల పై దృష్టి సారించగా టీవీలలో ఇప్పటికే ఒ.యస్.డి భాషగా హింది వంటి భారతీయ భాషలు ఉపయోగించబడినాయి. కాని నావరకు తెలుగు అక్షరాలను టీవీలలో ఇప్పటి వరకు చూడలేదు. పెన్ డైవ్ పెట్టుకొనే సధుపాయం ఉన్న నా సాంసంగ్ 32' యల్.ఇ.డి టీవీలో తెలుగు కనిపించవచ్చునేమో అనే ఆశతో చిన్న ప్రయోగం చేసాను. కొన్ని mp3 పైళ్ళను తీసుకొని వాటి మెటా డాటా(పాట, సినిమా,పాడినవారు వంటివి) ని తెలుగులోకి  మార్చి టీవీలో ప్లే చేసినపుడు తెలుగు అక్షరాలను టీవీ ఇలా చూపించింది.



తెలుగు అక్షరాలను సరిగా చూపిస్తున్న సాంసంగ్ టీవీ       

రూట్ చేయబోయే ముందు ఆండ్రాయిడ్ ఫోను బ్యాకప్ తీసుకోండిలా

 ఆండ్రాయిడ్ ఫోను రూట్ చేయబోయే ముందు ఆండ్రాయిడ్ ఫోను బాక్ అప్ తీసుకోవడం మంచిది. రూట్ చేసిన ఫోన్లకి మన డాటా తో పాటు పూర్తిగా ఆపరేటింగ్ సిస్టం బ్యాకప్ తీసుకోవడానికి వివిధ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ రూట్ చెయ్యని ఫోన్లకి మనం మన డాటా మాత్రమే అనగా మన ఫోన్ నంబర్లు, మెసేజిలు, అప్లికేషన్లు ఫొటో మరియు వీడియోలును బ్యాకప్ తీసుకోవచ్చు. రూట్ చెయ్యాలన్న ఆలోచన లేనప్పటికి మనం మన ఫోనులో ముఖ్యమైన సమాచారాన్ని బ్యాకప్ తీసుకుంటే ఫోన్ చెడిపోయినప్పుడు కాని, ఫొన్ కనిపించకుండా పోయినప్పుడు కాని, కొత్త ఫోను కొన్నప్పుడు కాని మనం తిరిగి మన సమాచారాన్ని తిరిగి పొందేందుకు వీలవుతుంది. ఎటువంటి పరిజ్ఞానం లేకపోయినా ఎవరైనా తమ ఫోనులో ఉన్న సమాచారాన్ని బ్యాకప్ తీసుకోవచ్చు, అవసరమైనప్పుడు తిరిగి వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోనులో ఉన్న మన సమాచారాన్ని బ్యాకప్ తీయడానికి గల వివిధ పధ్దతులు క్రింద ఇవ్వబడ్డాయి.
 
 
 
 1) మన ఫోనుని గూగుల్ ఖాతాకి అనుసంధానించి ఉండి మనకి మొబైల్ కి నెట్ అందుబాటులో ఉంటే మనం క్రింది చిత్రంలో చూపించినట్లు బ్యాకప్ సెట్ట్ంగులని మార్చుకుంటే మన అప్లికేషన్ సెట్టింగులు, వైఫి పాస్ వర్డ్ లు, ఫొటోలు, ఫోన్ నంబర్లు అన్ని అటోమెటిక్ గా మన గూగుల్ అకౌంట్ లో బధ్రపరచబడతాయి. బ్యాకప్ తీయబడిన సమాచారం తిరిగి అటోమెటిక్ గా మన ఫొన్లోకి రిస్టోర్ చేసుకోవచ్చు. ఈ విధానంలో మెసేజిలు,వీడియోలు, సంగీతం మరియు అప్లికేషన్లు బధ్రపరచబడవు.
 
ఆండ్రాయిడ్ బ్యాకప్ సెట్టింగ్స్

  2) గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, ఉబుంటు వన్, కాపీ వంటి వివిధ క్లౌడ్ సర్వీసులు కొంత స్టోరేజిని ఉచితంగా అందిస్తున్నాయి. ఆయా క్లయింట్లని ప్లే స్టోర్ ద్వారా ఇంస్టాల్ చేసుకొని వాటిలో మన సమాచారాన్ని నిల్వచేసుకోవచ్చు. వాటిలో ఉంచిన సమాచారం మనం ఎక్కడి నుండి అయిన వాడుకోవడానికి అవకాశం ఉంది. పై రెండు పధ్దతులలో మనకి నెట్ అవసరం ఉంటుంది.
 
 3) నెట్ అవసరం లేకుండా మనం మన ఫొన్ నంబర్లు మరియు ఫొటోలు, వీడియోలు మరియు సంగీత ఫైళ్ళని మనం నేరుగా మన కంప్యూటరులోకి యు.యస్.బి కేబుల్ ద్వారా కాపీ చేసుకోవచ్చు. కావలసినప్పుడు తిరిగి ఫోన్లోకి కాపీ చేసుకొని వాడుకోవచ్చు. ఫోన్ నంబర్లను క్రింది చిత్రంలో వలె ఎక్స్ పోర్ట్ చేసుకుని ఒక ఫైల్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు. అపుడు .vfc ఫార్మాటులో మన కాంటాక్టులన్ని(ఫోన్ నంబర్లు, ఇ మెయిల్ ఐడిలు) బధ్రపరచబడతాయి. దానిని మనం యస్.డి. కార్డులో కానీ కంప్యూటర్లో గాని దాచుకొని కావలసినప్పుడు తిరిగి ఇంపోర్ట్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ ఫోన్లో ఫోన్ నంబర్లు దాచుకోవడం  

ఫోన్ నుండి ఉబుంటు 13.10 ఆపరేటింగ్ సిస్టం ఉన్న కంప్యూటర్లోకి నేరుగా ఫైళ్ళని కాపీ చేయడం
 
 4) మన ఫోన్లో ఉన్న అప్లికేషన్లని బ్యాకప్ తీసుకోవాలంటే ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ కావలిసిందే. ఆప్ బ్యాకప్ రిస్టోర్ అన్న అప్లికేషన్ని ఇక్కడ నుండి ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఆప్ ని ఉపయోగించి మనకి కావలసిన అప్లికేషన్లను ఒకే సారి యస్.డి. కార్డు లోకి బ్యాకప్ తీసుకోవచ్చు. తిరిగి మనకి కావలసిన అప్లికేషన్లను అన్నిటిని ఒకేసారి ఫోనులోకి రిస్టోర్ చెసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ అప్లికేషన్లని బ్యాకప్ తీసే ఆప్ బ్యాకప్& రిస్టోర్
 
 5) చివరి అతి ముఖ్యమైనది మన మొబైల్ డాటా అనగా ఫోన్ నంబర్లు, మెసేజిలు, కాల్ లాగ్ మరియు క్యాలెండరు సమాచారాన్ని బ్యాకప్ తీయడం. ఈపనికి మొబైల్ బ్యాకప్ అనే అప్లికేషను మనకి ఉపయోగపడుతుంది. దీనిని మనం ఇక్కడ నుండి ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ని ఉపయోగించి ఫోన్ నంబర్లు, మెసేజిలు, కాల్ లాగ్ మరియు క్యాలెండరు సమాచారాన్ని యస్.డి. కార్డు లోకి బ్యాకప్ తీసుకొని తిరిగి కావలసినప్పుడు రిస్టోర్ చేసుకోవచ్చు.
 
ఫోన్ నంబర్లు, మెసేజిలు, కాల్ లాగ్ మరియు క్యాలెండరు సమాచారాన్ని బ్యాకప్ తీసే మొబైల్ బ్యాకప్

పైరేటెడ్ సాఫ్ట్వేర్ వాడుకర్లకి శుభవార్త ! ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టం విడుదలైంది.

 ఇప్పుడే ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఉచిత ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం విడుదలైంది. దానితో పాటు ఫోన్లకి, టాబ్లెట్లకి, లాప్ టాప్, డెస్క్ టాప్, సర్వర్లలో వాడుకోవడానికి వివిధ ఆపరేటింగ్ సిస్టములు విడుదలైనాయి. విశేషం ఏమిటంటే వీటిని ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. చట్టపరంగానే డబ్బులు కట్టకుండా ఎన్ని కంప్యూటర్లలో అయిన ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఎటువంటి లైసెన్స్ కీలు అవసరం లేదు. మీ ఆపరేటింగ్ సిస్టం నకిలీదని పదేపదే విసిగించదు. పైరేటెడ్ సాఫ్ట్వేర్ నుండి విముక్తి కావడానికి ఇదే సరైన అవకాశం.   
 ఉబుంటు 13.10 ఇప్పుడే విడుదలైంది. దానితో పాటు ఉబుంటు టచ్ 1.0(ఫోన్లకి మరియు టాబ్లెట్లకి), ఉబుంటు సర్వర్ మరియు లాప్ టాప్, డెస్క్ టాప్ కొరకు కుబుంటు, లుబుంటు, క్షుబుంటు, ఎడ్యుబుంటు, ఉబుంటు స్టుడియో, ఉబుంటు గ్నోం,  ఉబుంటు కైలిన్ లు కూడా విడుదలైనాయి. 
ఉబుంటు డెస్క్ టాప్

ఉబుంటు ఫోన్

 ఇప్పటికే ఉబుంటు వాడుతున్నవారు కొత్త వెర్షన్ కి డబ్బులు చెల్లించకుండానే ఉచితంగా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఎలా అనేది ఇక్కడ చూడవచ్చు. కొత్త ఫీచర్లతో విడుదలైన ఉబుంటు 13.10 గురించి పూర్తి విశేషాలు వీడియోలు ఇక్కడ చూడవచ్చు. మిగిలిన ఆపరేటింగ్ సిస్టములలో కొత్తగా వచ్చిన మార్పులని ఇక్కడ చూడవచ్చు.
 ఉబుంటు మరియు మిగిలిన ఆపరేటింగ్ సిస్టములు క్రింది లింకుల నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఫోన్ రూట్ చేయబోయే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

 ఆండ్రాయిడ్ ఫోన్ రూట్ అంటే ఏంటి? లాభాలు నష్టాలు, మన ఫోన్ ఇప్పటికే రూట్ చేయబడిందా లేదా ఎలా తెలుసుకోవాలి అన్న విషయాలు ముందు టపాలలో వివరించబడింది. ఈ టపాలో ఆండ్రాయిడ్ ఫోన్ రూట్ చేయబోయే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకుందాము. రూటింగ్ సాధారణంగా అన్ని తయారుగా ఉంటే పది నిమిషాల్లో అయిపోతుంది. అంతగా పరిజ్ఞానం లేనివారు కూడా సులభంగా చేసుకోవచ్చు. అంతా సవ్యంగా జరగాలంటే ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే.

  • మన ఫొన్ యొక్క మోడల్ నంబర్, ఆండ్రాయిడ్ వెర్షన్, బిల్డ్ నంబర్ వంటి వివరాలు వ్రాసి పెట్టుకోవాలి. సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ లో ఈ వివరాలు ఉంటాయి. 
  • ప్రతి ఫోన్ కి , ప్రతి ఆండ్రాయిడ్ వెర్షన్ కి వేరువేరు రూటింగ్ పద్దతులు ఉంటాయి కనుక మన ఫోన్ కి సరిపడే తాజా పద్దతిని నెట్ లో వెతికి పట్టుకోవాలి.
  • ఫోన్ రూటింగ్ ని వివరించే సైట్లు చాలా ఉన్నా XDA డెవలపర్స్ సైనోజెన్ మోడ్ వంటి నమ్మకమైన సైట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
  • మనం ఫోన్ రూటింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నాము అన్నది ఖచ్చిత మైన అవగాహన ఉండాలి. మనం రూటింగ్ చెయ్యాలన్న కారణం అది మన ఫోన్లో పనిచేస్తుందా అన్నది కూడా ముందే తెలుసుకోవాలి. ఉధాహరణకు మనం కస్టం రాం ఇన్ స్టాల్ చేయాలనుకొంటే మన ఫోన్ కి సరిపడా రాం అందుబాటులో ఉందా అన్నది తెలుసుకోవాలి. వీలైతే ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అదే విధంగా రూటింగ్ , కస్టం రాం ఇన్ స్టాల్ చేయడానికి కావలసిన సాఫ్ట్వేర్లను మరియు  ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి.
  • రూట్ చేస్తున్నప్పుడు వచ్చే సమస్యలను గురించి ముందే అవగాహన పెంచుకోవాలి. దానివలన రూట్ చేసేటప్పుడు జరగరానిది జరగకుండా నివారించవచ్చు.
  • మన ఫోన్ కి సంబందించిన డ్రైవర్లను అంటే కంప్యూటర్ మన ఫోన్ ని గుర్తిచడానికి కావలసిన డ్రైవర్లను తయారిదారు వెబ్ సైటు నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోవాలి.
  • సెట్టింగ్స్ లో డెవలపర్ ఆప్షన్స్ లో యు.యస్.బి డిబగ్గింగ్ అన్న ఆప్షన్ ని ఏంచుకోవాలి.
  • రూట్ చేయడానికి ముందే ఫోన్ పూర్తిగా చార్జ్ చేసుకోవాలి.
  • రూట్ చేయబోయే ముందు మన కంప్యూటర్లో యాంటీ వైరస్ మరియు ఫైర్ వాల్ ను డిసేబుల్ చేసుకోవాలి.
  • చివరగా ముఖ్యమైనది రూట్ చేసేటప్పుడు పొరపాటు జరిగితే డాటా కోల్పోయే అవకాశం ఉంది కనుక ఫోన్ నంబర్లు, మెసేజ్, అప్లికేషన్, ఫొటోలు, ఫోన్ స్టోరేజి లో ఉన్న అన్ని ముఖ్యమైన ఫైళ్ళని బాక్ అప్ తీసుకోవాలి. 

ఫోన్ రూట్ చెయ్యబడిందో లేదో తెలుసుకోవడం ఎలా?

 రూట్ చేసిన ఫోన్ కూడా మామూలు ఫొన్ లాగే ఉంటుంది. దానిని గుర్తించడానికి ఫోన్ లో ప్రత్యేకమైన గుర్తులు ఏమి ఉండవు. సాధారణంగా కొత్తగా ఫోన్ కొన్నప్పుడు రూట్ అకౌంట్ లాక్ చేయబడి ఉంటుంది. మనం పాత మొబైల్ వేరే వాళ్ళ దగ్గర నుండి కాని ఆన్ లైన్ లో కాని కొన్నపుడు ఆ మొబైల్ రూట్ చేయబడి ఉందో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే రూట్ చేసిన ఫోన్ లో ఏవైనా హనికర అప్లికేషన్లు (సమాచారాన్ని దొంగిలించే లేదా నాశనం చేసే) ఉంచి మనకి అంటగట్టవచ్చు. లేదా తక్కువ కాన్ఫిగరేషన్ ని ఎక్కువగా చూపించి మోసం చేయవచ్చు. అందువలన సెకండ్ హెండ్ పరికరాలు కొనే ముందు తప్పని సరిగా రూట్ చేయబడి ఉందో లేదొ చూసుకోవాలి. సాధారణంగా రూట్ చేయబడిన ఫోన్ లో "సుపర్ సు" అనే అప్లికేషన్ ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది. దానిని బట్టి మనం రూట్ చేయబడిన ఫోన్ ని గుర్తించవచ్చు. కానీ కొన్ని పద్దతులలో సుపర్ సు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మొబైల్ కాని టాబ్లెట్ కాని రూట్ చేయబడిందో తెలిపే ఈ అప్లికేషన్ ను ఇన్ స్టాల్ చేసి తెలుసుకోవచ్చు. 


 ప్లే స్టోర్ నుండి రూట్ చెకర్ బేసిక్ అన్న అప్లికేషన్ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ ఇన్ స్టాల్ అయిన తరువాత ఆ అప్లికేషన్ని తెరిచి "వెరిఫై రూట్ యాక్సిస్" అన్న బటన్ ని నొక్కితే మనకి మన డివైస్ రూట్ చేయబడిందో లేదో చూపిస్తుంది.