ఐక్యరాజ్యసమితి నివేధిక ప్రకారం వేగంగా అంతరించి పోతున్న భాషలలో ఒకటయిన మన తెలుగుని బావితరాలకు అందించవలసిన బాధ్యత తెలుగు ప్రజలు అందరిది. పిల్లవాడు తన మాతృభాషలో విద్యాభ్యాసం చేయడం వలన బుద్ది తొందరగా వికసిస్తుందని నిపూణులు చెపుతూనే ఉంటారు. కానీ మనం ఈ పోటి ప్రపంచంలో తప్పని పరిస్థితులలో ఆంగ్ల మాధ్యమంలో చదివించక తప్పడంలేదు. పాతతరం పిల్లలు వారి ఆటలు, పాటలు అన్ని మన తెలుగు సంస్కృతిలో బాగమై ఉండి వారి మానసిక శారీరక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడేవి. ఆ ఆటలు, పాటలు ద్వారా పిల్లలు జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని వాటితో పాటు ఆనందాన్ని కూడా పొందేవారు. కాని ఈతరం పిల్లలకు దురదృష్టవశాత్తు ఆ అవకాశం లేదు. ఇంటి నుండి మొదలు బడి మొదలగు అన్ని చోట్ల పరబాషాధిపత్యమే.