గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఆన్ లైన్ పిర్యాధుల పెట్టె

 గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో నివసించే పౌరుల సౌకర్యం కోసం ఆన్ లైన్ పిర్యాధుల పెట్టెని ఏర్పాటు చేసింది. మునిసిపల్ ఆఫీసుల చుట్టు తిరగనక్కరలేకుండానే ఎవరైనా సులభంగా ఇంటి దగ్గరనుండే తమ సమస్యని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళవచ్చు. తద్వారా సమస్యల పరిష్కారం పొందవచ్చును. అంతే కాకుండా తమ పిర్యాధు యొక్క స్థితిని కూడా ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో చూడవచ్చు. కరెంటు, త్రాగునీరు, మురుగునీరు, భూఆక్రమణలు, స్థల వివాదాలు, అగ్ని మాపక, పన్నులు, క్రీడలు, ఆరోగ్యం మరియు పరిశుభ్రత, కీటకాలు, ట్రాఫిక్ మరియు రవాణా వంటి  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న అన్ని శాఖలకి సంభందించిన పిర్యాధులు ఇక్కడ నమోదు చేయవచ్చు.

సంస్థగా మారిన అత్యుత్తమ ఆండ్రాయిడ్ రామ్

 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా తయారుచేయబడి, ఆండ్రాయిడ్ని మించిన ఫీచర్లని అందిస్తు నెంబర్ వన్ ఆండ్రాయిడ్ రామ్ గా పేరు తెచ్చుకొన్న సైనోజెన్ మొడ్ ఒపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం ఇప్పడు ఒక కంపెనీగా కొత్త అవతారం ఎత్తింది. దానికి సంబంధించిన ప్రకటన సైనోజెన్ మొడ్ వారి బ్లాగులో చూడవచ్చు. ఇప్పటి వరకు వివిధ కంపెనీల డివైస్ లకు అనధికార ఆపరేటింగ్ సిస్టంలు తయారు చేస్తూవచ్చిన సైనోజెన్ మొడ్ ఇప్పుడు తను కూడా సొంతంగా మొబైళ్ళు, టాబ్లెట్లు విడుదల చేయబోతుంది. సైనోజెన్ మొడ్ ఆపరేటింగ్ సిస్టం మిగిలిన రామ్ లతో పోల్చుకుంటే చాలా పరికరాల్లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
 ఈ సంధర్బంగా అన్ని మొబైళ్ళు, టాబ్లెట్లలో పనిచేచే విధంగా తయారుచేయడం, ఫోన్ లో అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకున్నంత సులువుగా సైనోజెన్ మొడ్ ని ఇన్ స్టాల్ చేయగలగడం తమ లక్ష్యాలు గా పేర్కొన్నారు. తొందరలోనే సైనోజెన్ మొడ్ ఇన్ స్టాలర్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. సైనోజెన్ మొడ్ ఇన్ స్టాలర్ యొక్క చిత్రాలు క్రింద చూడవచ్చు.



ఉబుంటు టచ్ తొలి వెర్షన్ విడుదల కాబోతుంది

 ఉబుంటు టచ్ అంటే ప్రముఖ ఉచిత లినక్స్ డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం అయిన ఉబుంటు యొక్క ఫోన్ మరియు టాబ్లెట్ల ఆపరేటింగ్ సిస్టం. గత కొంత కాలంగా వేగంగా అభివృధ్ది చేయబడుతున్న ఉబుంటు టచ్ ఆధికారికంగా గూగుల్ నెక్సాస్ పరికరాలకి (గెలాక్సి నెక్సస్, నెక్సస్4, నెక్సస్7, నెక్సస్10) మధ్దతు ఇవ్వడమే కాకుండా మూడు సంవత్సరాల పాటు అప్ డేట్స్ అందించబడును. ఉబుంటు డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం తరువాతి వెర్షన్ అయిన 13.10 తో పాటు ఉబుంటు టచ్ 1.0 వెచ్చే నెల 17న విడుదలకాబోతుంది. అధికారికంగా గెలాక్సి నెక్సస్, నెక్సస్4, నెక్సస్7, నెక్సస్10 లకు మాత్రమే మధ్దతు కలిగి ఉన్నప్పటికి అనధికారికంగా వివిధ ఫోన్లకి టాబ్లెట్ కి కూడా అందుబాటులో ఉంది. ఉబుంటు టచ్ తో తయారు చేయబడిన తొలి ఫోను వచ్చే సంవత్సరం ఏప్రిల్లో విడుదల కాబోతుంది.
 
ఉబుంటు టచ్ ఇన్ స్టాల్ చేయు విధానము


గెలాక్సి నెక్సస్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేయబడిన ఉబుంటు టచ్

ఒకే నొక్కుతో ముప్పైకి పైగా తెలుగు డిక్షనరీల సమాచారం


 తెలుగు అసోషియోషన్ ఆఫ్ నార్త్ అమెరికా సౌజన్యంతో రూపొందిన ఉచిత ఆన్ లైన్ డిక్షనరీ ఆంధ్రభారతి తెలుగు నిఘంటు శోధన. ఈ ఆన్ లైన్ డిక్షనరీ లో మనం ఆంగ్ల, తెలుగు పదాలకు అర్ధాలను వెతకవచ్చు. ఇప్పుడు ఆంధ్రభారతి తెలుగు నిఘంటు శోధన లో ముప్పైకి పైగా నిఘంటువుల సమాచారం చేర్చబడింది. మనం ఇక్కడ ఇవ్వబడిన శోధనలో ఒక పదాన్ని ఇచ్చినపుడు వెంటనే ఆ పదానికి సంభందించి ముప్పైకి పైగా తెలుగు నిఘంటువుల ఉన్న సమాచారం ఒకే సారి మన ముందుంచుతుంది. అంతే కాకుండా మన కంప్యూటర్లో ఎటువంటి కీబోర్డ్ లేఅవుట్ మార్చకుండానే ఆంగ్ల, తెలుగు పదాలను ఇక్కడ టైప్ చేయవచ్చు.
ఆంధ్రభారతి తెలుగు నిఘంటు శోధన

తెలుగు మద్దతు లేని మొబైళ్ళలో కూడా తెలుగు వార్తా పత్రికలు చూడడానికి

 ఈమధ్య మనదేశంలో కొన్న ఫోన్లు చాలావరకు తెలుగు మధ్దతు కలిగి ఉంటున్నాయి. అయినప్పటికి నెట్ సౌలభ్యం ఉండి తెలుగు చూడలేని ఫోన్లు కూడా చాలానే ఉన్నాయి. వారు కూడా తెలుగు వార్తా పత్రికలు తమ మొబైల్లో చూడడానికి ఉపయోగపడే, అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఒకే ఒకటి. అది ఇంచుమించు అన్ని మొబైల్ ఫ్లాట్ ఫాం లలో పనిచేసుంది. జావా, సింబయాన్, ఐ ఒయస్, బ్లాక్ బెర్రి, ఆండ్రాయిడ్ మరియు విండోస్ మొబైళ్ళలో పనిచేసుంది.దీనిని ఉపయోగించి తెలుగు  వార్తా పత్రికలు మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, మళయాళం,హిందీ మరియు ఆంగ్ల వంటి 11 భాషలకి సంభందించిన 72 ప్రముఖ భారతీయ దిన పత్రికలు ఫోన్ లోనే చూడవచ్చు. అదే న్యూస్ హంట్. దీనిని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా http://m.newshunt.com అన్న సైటుకి మన ఫోను లేదా కంప్యూటర్ వెబ్ బ్రౌసర్ ద్వారా వెళ్ళి నేరుగా దిన పత్రికలను చదువుకోవచ్చు.
ఆండ్రాయిడ్ లో న్యూస్ హంట్