ఉచిత ఆపరేటింగ్ సిస్టం వాడేవారు సరైన ప్రింటర్ని ఎంచుకోవడం ఎలా?

 వ్యక్తుల నుండి మొదలుకొని చిన్న, మధ్య అంతెందుకు పెద్ద సంస్థలు కూడా వ్యయ నియంత్రణలో బాగంగా సాఫ్ట్ వేర్లకు వేలకువేలు పోయడం మాని  ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంల వైపు చూస్తున్నారు. అంతేకాకుండా నఖిలీ సాఫ్ట్ వేర్లను వాడడం అంటే అవమానంగా భావించేవారి సంఖ్య బాగా పెరగడం వలన, కనీస సాంకేతిక పరిజ్ఞానం గలవారు పెరగడం, అంతర్జాలం తక్కున ధరకు అందుబాటులోకి రావడం, బ్లాగులు సామాజిక అనుసంధాన వేధికలలో మెళకువలు మరియు చర్చల ఫలితంగా ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టం వాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
 ఉచిత ఆపరేటింగ్ సిస్టం వాడెవారు తమకి తగిన పరికరాలను కొనుక్కోవడం ద్వారా అంటే ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలకి తగిన డ్రైవర్ల మధ్దతు అందిస్తున్న సంస్థలచే తయారుచేయబడిన పరికరాలను కొనుగోలు చేయడం వలన మనం ఇబ్బంది లేకుండా ఆ పరికరాలను వాడుకోవడమే కాకుండా ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్ సంసృతికి మధ్దతు ఇచ్చిన వాళ్ళము అవుతాము. దానితో మిగిలిన సంస్థలు కూడ తమతమ పరికరాలను ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే విధంగా తయారుచేయడం అనివార్యమవుతుంది. దీని వలన ఒకే సంస్థ యొక్క గుప్తాదిపత్యం తగ్గి తయారీ సంస్థల మధ్య పోటి పెరిగి వినియోగదారులకు సరసమైన ధరలకు పరికరాలు లభిస్తాయి.
 ఇకఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలకు పూర్తి స్థాయి మధ్ధతునిచ్చు ప్రింటర్ల విషయానికొస్తే వాటిలో అగ్రస్థానం నిస్సంధేహంగా హెచ్.పి. వాడివే. చాలా విభాగాల్లో అగ్రస్థానంలో ఉన్న హెచ్.పి. వాడు తమ ప్రింటర్లు ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే విధంగాతయారుచేయడమే కాకుండా వాటికి తగిన డ్రైవర్ల మధ్దతు కూడా అందించడం నిజంగా చాలా మంచి విషయం. ఇప్పటికే వివిధ పరికరాల తయారిధారులు మధ్దతునిస్తున్నప్పటికి కొన్ని పరికరాల తయారీధారులు కొన్ని సంస్థల చేతిలో బందీలై తమ పరికరాలను ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేయకుండా చేయడం ద్వారా వాణిజ్య ఆపరేటింగ్ సిస్టంలను కొనేటట్లుగా వారికి పరోక్షంగా సహకరిస్తున్నారు. వారుకూడా బుద్దిగా హెచ్.పి. వాడిలా వినియోగధారులను వాణిజ్య సాఫ్ట్వేర్లను బలవంతంగా కొనేటట్లు చేయకుండా ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే విధంగా పరికరాలను తయారుచేసి, వాటికి సరైన డ్రైవర్ల మధ్దతునివ్వడం ద్వారా వినియోగధారులని వారిష్టం వచ్చిన ఆపరేటింగ్ సిస్టం వాడుకొనేటట్లు గౌరవిస్తే ఆయా పెద్ద సంస్థల కిటికీలను మూసి మనం ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలకి తలుపులు తెరుచుకోవచ్చు. 
  హెచ్.పి. వాడు తన ప్రింటర్లకి ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేయడం కోసం Hewlett-Packard Linux Imaging & Printing అన్న పరిష్కారాన్ని అందిస్తున్నాడు. 2220 వివిధ రకాల ప్రింటర్లు ముద్రణకి, స్కానింగ్ మరియు ఫాక్స్ కి మధ్ధతినిచ్చు విధంగా తయారుచేసిన HPLIP పూర్తిగా స్వేచ్ఛా సాఫ్ట్వేర్. డెబియన్, ఉబుంటు, మింట్ మరియు ఫెడోరా వంటి అన్ని ప్రసిధ్ది పొందిన ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. పూర్తి సమాచారం మరియు HPLIP డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్చేయు విధానం కొరకు ఇక్కడ చూడవచ్చు. కనుక ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టం వాడేవారు HP ప్రింటర్లను వాడడం మేలు.

సర్వాంతర్యామి 3.9 విడుదలైంది

 విశ్వవ్యాప్తంగా ఫోన్లు, టాబ్లెట్లు, డెస్క్ టాప్లు, లాప్ టాప్లు, సర్వర్లు మరియు వివిధ పరికరాలలో కొలువైఉన్న ఆపరేటింగ్ సిస్టములకు వెన్నుముకగా ఉండి నిరంతర వేగవంతమైన అభివృధ్దిలో ఉన్న సర్వాంతర్యామి(ప్రపంచంలో అత్యధిక పరికరాల్లో వాడబడుతున్నది) అయిన లినక్స్ కర్నెల్ యొక్క కొత్త వెర్షన్ 3.9 చాలా అధనపు విశిష్టతలను కలుపుకొని విడుదలైంది.వాటిలో ముఖ్యమైనవి
  • మెరుగుపరిచిన ఫైల్ సిస్టం (Btrf, EXT4, F2FS) పనితీరు.  
  • అభివృధ్ది పరచిన పవర్ మేనేజ్మెంట్.
  • మెరుగుపరిచిన ARM ప్రాససర్ల పనితీరు.
  • లినక్స్ ఆడియో మరియు ధ్వని మెరుగుదల.
  • మరిన్ని ప్రాససర్లకు మధ్దతు(ARC700).
  • వేగవంతమైన SSD పనితీరు.
  • మెరుగుపరిచిన వివిధ డివైస్ డ్రైవర్ల పనితీతు, అధనంగా కలుపబడిన మరిన్ని గ్రాఫిక్ మరియు వివిధ పరికరాలకు సంబందించిన డ్రైవర్లు.
  • క్రోం ఆపరేటింగ్ సిస్టం కి సంపూర్ణమైన మధ్దతు.
మరిన్ని విశిష్టతల సమాహారం ఇక్కడ చూడండి.

అతిధి ఖాతా(గెస్ట్ అకౌంట్)ని తొలగించడం ఎలా?

  ఆపరేటింగ్ సిస్టం ఇన్ స్టాల్ చేసినపుడు వాడుకరి ఖాతా తో పాటు విధిగా అతిధి ఖాతా కూడా ఏర్పరుచుకుంటుంది. ఒకవేళ మనసిస్టం నుండి భద్రతా కారణాల రీత్యా అతిధి ఖాతా అవసరం లేదనుకుంటే అతిధి ఖాతాని తొలగించవచ్చు, తిరిగి పొందవచ్చును. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం వాడేవారు క్రింద చూపిన కమాండ్లను టెర్మినల్ లో నడిపి సులభంగా అతిధి ఖాతాని చిటికెలో తొలగించవచ్చు, కావలసినపుడు తిరిగి పొందవచ్చు.

అతిధి ఖాతాని కనిపించకుండా చేయడానికి:

sudo /usr/lib/lightdm/lightdm-set-defaults -l false

అతిధి ఖాతాని తిరిగి కనిపించేలా చేయడానికి

sudo /usr/lib/lightdm/lightdm-set-defaults -l true

ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న మూడవ ఆపరేటింగ్ సిస్టం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి

 ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టంలలో మూడవది, ఎక్కువగా వాడబడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టంలలో  మొదటిది అయిన ఉబుంటు యొక్క సరికొత్త వెర్షను ఈరోజు విడుదలైనది. ఉబుంటు 13.04 ఇప్పటి వరకు వచ్చిన ఉబుంటు వెర్షనులలో వేగవంతమైన, ఆకర్షణీయమైన ఆపరేటింగ్ సిస్టంగా చెప్పవచ్చు. దీనిని ఇక్కడ నుండి నేరుగా  ఉచితంగా దింపుకోచ్చు.




ఉబుంటు 13.04 డెస్క్ టాప్ 32 బిట్ టొరెంట్ డౌన్లోడ్

 డౌన్లోడ్ చేసుకున్న ఆపరేటింగ్ సిస్టం ఇమేజిని ఇక్కడ తెలిపినట్లు చాలా సులభంగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.



ఇప్పటికే ఉబుంటు వాడుతున్నట్లయితే తిరిగి ఇన్ స్టాల్ చేయనక్కరలేకుండా నేరుగా కొత్త వెర్షనుకి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. 

ఉత్తమ ఉచిత ఆపరేటింగ్ సిస్టం 13.04 విడుదలైంది

 వేలకివేలు పోసి కొనే వాణిజ్య ఆపరేటింగ్ సిస్టం లకి బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఉబుంటు తరువాతి వెర్షను అయిన ఉబుంటు 13.04 విడుదలైనది. పెద్దమొత్తంలో పనితీరులో మెరుగుదలలతో ఆకర్షణీయమైన, చూడగానే ఆకట్టుకునే రూపంతో సరికొత్త వెర్షన్ సాఫ్ట్వేర్లతో ఉబుంటు 13.04 విడుదలైనది. ఇప్పటి వరకు వచ్చిన ఉబుంటు విడుదలలో స్థిరమైన, వేగవంతమైన, ఆకర్షణీయమైన ఉబుంటు వెర్షనుగా దీనిని చెప్పుకోవచ్చు. ఉబుంటు కొత్త వెర్షనులో మార్పులు క్రింది చిత్రాలలో గమనించవచ్చు.
సరికొత్త ఐకాన్లు
మోనో ఐకాన్ల తో ఫైల్ బ్రౌజర్ నాటిలస్
ఉబుంటు వన్ మెనూ
బ్లూటూత్ మెనూ
Alt+Tab 
డాష్ అనువర్తనాల ప్రివ్యూ
డాష్ స్క్రోల్ బార్
డాష్ ఫైళ్ళ ప్రివ్యూ
సరికొత్త వెర్షను లెబ్రేఆఫీస్
కొత్త వాల్ పేపర్లు
విండోల మద్య త్వరగా విహరించడానికి
సిస్టం ఆపివేయునపుడు
సిస్టం లాగవుట్ చేయునపుడు

ఆండ్రాయిడ్ కి నేరుగా మద్దతు
కొత్త అప్ డేట్ మేనేజర్

మార్చిన ఆన్ లైన్ అకౌంట్లు
  ఉబుంటు 13.04 యొక్క మరిన్ని విశిష్టతలు క్రింది వీడియోలో చూపించబడ్డాయి.