మీ బ్లాగును మొబైళ్ళలో చూడడానికి అనువుగా మార్చుకోవడానికి

 ఫోన్లు, టాబ్లెట్ల వంటి పరికరాలు మనకి కావలసిన ధరలలో అందుబాటులో ఉండడం, తక్కువ మొత్తం రీచార్జి చేసుకొని కూడా మొబైల్ నెట్ వాడుకొనే సౌలభ్యం, ప్రయాణాంలో ఉన్నప్పుడు, కంప్యూటర్ అందుబాటులో లేనపుడు, ఎక్కడ నుండి అయినా నెట్ వాడుకోగలిగే వెసులుబాటు ఉండడం వలన ఇప్పుడు మొబైల్ పరికరాలు(మొబైళ్ళు, టాబ్లెట్లు) ద్వారా కూడా బ్లాగులు చదువుతున్నవారు మునుపటితో పోల్చితే గణనీయంగా పెరిగారు.
 మీ బ్లాగు మొబైళ్లలో కూడా కనిపిస్తున్నప్పటికి అది డెస్క్ టాప్ కి ఉద్దేశించినది కనుక అది మొబైల్ పరికరాలలో చూడడానికి, చదవడానికి కొంత అసౌకర్యంగా(ఫాంట్ పరిమాణం, పేజి లోడ్ అవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ఎక్కువ నెట్ డాటాని వాడుకోవడం మరియు క్రిందికి పైకి కాకుండా ప్రక్కలకి కూడా జరిపి చూడాల్సిరావడం)ఉంటుంది. అందువలన మన బ్లాగును మొబైల్ వీక్షకులు కూడా చూడడానికి అనుకూలంగా మార్చడం తప్పనిసరి.
మొబైల్లో డెస్క్ టాప్ సైటు

















మొబైళ్ళలో చూడడానికి అనువుగా ఉన్న మొబైల్ సైటు

 బ్లాగు టెంప్లెట్ సెట్టింగ్స్ లో మొబైల్ పరికరాల్లో మొబైల్ టెంప్లెట్ ని చూపించు అని అమర్చితే దానంతట అదే మొబైళ్ళకి అనుకూలమైన ఫాంటు పరిమాణం, పరికరం యొక్క తెర పరిమాణానికి అణుగుణంగా మన బ్లాగును మార్చి చూపించును. టెంప్లెట్ సెట్టింగ్స్ లో మొబైళ్లకి ప్రత్యేకంగా ధీములు కూడా ఉన్నాయి. మనకి నచ్చిన ధీమును ఎంచుకోవచ్చు. ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు.
బ్లాగు టెంప్లెట్ సెట్టింగ్స్ లో మొబైల్ టెంప్లెట్ సెట్టింగ్స్