ఇంకా మన దగ్గర విడుదలకాని ఫైర్ ఫాక్స్ మొబైల్ ఒయస్ చిత్రాలు

 ప్రముఖ ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అయిన ఫైర్ ఫాక్స్ ఇప్పుడు మొబైల్ రంగంలోకి ప్రవేశించింది. ఫైర్ ఫాక్స్ ఒయస్ పేరుతో ఒపెన్ సోర్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం విడుదలచేసింది. ఇప్పటికే జెటియి మరియు ఆల్కాటెల్ ఫైర్ ఫాక్స్ ఒయస్ తో ఫోన్లని విడుదల చేసినప్పటికి ఇంకా మన దేశంలో విడుదలకాలేదు. లినక్స్ కర్నెల్ పై నిర్మించబడిన ఈ మొబైల్ ఒయస్ హెచ్.టి.యం.యల్.5 ఆధారంగా తయారుచేయబడినది. తొదరలొనే యల్.జి మరియు సోని కంపెనీలు ఫైర్ ఫాక్స్ ఫోన్లని విడుదలచేయబోతున్నాయి.
 ఇక ఆపరేటింగ్ సిస్టం విషయానికొస్తే తక్కువ సామర్ధ్యం గల పరికరాలలో వేగంగా పనిచేయడానికి అనువుగా దీనిని తయారుచేసారు. ఫైర్ ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం యొక్క చిత్రాలు చూడండి.
 
హోంస్క్రీన్
 
నోటిఫికేషన్

వెబ్ అప్లికేషన్లు

ఫోన్ డయలర్

అప్లికేషన్లు

ఆప్ ల కోసం మార్కెట్ ప్లేస్

పరిచయాలను చేర్చుకోవడం

తెలుగు వికిపీడియా ఆప్
తెలుగు బానే చూపిస్తున్న వెబ్ బ్రౌజర్
పేస్ బుక్ అప్

కంప్యూటర్లో మొబైల్ వెబ్ సైటులు, మొబైల్లో డెస్క్ టాప్ వెబ్ సైటులు చూడడానికి

 కంప్యూటర్ ద్వారా మనం ఒక వెబ్ సైటును తెరిచినపుడు మన వెబ్ బ్రౌజర్ వెబ్ పేజి యొక్క పూర్తి రూపాన్ని మనకు దానంతట అదే మన తెర పరిమాణమునకు అనుగుణంగా మార్చి మనకు చూపిస్తుంది. అందువలన కంప్యూటర్లో మనకి వెబ్ సైటు యొక్క మొబైల్ రూపం కనిపించదు. ఫోన్లకి అనువుగా ఉండడం కోసం వెబ్ సైటు యొక్క మొబైల్ రూపం మామూలు వెబ్ పేజికన్నా తక్కువ డాటాని వాడుకుంటు తొందరగా లోడ్ అవుతుంది. కనుక నెట్ తక్కువ వేగం కలిగిన వారు వెబ్ సైట్ల యొక్క మొబైల్ రూపాన్ని ప్రయత్నించవచ్చు. మొబైల్ ద్వారా అంతర్జాలం చూడడం బాగా పెరిగిన ఈరోజుల్లో అన్ని ప్రముఖ వెబ్ సైటులు మరియు బ్లాగులు ప్రత్యేకంగా మొబైల్ రూపాన్ని కూడా అందిస్తున్నాయి. మీరు మీ బ్లాగును మొబైళ్ళకి అనుగుణంగా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి. ఒక వెబ్ సైటు యొక్క మొబైల్ రూపాన్ని మనం డెస్క్ టాప్ లో చూడాలనుకుంటే వెబ్ చిరునామా చివరన ?m=1 అని ఇవ్వాలి. ఉధాహరణకు www.spveerapaneni.blogspot.com సైటు మొబైల్ రూపాన్ని మనం చూడాలనుకుంటే www.spveerapaneni.blogspot.com/?m=1 అని వెబ్ చిరునామాని ఇవ్వాలి.
 వెబ్ సైట్ యొక్క మొబైల్ రూపం తక్కువ ఆప్షన్లతో వేగంగా లోడ్ అయ్యేవిధంగా ఉండడం వలన డెస్క్ టాప్ వెర్షనులో ఉన్న అన్ని ఆప్షన్లు మొబైల్ రూపంలో అందుబాటులో ఉండవు. మనం మొబైల్ నుండి ఒక వెబ్ సైటుని తెరిచినపుడు ఆ సైటు యొక్క మొబైల్ రూపం అందుబాటులో ఉంటే మన మొబైల్ బ్రౌజర్ ఆ సైటు యొక్క మొబైల్ రూపాన్ని మాత్రమే చూపించును. మనం ఎప్పుడైనా అవసరం ఉండి మొబైల్లో వెబ్ సైటు యొక్క డెస్క్ టాప్ వెర్షన్ని చూడాలనుకుంటే మన మొబైల్ బ్రౌజర్ లో "request desktop site" అన్న ఆప్షన్ని క్రింది చిత్రంలో చూపించినట్లు ఎంచుకుంటే సరి.

మొబైల్లో వెబ్ సైటు యొక్క డెస్క్ టాప్ వెర్షన్ని చూడాలనుకుంటే

వంపులు తిరుగుతు వయ్యారాలు పోతున్న ఫోన్లు

 ఫోన్ అన్నది ఫోన్ మాట్లాడుకోవడానికే మాత్రమే కాకుండా ఆటలు ఆడడానికి, ఫొటోలు, వీడియోలు తీయడానికి మరియు చూడడానికి, నెట్ చూడడనికి, దార్లు వెతుక్కోవడానికి మరియు టికెట్లు బుక్ చేసుకోవడానికి వంటి వివిధ అవసరాలకు ఉపయోగించడం సాధారణమైపోయింది. దానికి తగ్గట్టుగా ఫోన్ తయారీదారులు కూడా రోజుకో కొత్త మోడల్ తో వివిధ ఫీచర్లతో ఫోన్లను తయారుచేయడం, విడుదలచేయడం జరుగుతుంది. మెన్నటి వరకు హెచ్ డి ని ఇప్పుడు ఫుల్ హెచ్ డి అని డ్యూయల్ కోర్, క్వాడ్ర కోర్ ,2 జిబి రాం , ఎక్కువ మెగా పిక్సల్ కెమేరాలు అంటూ రకరకాల ఫీచర్లతో మన ముందుకొస్తున్నాయి. 
 ఇప్పుడు కొత్తగా ఎటువంచితే అటు వంగే ఫోన్లు తయారీ మొదలు పెట్టారు. స్మార్ట్ ఫోన్ దిగ్గజం సాంసంగ్ ముందుగా గెలాక్సి రౌండ్ అని వంగే ఫోన్ని తయారుచేస్తున్నామని ప్రకటించింది. దానికి పోటిగా యల్ జి వాడు జి ఫ్లెక్స్ అని మరొక వంగే ఫోన్ని ప్రకటించాడు. ఇంకా విడుదలకాని ఈ ఫోన్ల వయ్యారాలను క్రింది చిత్రాలలో చూడవచ్చు. 
 
సాంసంగ్ రౌండ్
 
యల్ జి ఫెక్స్
 
 ఏన్ని ఫీచర్లు కలిగిఉన్న ఫోన్లను తెచ్చినా నిలిచి ఉండే బ్యాటరీ సామర్ధ్యం, వేడెక్కకుండా ఉండడం, ఫోను తరచూ ఆగిపోకుండా ఉండడం, జారిపడిన పెద్దగా దెబ్బతినకుండా ఉండే ఫోన్లనే వినియోగదారుడు మొదట ఆదరిస్తాడన్నది సత్యం. కనుక మొబైల్ ఫోన్ తయారీదారులు వంపులు వయ్యారాల పై కన్నా వినియోగదారునికి ఉపయోగపడే విధంగా కనీస అవసరాలైన నిలిచి ఉండే బ్యాటరీ సామర్ధ్యం, వేడెక్కకుండా ఉండడం, ఫోను తరచూ ఆగిపోకుండా ఉండడం, పొరపాటున జారిపడిన పెద్దగా దెబ్బతినకుండా ఉండే ఫోన్లని తయారు చేయడంపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది.

వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోనే సాఫ్ట్వేర్ ఉచితంగా

 సాధారణంగా వివిధ వెబ్ సైట్లలో గ్యాలరీలుగా ఉంచిన సినితారల ఫొటోలు లేదా ఫేస్ బుక్ వంటి సామాజిక అనుసంధాన సైట్లలో ఉంచిన బంధుమిత్రుల ఫొటోలు మన కంప్యూటర్లో సేవ్ చేసుకోవాలంటే ప్రతి ఫొటోని తెరిచి సేవ్ ఇమేజ్ అన్న ఆప్షన్ని ఉపయోగించి సేవ్ చేసుకుంటాము. ఒకటి రెండు ఫొటోలంటే ఇలా సేవ్ చేసుకోవచ్చు. కానీ వందల ఫొటోలు డౌన్లోడ్ చేయాలంటే మాత్రం ఈ పధ్దతి పనికిరాదు. దీనివలన విసుగు, సమయం వృధా కావడం జరుగుతుంది. సగటు కంప్యూటరు వాడుకరి వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే బల్క్ ఇమేజి డౌన్లోడర్ వంటి సాఫ్ట్వేర్లు కొనుక్కోవలసిందేనా?
 అవసరం లేదు మనం డబ్బులు పెట్టకుండా ఉచితంగా వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్వేర్ ఉచితంగా పొందవచ్చు. లైక్, షేర్, రిజిస్టర్ మరియు సబ్ స్రైబ్ చేసుకోకుండానే ఎవరైనా ఉచితంగా పొందవచ్చు. ఎందుకంటే ఇది పూర్తిగా ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. డౌన్లోడ్ దెమ్ ఆల్ అన్న ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఉపయోగించి ఉచితంగా వందల కొద్దీ ఫొటోలూ ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొదట మనం డౌన్లోడ్ దెమ్ ఆల్ అను ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఇక్కడ నుండి ఇన్ స్టాల్ చేసుకోవాలి. దీనిని ఉపయోగించి వెబ్ పేజిలో ఉన్న అన్ని ఫొటోలను, అన్ని వీడియోలను, డాక్యుమెంట్లు లేదా మనకు కావలసిన ఫొటోలు లేదా వీడియోలను మరియు గ్యాలరీలో ఉన్న అన్ని ఫొటోలను ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ దెమ్ ఆల్ ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఎలా ఉపయోగించాలో About dTa! లో వీడియోలలో వివరించబడింది.

డౌన్ లోడ్ దెం ఆల్ యాడ్ ఆన్ ని తెరవడం
 
 డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్ని తెరిచి అక్కడ ఉన్న + బటన్ని నొక్కినపుడు క్రింది చిత్రంలో వలే మరొక విండో తెరవబడుతుంది. దానిలో మనం డౌన్ లోడ్ చేయాలనుకున్న గ్యాలరీకి సంభందించిన వెబ్ చిరునామాని మరియు ఎక్కడ సేవ్ చెయ్యాలి అన్నదాన్నిని సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ని నొక్కితే మనకు కావలసిన చిత్రాలు పూర్తి రిజొల్యూషన్ తో ఒకదాని తరువాత ఒకటి డౌన్ లోడ్ చేయబడతాయి.

డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్

 చిత్రాల యొక్క వెబ్ చిరునామాను ఎలా ఇవ్వాలి?
  మొదట ఒక చిత్రం యొక్క వెబ్ చిరునామాను తీసుకొని దానినిలో ఫొటో యొక్క సంఖ్య ని మనకు కావలసిన చిత్రాల ను బట్టి ఆ గ్యాలరీలో ఉన్న చిత్రాల సంఖను బట్టి [ఈ చిత్రం నుండి:ఈ చిత్రం వరకు] ఇలా మార్చుకోవాలి. ఉదాహరణకు www.example.org లో వంద చిత్రాలు ఉన్నాయనుకుంటే మొదటి చిత్రం యొక్క చిరునామా www.example.org/image1.jpg అనుకుంటే 1ని [1:100] గా మార్చుకోవాలి. అపుడు ఆ చిరునామా ఇలా ఉంటుంది. www.example.org/image[1:100]. ఆ చిరునామాని డౌన్ లోడ్ దెం ఆల్ మేనేజర్లో ఇచ్చి అన్ని చిత్రాలను ఒకేసారి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మీ బ్లాగును మొబైళ్ళలో చూడడానికి అనువుగా మార్చుకోవడానికి

 ఫోన్లు, టాబ్లెట్ల వంటి పరికరాలు మనకి కావలసిన ధరలలో అందుబాటులో ఉండడం, తక్కువ మొత్తం రీచార్జి చేసుకొని కూడా మొబైల్ నెట్ వాడుకొనే సౌలభ్యం, ప్రయాణాంలో ఉన్నప్పుడు, కంప్యూటర్ అందుబాటులో లేనపుడు, ఎక్కడ నుండి అయినా నెట్ వాడుకోగలిగే వెసులుబాటు ఉండడం వలన ఇప్పుడు మొబైల్ పరికరాలు(మొబైళ్ళు, టాబ్లెట్లు) ద్వారా కూడా బ్లాగులు చదువుతున్నవారు మునుపటితో పోల్చితే గణనీయంగా పెరిగారు.
 మీ బ్లాగు మొబైళ్లలో కూడా కనిపిస్తున్నప్పటికి అది డెస్క్ టాప్ కి ఉద్దేశించినది కనుక అది మొబైల్ పరికరాలలో చూడడానికి, చదవడానికి కొంత అసౌకర్యంగా(ఫాంట్ పరిమాణం, పేజి లోడ్ అవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ఎక్కువ నెట్ డాటాని వాడుకోవడం మరియు క్రిందికి పైకి కాకుండా ప్రక్కలకి కూడా జరిపి చూడాల్సిరావడం)ఉంటుంది. అందువలన మన బ్లాగును మొబైల్ వీక్షకులు కూడా చూడడానికి అనుకూలంగా మార్చడం తప్పనిసరి.
మొబైల్లో డెస్క్ టాప్ సైటు

















మొబైళ్ళలో చూడడానికి అనువుగా ఉన్న మొబైల్ సైటు

 బ్లాగు టెంప్లెట్ సెట్టింగ్స్ లో మొబైల్ పరికరాల్లో మొబైల్ టెంప్లెట్ ని చూపించు అని అమర్చితే దానంతట అదే మొబైళ్ళకి అనుకూలమైన ఫాంటు పరిమాణం, పరికరం యొక్క తెర పరిమాణానికి అణుగుణంగా మన బ్లాగును మార్చి చూపించును. టెంప్లెట్ సెట్టింగ్స్ లో మొబైళ్లకి ప్రత్యేకంగా ధీములు కూడా ఉన్నాయి. మనకి నచ్చిన ధీమును ఎంచుకోవచ్చు. ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు.
బ్లాగు టెంప్లెట్ సెట్టింగ్స్ లో మొబైల్ టెంప్లెట్ సెట్టింగ్స్