సెర్చ్ ఇంజన్లు వెంటాడకుండా ఉండాలంటే



 తరచు సమాచారం కోసం నెట్ లో వెతకడం సాధారణంగా అందరు చేసే పనే. కాని సెర్చ్ ఇంజన్లు మన మీద నిఘా పెడితే? అవును ఇది నిజమే. మనం వెతికిన సమాచారాన్ని ఆధారంగా సెర్చ్ ఇంజన్లు మన ఇంటర్ నెట్ అలవాట్లను గుర్తించి ఆ సమాచారాన్ని వాటి అవసరాలకు వాడుకుంటున్నాయి. మనం ఏదైనా సమాచారాన్ని వెతుకుతున్నపుడు వాటికి సంభందించిన ప్రకటనలు చూపించడం వంటి వ్యాపార అవసరాలకు మరియు వివిధ ప్రభుత్వ సంస్థల విజ్ఞప్తి మేరకు వారికి వాడుకర్ల సమాచారాన్ని అందించడం కోసం మన సమాచారాన్ని మనకి తెలియకుండా భద్రపరుస్తున్నాయి. సెర్చ్ ఇంజన్లు ఏవిధంగా మనల్ని వెంటాడుతునాయో మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.
 మరి మనకి అవసరంగా మారిన ఈ వెంటాడే సెర్చ్ ఇంజన్లు కి ప్రత్యామ్నాయం లేదా?
 ఎందుకు లేదు? ఈ వీడియో చూడండి.



 డక్ డక్ గో అనేది మనం ఇప్పుడు వాడుతున్న  సెర్చ్ ఇంజన్ల వలే వాడుకరిని వెంటాడదు. ఇది మన సమాచారాన్ని దాచుకోదు. ఇది పూర్తిగా ఒపెన్ సోర్స్ సెర్చ్ ఇంజన్. మనం వాడే బ్రౌజర్ ఏదైనా సరే దీన్ని వాడుకోవచ్చు.

రసాయనాల విశేషాలను తెలుసుకోవడానికి

 రసాయన శాస్త్రం చదివే వారికి ఆవర్తన పట్టిక(పిరియాడిక్ టేబుల్) అనేది భగవద్గీత లాంటిది. ఆవర్తన పట్టికలో వివిధ మూలకాలు వాటి పరమాణు సంఖ్యల, ధర్మాల ఆధారంగా వరసగా అమర్చబడి ఉంటాయి. ఆవర్తన పట్టికని ఉపయోగించి సులువుగా మూలకం యొక్క రసాయన, భౌతిక మరియు అణు ధర్మాలను తెలుసుకోవచ్చు. రసాయన శాస్త్ర ఉపాధ్యాయులకి, విద్యార్ధులకి ఎంతగానో ఉపయోగపడే ఆవర్తన పట్టికని మనం మన డెస్క్ టాప్ పై ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. జి ఎలిమెంటల్ అను ఉచిత సాఫ్ట్వేర్ ఇన్ స్టాల్ చేసుకొని ఆవర్తన పట్టికను మన కంప్యూటర్లో చూడవచ్చు.

జి ఎలిమెంటల్ పిరియాడిక్ టేబుల్
 జి ఎలిమెంటల్ లో మూలకాలు గ్రూప్, పిరియడ్ మరియు సీరీస్  లు గా విభజించబడి వేరువేరు రంగులలో చూచించబడి ఉన్నాయి. మూలకంపై మౌస్ ని ఉంచగానే మూలకం యొక్క పూర్తి పేరు పరమాణు సంఖ్య కనిపించును. మూలకాన్ని డబుల్ క్లిక్ చేసినపుడు ఆ మూలకం యొక్క సాధారణ, భౌతిక మరియు అణు ధర్మాలను చూపించును. ఉబుంటు వాడేవారు ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ నుండి జి ఎలిమెంటల్ అని వెతికి ఉచితంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

రసాయనము యొక్క ధర్మాలు

ఆండ్రాయిడ్ ఫోన్లలో యాడ్స్ రాకుండా చేయడానికి

 ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారు వివిధ ఫ్రీ ఆప్స్ ప్లే స్టోర్ నుండి ఇన్ స్టాల్ చేసుకుంటారు. ఉచితంగా లభించే ఈ ఆప్స్ లో యాడ్స్ తరచు విసిగిస్తుంటాయి. అంతే కాకుండా ఫోన్ ద్వారా వెబ్ సైట్లు చూస్తున్నపుడు వెబ్ బ్రౌజర్ లో కూడా యాడ్స్ కనిపిస్తుంటాయి. వాటి వలన మన డాటా వినియోగం పెరుగుతుంది. ఈ యాడ్స్ ని అరికట్టడానికి గేమ్స్ ఆడుతున్నపుడు నెట్ ఆన్ చెయ్యకపోవడం ద్వారా ఉచిత గేమ్స్ లో వచ్చే యాడ్స్ ని అరికట్టవచ్చును. కాని వెబ్ ఆధారిత అప్లికేషన్ లు వాడుతున్నపుడు వాటిలో యాడ్స్ ని తొలగించడానికి తప్పకుండా యాడ్ బ్లాక్ ప్లస్ ఉండాల్సిందే.

ఆంగ్రీ బర్డ్స్ ఆడుతున్నపుడు యాడ్స్

 యాడ్ బ్లాక్ ప్లస్ ని ప్లే స్టోర్ నుండి తొలగించారు. కనుక మనం దీనిని F-డ్రయిడ్ నుండి కాని .apk ని దింపుకొని ఇన్ స్టాల్ చేసుకోవాలి. యాడ్ బ్లాక్ ప్లస్ .apk ని ఇక్కడ నుండి దింపుకోవచ్చు. .apk ఫైళ్ళని ఇన్ స్టాల్ చేయడం గురించి ఇక్కడ చూడవచ్చు. రూట్ చెయ్యబడిన పరికరాలలో యాడ్ బ్లాక్ ప్లస్ మొబైల్ మరియు వైఫి నెట్ వాడుతున్నపుడు అప్లికేషన్లలో మరియు వెబ్ బ్రౌజింగ్ లో ఉండే యాడ్స్ ని పూర్తిగా తొలగిస్తుంది. ఇక రూట్ చెయ్యని పరికరాలలో మాత్రం వైఫి నెట్ వర్క్ ని ఇక్కడ చెప్పినట్లు కాన్ఫిగర్ చేసుకుంటే వైఫి నెట్ యాడ్స్ ని నిరోధించవచ్చు. రూట్ చెయ్యని పరికరాలలో మొబైల్ నెట్ కి యాడ్ బ్లాక్ ప్లస్ పనిచేయదు. కనుక వెబ్ బ్రౌజింగ్ వరకు ఫైర్ ఫాక్స్ ని వాడితే యాడ్ బ్లాక్ ప్లస్ యాడ్ ఆన్ ని ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా యాడ్స్ ని నిరోధించవచ్చు.

మన పిల్లలకు అమ్మ భాష కమ్మదనాన్ని రుచి చూపిద్దాం

 ఐక్యరాజ్యసమితి నివేధిక ప్రకారం వేగంగా అంతరించి పోతున్న భాషలలో ఒకటయిన మన తెలుగుని బావితరాలకు అందించవలసిన బాధ్యత తెలుగు ప్రజలు అందరిది. పిల్లవాడు తన మాతృభాషలో విద్యాభ్యాసం చేయడం వలన బుద్ది తొందరగా వికసిస్తుందని నిపూణులు చెపుతూనే ఉంటారు. కానీ మనం ఈ పోటి ప్రపంచంలో తప్పని పరిస్థితులలో ఆంగ్ల మాధ్యమంలో చదివించక తప్పడంలేదు. పాతతరం పిల్లలు వారి ఆటలు, పాటలు అన్ని మన తెలుగు సంస్కృతిలో బాగమై ఉండి వారి మానసిక శారీరక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడేవి. ఆ ఆటలు, పాటలు ద్వారా పిల్లలు జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని వాటితో పాటు ఆనందాన్ని కూడా పొందేవారు. కాని ఈతరం పిల్లలకు దురదృష్టవశాత్తు ఆ అవకాశం లేదు. ఇంటి నుండి మొదలు బడి మొదలగు అన్ని చోట్ల పరబాషాధిపత్యమే.
 కిడ్స్ వన్ వారు అందించే వీడియోల వలన మనం పొందిన ఆనందాలను కనీసం మన పిల్లలకు పరిచయం చేయవచ్చు. తెలుగు పధ్యాలు, గీతాలు, ఆటలు వంటి మన తెలుగుధనం ఉట్టిపడే వీడియోలను అందిస్తున్న కిడ్స్ వన్ వారు నిజంగా అభినందనీయులు.






కిడ్స్ వన్ లో కొలువై ఉన్న తెలుగు గీతాలు

మీరు కట్టుకోబోతున్న ఇల్లు ఎలా ఉంటుందో ఇప్పుడే చూసుకోండి

 సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కట్టుకోబోతున్న ఇల్లు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎన్నో ఊహలు మనకి ఉంటాయి. ఇంటి నిర్మాణం పూర్తి అయితేగాని మన కలల ఇంటిని మనం చూసుకోలేము. మన ఊహలల్లో ఉన్న ఇంటిని మనం ఇప్పుడే చూసుకోవాలి అని, ఏ వస్తువు ఎక్కడ ఉంటే ఎలాగుంటుంది అన్న ఆసక్తి ఎవరికి ఉండదు? మన కలల ఇంటిని ఇప్పుడే మనం చూసుకోవచ్చు. పెద్ద సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే ఎవరైనా ఈ ఉచిత సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఇప్పుడే కలల ఇంటిని చూసుకోవచ్చు. 
 స్యీట్ హోం 3D అన్న ఈ ఉచిత సాఫ్ట్వెర్ ని ఉపయోగించి మన ఇంటిలో ఉన్న గదులు వాటిలో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలి, గోడల రంగులు, లైట్లు ఎన్ని ఎక్కడ ఉండాలి, పై కప్పు క్రింద ఫ్లోరింగ్ ఎలా ఉండాలి ఇలా చిన్న విషయం దగ్గర నుండి మనం డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ చేస్తున్నపుడే లైవ్ ప్రివ్యూ చూసుకోవచ్చు. మన ఇంటి నమూనాని డిజైన్ చేసుకున్న తరువాత పిడియఫ్ లేదా ఇమేజి లేదా వీడియోగా మార్చుకోవచ్చు. ఈ సాఫ్ట్వేరు మాక్, విండోస్ మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టం లలో పనిచేస్తుంది.

ఉబుంటులో స్వీట్ హోం 3డి