ఉచిత ఆపరేటింగ్ సిస్టం వాడేవారు సరైన ప్రింటర్ని ఎంచుకోవడం ఎలా?

 వ్యక్తుల నుండి మొదలుకొని చిన్న, మధ్య అంతెందుకు పెద్ద సంస్థలు కూడా వ్యయ నియంత్రణలో బాగంగా సాఫ్ట్ వేర్లకు వేలకువేలు పోయడం మాని  ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంల వైపు చూస్తున్నారు. అంతేకాకుండా నఖిలీ సాఫ్ట్ వేర్లను వాడడం అంటే అవమానంగా భావించేవారి సంఖ్య బాగా పెరగడం వలన, కనీస సాంకేతిక పరిజ్ఞానం గలవారు పెరగడం, అంతర్జాలం తక్కున ధరకు అందుబాటులోకి రావడం, బ్లాగులు సామాజిక అనుసంధాన వేధికలలో మెళకువలు మరియు చర్చల ఫలితంగా ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టం వాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
 ఉచిత ఆపరేటింగ్ సిస్టం వాడెవారు తమకి తగిన పరికరాలను కొనుక్కోవడం ద్వారా అంటే ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలకి తగిన డ్రైవర్ల మధ్దతు అందిస్తున్న సంస్థలచే తయారుచేయబడిన పరికరాలను కొనుగోలు చేయడం వలన మనం ఇబ్బంది లేకుండా ఆ పరికరాలను వాడుకోవడమే కాకుండా ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్వేర్ సంసృతికి మధ్దతు ఇచ్చిన వాళ్ళము అవుతాము. దానితో మిగిలిన సంస్థలు కూడ తమతమ పరికరాలను ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే విధంగా తయారుచేయడం అనివార్యమవుతుంది. దీని వలన ఒకే సంస్థ యొక్క గుప్తాదిపత్యం తగ్గి తయారీ సంస్థల మధ్య పోటి పెరిగి వినియోగదారులకు సరసమైన ధరలకు పరికరాలు లభిస్తాయి.
 ఇకఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలకు పూర్తి స్థాయి మధ్ధతునిచ్చు ప్రింటర్ల విషయానికొస్తే వాటిలో అగ్రస్థానం నిస్సంధేహంగా హెచ్.పి. వాడివే. చాలా విభాగాల్లో అగ్రస్థానంలో ఉన్న హెచ్.పి. వాడు తమ ప్రింటర్లు ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే విధంగాతయారుచేయడమే కాకుండా వాటికి తగిన డ్రైవర్ల మధ్దతు కూడా అందించడం నిజంగా చాలా మంచి విషయం. ఇప్పటికే వివిధ పరికరాల తయారిధారులు మధ్దతునిస్తున్నప్పటికి కొన్ని పరికరాల తయారీధారులు కొన్ని సంస్థల చేతిలో బందీలై తమ పరికరాలను ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేయకుండా చేయడం ద్వారా వాణిజ్య ఆపరేటింగ్ సిస్టంలను కొనేటట్లుగా వారికి పరోక్షంగా సహకరిస్తున్నారు. వారుకూడా బుద్దిగా హెచ్.పి. వాడిలా వినియోగధారులను వాణిజ్య సాఫ్ట్వేర్లను బలవంతంగా కొనేటట్లు చేయకుండా ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే విధంగా పరికరాలను తయారుచేసి, వాటికి సరైన డ్రైవర్ల మధ్దతునివ్వడం ద్వారా వినియోగధారులని వారిష్టం వచ్చిన ఆపరేటింగ్ సిస్టం వాడుకొనేటట్లు గౌరవిస్తే ఆయా పెద్ద సంస్థల కిటికీలను మూసి మనం ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలకి తలుపులు తెరుచుకోవచ్చు. 
  హెచ్.పి. వాడు తన ప్రింటర్లకి ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేయడం కోసం Hewlett-Packard Linux Imaging & Printing అన్న పరిష్కారాన్ని అందిస్తున్నాడు. 2220 వివిధ రకాల ప్రింటర్లు ముద్రణకి, స్కానింగ్ మరియు ఫాక్స్ కి మధ్ధతినిచ్చు విధంగా తయారుచేసిన HPLIP పూర్తిగా స్వేచ్ఛా సాఫ్ట్వేర్. డెబియన్, ఉబుంటు, మింట్ మరియు ఫెడోరా వంటి అన్ని ప్రసిధ్ది పొందిన ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేస్తుంది. పూర్తి సమాచారం మరియు HPLIP డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్చేయు విధానం కొరకు ఇక్కడ చూడవచ్చు. కనుక ఉచిత స్వేచ్ఛా ఆపరేటింగ్ సిస్టం వాడేవారు HP ప్రింటర్లను వాడడం మేలు.